ప్రపంచంలో కీ బోర్డుని అత్యంత వేగంతో వాయించగల సమర్ధుడు,
భారతీయ రాగాల్ని పియానో మీద పలికించిన 'పాప్ పాషా' అద్నాన్ శామీ.
ఒకసారి ఇధియోపియాలో దారుణమైన కరువొచ్చింది..దానికి చలించిన అద్నాన్ శామీ'రన్ ఫర్ యువర్ లైఫ్' అనే గీతాన్ని స్వయంగా రచించి గానం చేస్తూ ప్రదర్శించారు.ఆ ప్రదర్శనకు వచ్చిన లక్షల మంది విరాళాలు అందించారు.శామీని ఐక్యరాజ్య సమితి శాంతి పతకంతో సత్కరించింది.
సంగీత రాయబారిగా ప్రకటించింది.
అద్నాన్ శామీ పాడిన ఊసరవెల్లి సినిమాలో 'నేనంటే నాకు చాలానే ఇష్టం' పాట చాలా బాగుంది.ఈ మధ్య వచ్చిన సినిమాల్లో నాకు నచ్చిన పాట ఇది..
తనను తాను ఇష్టపడే ఒక అబ్బాయి నేనంటే నాకు చాల ఇష్టం అంటూనే
నువ్వంటే ఇంకా ఇష్టం అంటూ తను ప్రేమించిన అమ్మాయిని నింగి నేలతో పోటీ పడుతూ ఎంతగా ఇష్టపడుతున్నాడో చెప్పే ఒక ప్రేమికుని మనసులోని అద్భుతమైన భావాలే ఈ పాట.
నేనంటే నాకు చా లానే ఇష్టం
నేనంటే నాకు చా లానే ఇష్టం
నువ్వంటే ఇంకా ఇష్టం
ఏ చోటనైనా వున్నా నీకోసం
నా ప్రేమ పేరు నీలాకాశం
చెక్కిళ్ళు ఎరుపయ్యే సూరీడు చూపైన
నా చేయి దాటందే నిను తాకదే చెలీ
ఎక్కిళ్ళు రప్పించే ఏ చిన్ని కలతైనా
నా కన్ను తప్పించి నను చేరదే చెలి చెలి చెలీ
నేనంటే నాకు చాలానే ఇష్టం
నువ్వంటే ఇంకా ఇష్టం
వీచే గాలీ నేను పోటీ పడుతుంటాం
పీల్చే శ్వాసై నిన్ను చేరేలా
నేలా నేనూ రోజూ సర్దుకుపోతుంటాం
రాణీ పాదాలు తలమోసేలా
పూలన్నీ నీ సొంతం .. ముళ్ళన్నీ నాకోసం
ఎండల్ని దిగమింగే నీడనై ఉన్నా
ఏ రంగు నీ నేస్తం అదేగా నా నేస్తం
నీ నవ్వుకై నేను రంగు మార్చనా
నేనంటే నాకు చాలానే ఇష్టం
నువ్వంటే ఇంకా ఇష్టం
చేదు బాధలేని లోకం నేనవుతా
నీతో పాటే అందులో ఉంటా
ఆటా పాటా ఆడే బొమ్మై నేనుంటా
నీ సంతోషం పూచీ నాదంటా
చిన్నారి పాపలకూ చిన్నారి ఎవరంటే
నీవంక చూపిస్తా అదుగో అనీ
ప్రియాతి ప్రియమైన ప్రయాణం ఏదంటే
టకాలని చెప్పేస్తా నీతో - ప్రేమనీ..
నేనంటే నాకు చాలానే ఇష్టం
నువ్వంటే ఇంకా ఇష్టం
సినిమా:ఊసరవెల్లి
రచన:రామజోగయ్య శాస్త్రి
సంగీతం:దేవిశ్రీ ప్రసాద్
గానం:అద్నాన్ శామీ
0 కామెంట్లు:
కామెంట్ను పోస్ట్ చేయండి