పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

21, డిసెంబర్ 2011, బుధవారం

శ్రీమతికి శ్రీవారి ప్రేమలేఖ....!


చిత్రకారుల కుంచెకు చిక్కని అందమో..
కవుల
ఊహకు అందని భావమో..
తేనే
ఊటవో...మల్లెల తోటవో..
వెన్నెల
వాగులో వొంటరి నక్షత్రానివో..

కొలంబస్ కళ్ళు చూడని సౌందర్య ద్వీపమా
ఖండాలు
దాటిన కోహినూర్ వజ్రమా..
నీ
నవ్వులో నైలునది వొంపులు తిరుగుతుంది
కళ్ళతీరాలు
దాటి చూడలేని నన్ను
కలల
సునామీలో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నావు

కళ్ళు చేసుకున్న పుణ్యమో..
కలలు
రాసుకున్న కావ్యమో..
అందం
నీ దగ్గర పాఠాలు వల్లెవేస్తుంది
చూపు
నీ దగ్గర కొత్త సోయగాల్ని అద్దుకుంటుంది

అందాల
తాజ్ మహల్ ముందు మహరాణిలా కూర్చుని..
నువ్వు
చిరునవ్వులు చిందిస్తున్నప్పుడు
ఎవరందంగా
వున్నారంటే ఏమి చెప్పగలను..?
బహుశా
షాజహాన్ కూడా కొంచెం సందేహిస్తాడేమో..

నాలో చెలరేగే భావాల్ని వ్యక్తీకరించడానికి నా భాష చాలటం లేదు..
నిన్ను
వర్ణించడానికి శ్రీనాధుడు,కీట్స్ కలిసి రావాలేమో..
మళ్ళీ
డావెన్సీ కుంచె పట్టాల్సిందే.. తప్పదు..
మైకెలేంజిలో
మూడ్ తెచ్చుకోవాల్సిందే..

వేకువ
వనాలలో వాసంత సమీరమా..
ప్రకృతిని చూసి నీ మనసు రాగమైనప్పుడు..
చినుకులతో
కలిసి నీ పాదాలు తాళం వేసినప్పుడు..
అమాయకత్వం
లో అతిశయం లో చిలిపితనపు అల్లరి వేళల్లో
నీ
రూపాన్ని నా కళ్ళలో నిలిపిన క్షణాల్ని నేనెలా మరచిపోగలను?

నా
హృదయపు మైదానాల్లో
నేను
నిశ్శబ్ధంగా తోటమాలిలా పని చేసుకుంటున్నప్పుడు
దారిలో
రోజూ పలకరించే ఎర్రగులాబీ నువ్వు..
నాలోని
అలసిన బాటసారికి ఆఖరి మజిలీ నీ నవ్వు..

తలపుల
తుఫాన్ లో తడిసిపోయి..
కాసింత
వెచ్చదనం కోసం నీ ఊహల వాకిలిలో నిలుచున్నా..
నీ
ఊహల వెచ్చటి దుప్పటి కప్పుకున్నా..

Your's sweetheart
12 వ్యాఖ్యలు:

sandeep చెప్పారు...

తలపుల తుఫాన్ లో తను తడచిపోతూ
తన భావుకతా ప్రవాహంలో ఆమెని తేలియాడించిన
ఈ శ్రీవారి ప్రేమలేఖ చాలా బాగుంది..

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

Thankyou Sandeep Gaaru..

జ్యోతిర్మయి చెప్పారు...

WOW..ఇంతకంటే చెప్పడానికేమీ లేదు..

రసజ్ఞ చెప్పారు...

సో ఈ ఉత్తరం చదివానమాట మధురవాణి గారు రిప్లై ఇచ్చినది! బాగుందండీ శ్రీమతికి ప్రేమలేఖ!

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

ThankYou జ్యోతిర్మయి గారు..

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

రసజ్ఞ గారూ అంతేనంటారా?? :) :)
ప్రేమలేఖ నచ్చినందుకు థాంక్యూ..

Disp Name చెప్పారు...

అక్కడెవరో మధురవాణీ గారట, శ్రీ వారికి ప్రేమ లేఖ రాస్తున్నారు. ఇక్కడెవరో రాజీ గారట శ్రీమతి కి ప్రేమ లేఖ రాస్తున్నారు. వస్తున్నది క్రిస్సుమస్సు ! అవుతోంది మనసు కిస్సుమిస్సు !

చీర్స్
జిలేబి.

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

Zilebi" Garu ThankYou..
:)

సుభ/subha చెప్పారు...

రాజీ గారూ రోజుకొక కొత్త కోణం చూపిస్తున్నారు మీలో.. బాగుంది ప్రేమ లేఖ:) :)

మధురవాణి చెప్పారు...

What a coincidence!!!
మనిద్దరమూ ఒకే బొమ్మ పెట్టి ప్రేమలేఖలు రాసినట్టున్నాం కదా.. భలే భలే.. :)))))
బాగుందండీ మీ శ్రీవారి ప్రేమలేఖ.. :)

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

"రోజుకొక కొత్త కోణం చూపిస్తున్నారు మీలో"
Thankyou "సుభ"గారు..
I'm So Happy For Your Comment..:):)

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

మధురవాణి గారు ప్రేమలేఖ పోస్ట్ ఒక రోజు ముందు మీరు పెట్టారు..
ఈ బాపుబొమ్మ నా బాపుబొమ్మల కలెక్షన్ లొ వుంది అందుకే నేను కూడా మీరు శ్రీవారికి ప్రేమలేఖ రాస్తే
నేను శ్రీవారు రాసిన ప్రేమలేఖ పోస్ట్ పెట్టేశాను..
నా శ్రీవారి ప్రేమలేఖ నచ్చినందుకు థాంక్సండీ..:)

Related Posts Plugin for WordPress, Blogger...