పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

1, జులై 2011, శుక్రవారం

నింగీ నేలా నాదే... yes You Can...


జీవితాన్ని ఎలాంటి వోటమి,వైకల్యం ఆపలేదని,భగవంతుడు మనకిచ్చిన జీవితాన్నిమనకి ఇష్టమైనట్లుగా
జీవించే ధైర్యం ప్రతి మనిషికీ అవసరమని,
మనిషికి తనమీద తనకు నమ్మకం వుంటే, ఏదయినా సాధించాలన్న పట్టుదల వుంటే, ఆత్మబలం తప్ప
మరెవరి
చేయూత అవసరంలేదన్న నిజాన్ని చూపుతుందీ సినిమా
...

ఓ దుర్ఘటనలో రెండు చేతులనూ కోల్పోయినా అధైర్యపడక, అన్ని కష్టాలనూ ధైర్యంగా ఎదుర్కుని,
మనోశక్తితో అన్ని వైకల్యాలను అధిగమించి జీవితాన్ని సాఫల్యం చేసుకోవచ్చని నిరూపించి
ఆత్మశక్తితో ఆత్మగౌరవాన్ని నిలుపుకున్న ఒక అమ్మాయి కధే "నింగీ నేల నాదే"..
చైనా సినిమా
"ఇన్విసిబుల్ వింగ్స్" కు తెలుగు అనువాదం...

సినిమాలో నాకు చాలా ఇష్టమైన పాట...

ఆరాటం ముందు ఆటంకం ఎంత
సంకల్పం ముందు వైకల్యం ఎంత
ధృడచిత్తం ముందు దురదృష్టం ఎంత
ఎదురీత ముందు విధిరాత ఎంత
నమ్మకము పట్టుదల నా రెండు రెక్కలుగా
ఎగిరేస్తా ఏలేస్తా నా ఆశల ఆకాశాన్నంతా

ఆరాటం ముందు ఆటంకం ఎంత
సంకల్పం ముందు వైకల్యం ఎంత
ధృడచిత్తం ముందు దురదృష్టం ఎంత
ఎదురీత ముందు విధిరాత ఎంత

చేజారెను చేతులు చెదిరేను గీతలు
చేజారెను చేతులు చెదిరేను గీతలు
బెదిరించిన భాదలే వివరించెను భోదలు
పాదాలను పిడికిలిగా నా గుండెను గుప్పిటగా
పాదాలను పిడికిలిగా నా గుండెను గుప్పిటగా
మలిచేస్తా గెలిచేస్తా సంతోషపు సామ్రాజ్యాన్నంతా

ఆరాటం ముందు ఆటంకం ఎంత
సంకల్పం ముందు వైకల్యం ఎంత
ధృడచిత్తం ముందు దురదృష్టం ఎంత
ఎదురీత ముందు విధిరాత ఎంత

పడిలేస్తూ ఉంటే పెరిగింది ధైర్యం
అడుగేస్తూ ఉంటే తరిగింది దూరం
చిరునవ్వేస్తుంటే సెలవంది శోకం
సహనంతో ఉంటే దొరికింది సైన్యం
చెమటోడుస్తుంటే పిలిచింది గమ్యం

పడిలేస్తూ ఉంటే పెరిగింది ధైర్యం
అడుగేస్తూ ఉంటే తరిగింది దూరం
చిరునవ్వేస్తుంటే సెలవంది శోకం
సహనంతో ఉంటే దొరికింది సైన్యం







Related Posts Plugin for WordPress, Blogger...