చేతవెన్నముద్ద చెంగల్వ పూదండ
బంగారు మొలతాడు పట్టు దట్టి
సందిట తావీదు సరిమువ్వ గజ్జెలు
చిన్నికృష్ణా! నిన్ను చేరి కొలుతు ...
సందిట తావీదు సరిమువ్వ గజ్జెలు
చిన్నికృష్ణా! నిన్ను చేరి కొలుతు ...
ముద్దుగారే యశోద ముంగిటా ముత్యము వీడు
దిద్దరాని మహిమల దేవకీ సుతుడు
అంతనింత గొల్లతల అరచేతి మాణిక్యము
పంతమాడే కంసుని పాలి వజ్రము
కాంతుల మూడులోకాల గరుడపచ్చపూసా
చెంతలమాలో నున్న చిన్నికృష్ణుడు
ముద్దుగారే యశోద ముంగిటా ముత్యము వీడు
దిద్దరాని మహిమల దేవకీ సుతుడు
రతికేళి రుక్మిణికి రంగు మోవి పగడము
మితి గోవర్ధనపు గోమేధికము
సతమై శంఖచక్రాల సందుల వైడూర్యము
గతియై మమ్ము గాచేటి కమలాక్షుడు
కాళింగుని తలలపై గప్పిన పుష్యరాగము
యేలేటి శ్రీవేంకటాద్రి యింద్రనీలము
పాల జలనిధిలోన బాయని దివ్యరత్నము
బాలునివలె దిరిగే పద్మనాభుడు
ముద్దుగారే యశోద ముంగిటా ముత్యము వీడు
దిద్దరాని మహిమల దేవకీ సుతుడు

దిద్దరాని మహిమల దేవకీ సుతుడు

పంతమాడే కంసుని పాలి వజ్రము
కాంతుల మూడులోకాల గరుడపచ్చపూసా
చెంతలమాలో నున్న చిన్నికృష్ణుడు

దిద్దరాని మహిమల దేవకీ సుతుడు

మితి గోవర్ధనపు గోమేధికము
సతమై శంఖచక్రాల సందుల వైడూర్యము
గతియై మమ్ము గాచేటి కమలాక్షుడు

యేలేటి శ్రీవేంకటాద్రి యింద్రనీలము
పాల జలనిధిలోన బాయని దివ్యరత్నము
బాలునివలె దిరిగే పద్మనాభుడు

దిద్దరాని మహిమల దేవకీ సుతుడు

0 కామెంట్లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి