అలుపన్నది వుందా కదిలే అలకు ఎదలోని లయకు..అదుపన్నది వుందా కలిగే కలకు కరిగే వరకూ..మెలికలు తిరిగే నది నడకలకు.. మరి మరి వురికే మది తలపులకు..నా కోసమె చినుకై కరిగి ఆకాశమే దిగదా ఇలకు నా సేవకే సిరులే చిలికి,దాసొహమే అనదా వెలుగు..ఆరారు కాలాల అందాలు బహుమతి కావా నా ఊహలకు..కలలను తేవా నా కన్నులకు

గురువారం 5 జనవరి 2012

జయజనార్ధనా కృష్ణా రాధికాపతే...


జయజనార్ధనా కృష్ణా రాధికాపతే
జనవిమోచనా కృష్ణా జన్మమోచనా
గరుడవాహనా కృష్ణా గోపికాపతే
నయనమోహనా కృష్ణా నీరజేక్షణా
జయజనార్ధనా కృష్ణ రాధికాపతే
జనవిమోచనా కృష్ణ జన్మమోచనా

సుజనబాంధవా కృష్ణా సుందరాకృతే
మదనకోమలా కృష్ణా మాధవాహరే
వసుమతీపతే కృష్ణా వాసవానుజా
వరగుణాకరా కృష్ణా వైష్ణవాకృతే
సురుచిరాననా కృష్ణా శౌర్యవారిదే
మురహరావిభో కృష్ణా ముక్తిదాయక
విమలపాలకా కృష్ణా వల్లభిపతే
కమలలోచనా కృష్ణా కామ్యదాయకా

జయజనార్ధనా కృష్ణ రాధికాపతే
జనవిమోచనా కృష్ణ జన్మమోచనా

విమలగాత్రనే కృష్ణా భక్తవత్సలా 
చరణ
పల్లవం కృష్ణా కరుణకోమలం
కువలయేక్షనా కృష్ణా కోమలాకృతే
తవపదాంబుజం కృష్ణా శరణమాశ్రయే
భువననాయకా కృష్ణా పావనాకృతే
గుణగణోజ్వలా కృష్ణా నళినలోచనా
ప్రణయవారిధే కృష్ణా గుణగణాకరా
దామసోదరా కృష్ణా దీనవత్సలా

జయజనార్ధనా కృష్ణ రాధికాపతే
జనవిమోచనా కృష్ణ జన్మమోచనా

కామసుందరా కృష్ణా పాహిసర్వదా
నరకనాశనా కృష్ణా  నరసహయకా
దేవకీసుతా కృష్ణా కారున్యాంబుదే
కంసనాశనా కృష్ణా ద్వారక స్థితా
పావనాత్మకా కృష్ణా దేహిమంగళం
త్వత్పదాంబుజం కృష్ణా శ్యామకోమలం
భక్తవత్సలా కృష్ణా కామ్యదాయకా
పాలిసెన్ననూ కృష్ణా శ్రీహరీనమో

జయజనార్ధనా కృష్ణ రాధికాపతే
జనవిమోచనా కృష్ణ జన్మమోచనా

భక్తదాసనా కృష్ణా హరసునీ సదా
కాదునింతెనా కృష్ణా సలహయావిభో
గరుడవాహనా కృష్ణా గోపికాపతే
నయనమోహనా కృష్ణా నీరజేక్షణా
జయజనార్ధనా కృష్ణా రాధికాపతే
జనవిమోచనా కృష్ణా జన్మమోచనా
గరుడవాహనా కృష్ణా గోపికాపతే
నయనమోహనా కృష్ణా నీరజేక్షణా

జయజనార్ధనా కృష్ణా రాధికాపతే
జనవిమోచనా కృష్ణ జన్మమోచనా






అందరికీ వైకుంఠ ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలు.


14 వ్యాఖ్యలు:

kastephale చెప్పారు...

ఈ పాట ఎక్కడ వినపడితే అక్కడ ఆ పాట పూర్తయ్యీ దాక నిలబడి విని కదలడం నా అలవాటు. ఈ పాట ఈ రోజు ఇక్కడ వినడం బ్రహ్మానందం.

సుభ/subha చెప్పారు...

రాజీ గారూ మీక్కూడా ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలండీ..

వనజ వనమాలి చెప్పారు...

chaalaa baagundhi raajee gaaru.

hare raama hare krishna krishna krishna hare hare..

meeku mukkoti yekadashi shbhaakaankshalu.

మాలా కుమార్ చెప్పారు...

ఆ మద్య ఓ బ్లాగ్ లో ఈ పాట విని చాలా బాగుందనుకున్నాను . ఎవరో చిన్న పాప పాడిందన్నారు . జగపతి కూతురు పాడిందని కూడా అన్నారు .
మీకు కూడా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు .

రాజి చెప్పారు...

"kastephale" గారూ ధన్యవాదములు.
ఈ పాట నాకు కూడా చాలా ఇష్టమండీ..
మీకు ఏకాదశి శుభాకాంక్షలు.

రాజి చెప్పారు...

"సుభ/subha" గారూ ధన్యవాదములు
మీకు ఏకాదశి శుభాకాంక్షలు.

రాజి చెప్పారు...

"వనజవనమాలి" గారూ ధన్యవాదములు
మీకు ఏకాదశి శుభాకాంక్షలు.

రాజి చెప్పారు...

"మాలా కుమార్" గారూ ధన్యవాదములు
మీకు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు.
ఈ పాట 3 సంవత్సరాల చిన్న పాప పాడిందటండీ..
చాలా బాగా పాడింది.వింటుంటే చాలా బాగుంటుంది.

శశి కళ చెప్పారు...

యెంత బాగుందొ....మీకు యెకాదశి శుభాకాంక్షలు

రాజి చెప్పారు...

Thank You శశికళ గారూ!
మీక్కూడా ఏకాదశి శుభాకాంక్షలు.

రసజ్ఞ చెప్పారు...

ఇవాళ పూజ చేసేటప్పుడు కృష్ణుడు కనిపించలేదు ఏమయ్యాడా అని తెగ వెతికేసాననుకోండి ఇక్కడున్నాడా? ఎంత బాగున్నాడో ఎంతో మంచి పాట!

మాలా కుమార్ చెప్పారు...

మీ బ్లాగ్ లో కూకూ వాచ్ చూడటం నాకు ఇష్టం . ఇప్పుడు ఈ పాట వింటూ పదకొండుసార్లు కుకూ గంటలు కొట్టటం కావటం చూసాను :)

రాజి చెప్పారు...

అవునా రసజ్ఞ గారు ఐతే కృష్ణుడు మీకు
చెప్పకుండా నా చిన్నిప్రపంచానికి వచ్చేశాడన్న మాట...
మరి ఇంతకీ ఇప్పుడు దొరికాడు కదా మీకు :)

రాజి చెప్పారు...

థాంక్యూ "మాలాకుమార్" గారు..
నాకు కూడా ఈ వాచ్ చాలా ఇష్టమండీ..
నేను నా బ్లాగ్ చూస్తున్నప్పుడు ఇలాగే గంటలు కొడితే
ఎవరైనా విజిటర్స్ వచ్చి బ్లాగ్ చూస్తున్నప్పుడు కూడా ఇలాగే గంటలు కొడతాయి కదా అనుకుంటాను.
ఇప్పుడు నా సందేహం తీర్చేశారు ఆ వాచ్ గురించి
మీ మంచి ఫీలింగ్ చెప్పి :)

Related Posts Plugin for WordPress, Blogger...