పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

24, డిసెంబర్ 2011, శనివారం

నీ అనుమతి లేకుండా నిన్నెవరూ బాధపెట్టలేరు...

"నీ అనుమతి లేకుండా నిన్నెవరూ బాధపెట్టలేరు" అంటారు మహాత్మా గాంధీ..
ఎదుటి వ్యక్తి ఎవరైనా మనల్ని ఏదైనా అన్నప్పుడు అదే పనిగా మనం బాధపడుతున్నామంటే
మన మీద మనకు విశ్వాసం లేనట్లే..

సమాజం తమను గుర్తించాల్సినంతగా గుర్తించటం లేదన్న అసంతృప్తి చాలా మందిలో వుంటుంది.
సమాజం మనల్ని గుర్తించటానికి మనం మరింత ఎదగాలేమో,మనదైన రంగంలో
ఇంకా పరిపూర్ణత సాధించాలేమో అని ఎందుకు అనుకోకూడదు?
ఇతరుల్ని చూసి అసూయ పడుతున్నామంటే,మనలో లేని గొప్ప లక్షణాలేవో వాళ్ళలో ఉన్నట్లే కదా!
అవేమిటో తెలుసుకుంటే విజయం మనకు సొంతమైనట్లే.

ఒకసారి బుద్ధుడు తన ప్రియ శిష్యుడైన ఆనందుడిని వెంట పెట్టుకుని భిక్షాటనకి వెళ్ళాడు.
ఓ ఇంటి ముందు నిలబడి భిక్షాం దేహి అని అర్ధించాడు.ఆ ఇంటి ఇల్లాలు కోపంగా ఉన్నట్లుంది.
'అడుక్కు తినటానికి సిగ్గుగా లేదూ కష్టపడి పని చేసుకోవచ్చుగా'అని తిట్టిపోసింది.
బుద్ధుడు మౌనంగా ముందుకెళ్ళాడు.గురువుగార్ని అంతమాట అన్నందుకు,ఆనందుడు చాలా బాధపడ్డాడు.
ఇద్దరూ ఆరామానికి బయలుదేరారు.తన చేతిలోని భిక్ష పాత్రను శిష్యుడి చేతికి ఇచ్చాడు బుద్ధుడు.
కొంత దూరం వెళ్ళాక 'ఈ పాత్ర ఎవరిది' అనడిగాడు 'మీదే గురువు గారూ' అని చెప్పాడు ఆనందుడు.
'నీకే ఇచ్చేస్తున్నా తీసుకో' అని చెప్పాడు.
బుద్ధుడు ఇంకాస్త దూరం వెళ్ళాక 'ఆ పాత్ర ఎవరిది?' అని మరోసారి అడిగాడు .
నాదే గురువు గారూ అన్నాడు ఆనందుడు.
బుద్ధుడు చిరునవ్వు నవ్వి 'చూశావా? ఇదే ప్రశ్న మొదటి సారి అడిగినప్పుడు నాదన్నావు.
రెండోసారి అడిగితే నీదన్నావు.ఏదైనా సరే ఇది నాది అని ఆమోదించాకే నీదవుతుంది.
ఆ ఇల్లాలి తిట్టు కూడా అంతే!మనం వాటిని స్వీకరించకపోతే బాధ పడాల్సిన అవసరమే వుండదు'
అని వివరంగా చెప్పాడు బుద్ధుడు.
నిత్య జీవితంలో మనకు ఎదురయ్యే సంఘటనల్లో మనం దేనికి స్పందించాలి,దేనిని మనకు సంబంధం లేనిదిగా వదిలెయ్యాలి అన్న విషయాల్లో స్పష్టత వుంటే మన మానసిక ప్రశాంతతను మన నుండి ఎవరూ దూరం చేయలేరు..
ఎవరి మాటల, చేతల ప్రభావం మన జీవితాన్ని నిర్దేశించలేదు.

16 వ్యాఖ్యలు:

raf raafsun చెప్పారు...

రాజి గారు,
HOPE YOU FINE...

ఈ రోజు పొద్దున్నే మీ బ్లాగ్ చూసాను ఎంత బాగుందో....బ్లాగ్ లోకానికి వచ్చి టైం వేస్ట్ చేస్తున్నానా..అనిపిస్తుంది అప్పుడప్పుడు..కాని ఇలాంటి పోస్టులు చూసినప్పుడు..లేదు నన్ను నేను సరిదిద్దుకున్తున్నాను అనిపిస్తుంది...చాలా బాగా చెప్పారు,, మంచి ఉత్సాహాన్ని ఇచ్చారు...ధన్యవాదాలండి.....I LIKE THIS POST A LOT

శిశిర చెప్పారు...

బాగా చెప్పారు. మంచి పోస్ట్.

మాలా కుమార్ చెప్పారు...

అలా ఎవరేమన్నా , నన్ను కాదులే అని పట్టించుకోకుండా వుండటం కష్టమే . అలా వుండగలుగుతే అంతకు మించిన సుఖం ఇంకోటిలేదు .

సుభ/subha చెప్పారు...

రాజీ గారూ ఎంత బాగా చెప్పారండీ..నిజమే ఎవరి మాటలు, చేతలు మన జీవితాన్ని నిర్దేశించలేవు, అవి మనం సరిగ్గా అవగాహన చేసుకుంటే తప్ప.

రాజి చెప్పారు...

"raf raafsun" గారూ
I'm Fine Thankyou..
How Are You?

నా పోస్ట్ మీకు నచ్చినందుకు ఉపయోగకరంగా వున్నందుకు థాంక్స్ అండీ

రాజి చెప్పారు...

శిశిర గారూ..
పోస్ట్ నచ్చినందుకు థాంక్స్ అండీ

రాజి చెప్పారు...

మాలాకుమార్ గారూ మీరు చెప్పింది నిజమేనండీ.
కష్టమే కానీ కొన్ని సందర్భాల్లో తప్పదు..
మీ స్పందనకు ధన్యవాదములు..

రాజి చెప్పారు...

సుభ గారూ మీరు చెప్పినట్లే ఏ ఆలోచన
అయినా మన అవగాహనను అనుసరించే వస్తుంది..
Thanks For Your Comment..

జ్యోతిర్మయి చెప్పారు...

మీరప్పుడప్పుడూ ఇలా మంచి విషయాలు గుర్తుచేస్తూ ఉండండి రాజి గారూ...

చిన్ని ఆశ చెప్పారు...

సత్యమండీ, ఇది తెలిసినా ఆచరణ మహానుభావులకే సాధ్యం, కదూ!

raf raafsun చెప్పారు...

i too fine sis..:):)

రాజి చెప్పారు...

అలాగే జ్యోతిర్మయి గారు తప్పకుండా.
ThankYou Verymuch For Your Encouragement

రాజి చెప్పారు...

చిన్ని ఆశ గారూ నిజమేనండీ..
ఇలాంటివి ఆచరించటం మహనుభావులకే సాధ్యం.
మనం కూడా వాళ్ళంత కాకపోయిన కొంతైనా ఇలాంటివి ఆచరిస్తే బాగుంటుందని
నా అభిప్రాయాన్ని మీ అందరితో పంచుకున్నాను..
మీ అందరికీ నా అభిప్రాయాలు ఆలోచనలు నచ్చినందుకు
చాలా థాంక్స్ అండీ..

రాజి చెప్పారు...

@raf raafsun

I'm So Happy For Your Response
Brother
ThankYou :)

సాయి చెప్పారు...

రాజీ గారు... మీరు నమ్ముతారో లేదో కానీ నేను ఉదయం నుండి ఇలాంటి ఒక విషయం మీదనే బాధపడుతూ ఉన్నాను... మీ పోస్టు చదివాక నా మనసు స్ధిమితపడింది... నిజంగా ఆ దేవుడు నాకు మీ ద్వారా ఇది తెలియజేశాడేమో..... ధ్యాంక్యూ.....

రాజి చెప్పారు...

సాయి గారు మీరుచెప్పింది నేను నమ్ముతానండీ ఎందుకంటే ప్రతి మనిషికి ఇలాంటి సమస్య తప్పకుండా ఎదురవుతుంది..
అప్పుడు బాధ కలగటం సహజం..
ఆ బాధించే విషయం గురించే ఆలోచించి బాధపడటం కంటే ఆ విషయాన్ని అంతటితో వదిలెయ్యాలి అన్నది నా అభిప్రాయం..
నా మనసుకి అనిపించిన ఒక ఆలోచన
మీ మనసుకు స్వాంతనని కలిగించిందని,అది దేవుడు నా ద్వారా మీకు చెప్పించాడన్న మాట నాకు నిజంగా చాలా సంతోషాన్ని కలిగించింది.

మన ఆలోచన,మనం చేసె పనులు మనతోటి వారికి వుపయోగపడితే అంతకంటే సంతోషం ఏమీ వుండదు కదా..
మీ స్పందనకు ధన్యవాదములు
Be Happy always. :)

Related Posts Plugin for WordPress, Blogger...