అలుపన్నది వుందా కదిలే అలకు ఎదలోని లయకు..అదుపన్నది వుందా కలిగే కలకు కరిగే వరకూ..మెలికలు తిరిగే నది నడకలకు.. మరి మరి వురికే మది తలపులకు..నా కోసమె చినుకై కరిగి ఆకాశమే దిగదా ఇలకు నా సేవకే సిరులే చిలికి,దాసొహమే అనదా వెలుగు..ఆరారు కాలాల అందాలు బహుమతి కావా నా ఊహలకు..కలలను తేవా నా కన్నులకు

శుక్రవారం 30 డిసెంబర్ 2011

నా కవిత...!


చేతిలో కలంతో కాగితంపై గీస్తూ
మరోచేతి గోళ్ళను మునిపంటితో కొరికేస్తూ

కలువల్లాంటి కళ్ళకి శూన్యాన్ని చూపిస్తూ

మెదడుకు మేతను తినిపిస్తూ...


హృదయాన్ని తికమక పెట్టేస్తూ

మీ పెదవులపై నవ్వుని విరబూయిస్తూ

మంచి కవితనొకటి రాయాలని యోచిస్తూ

నడిరేయంతా మేల్కొన్నాను ఆలోచిస్తూ...


నాలుగక్షరాలని అటువిటు రాస్తూ

మురిసిపోయాను పైన, క్రింద చదివేస్తూ

నా పిచ్చిరాతలనుండి మిమ్మల్ని రక్షిస్తూ

సమయం మేల్కొల్పింది నన్ను వెక్కిరిస్తూ...


Telugu Quotes community

11 వ్యాఖ్యలు:

తెలుగు పాటలు చెప్పారు...

hmm nice:)

రాజి చెప్పారు...

ThankYou తెలుగు పాటలు gaaru :)

'Padmarpita' చెప్పారు...

చాలాబాగుంది కవిత.

రాజి చెప్పారు...

థాంక్యూ పద్మార్పిత గారు..
కానీ ఈ అభినందనలు నాకు కాదండీ
ఈ కవితరాసిన వాళ్ళకి :)

రాజి చెప్పారు...

పద్మార్పిత గారూ నాకు మీ అంత బాగా కవితలు రాయటం రాదండీ..
నేను ఎక్కడైనా చదివినవి,నాకు నచ్చినవి నా బ్లాగ్లో పోస్ట్ చేస్తుంటాను.
మీకు నచ్చిన "నా కవిత" కూడా అలాగ నాకు "Facebook Telugu Quotes Community"
లో దొరికింది.

Link:

http://www.facebook.com/photo.php?fbid=280810235286675&set=a.198753050159061.49814.198741476826885&type=1&permPage=1

ఈ కవిత ఎవరు రాశారో మీకు తెలిస్తే నాకు కూడా చెప్పండి.

సాయి చెప్పారు...

చాలా బాగుంది..

'Padmarpita' చెప్పారు...

రాజిగారు.....see my post కవిత రాయలేను.
http://padma4245.blogspot.com/2011/04/blog-post.html
which was posted on 08-4-2011.

రాజి చెప్పారు...

పద్మార్పిత గారు ఈ కవిత మీరే రాశారా?
నేను మీ బ్లాగ్ లో చూడలేదు.
Facebook లో చూశాను.
అక్కడ మీ పేరు లేదు మరి...

రసజ్ఞ చెప్పారు...

ఇది నేను ఇంతకముందే చదివాను! సేకరించినది ఫలానా చోటినుండి సేకరించాను అని చక్కగా నిస్సంకోచంగా ఒప్పుకునే మీరంటే నాకెంతో గౌరవం!

రాజి చెప్పారు...

థాంక్యూ "రసజ్ఞ"గారూ ఒకరి గొప్పతనాన్ని
మన గొప్పతనంగా చెప్పుకున్నంత మాత్రాన
అది మనకి గౌరవాన్ని తెచ్చిపెట్టదు కదండీ..
నా మీద మీకున్న మంచి అభిప్రాయానికి
I'm So Happy..
ThankYou.

రాజి చెప్పారు...

థాంక్యూ "సాయి" గారు..

Related Posts Plugin for WordPress, Blogger...