అలుపన్నది వుందా కదిలే అలకు ఎదలోని లయకు..అదుపన్నది వుందా కలిగే కలకు కరిగే వరకూ..మెలికలు తిరిగే నది నడకలకు.. మరి మరి వురికే మది తలపులకు..నా కోసమె చినుకై కరిగి ఆకాశమే దిగదా ఇలకు నా సేవకే సిరులే చిలికి,దాసొహమే అనదా వెలుగు..ఆరారు కాలాల అందాలు బహుమతి కావా నా ఊహలకు..కలలను తేవా నా కన్నులకు

శనివారం 28 జనవరి 2012

శ్రీ పంచమి - సరస్వతీ స్తుతి


యా కుందేందు తుషార హార ధవళా
యా శుభ్ర వస్త్రాన్వితా
యా వీణా వర దండ మణ్డిత కరా
యా శ్వేత పద్మాసనా
యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిహి
దేవైస్సదా పూజితా
సా మాం పాతు సరస్వతీ భగవతీ
నిశ్శేష జాడ్యాపహా

శ్వేత వస్త్రాలతో అలంకృతమై,హంసవాహినిగా,
తెల్లని తామర పుష్పంపై కొలువుతీరిన వీణాపాణి జ్ఞానానంద పరాశక్తి.
శ్రద్ధ , ధారణా, మేధా, విధి, వల్లభా, భక్తజిహ్వాగ్రసదన, శమాది గుణదాయిని
అనే సప్త నామధేయాలతో విరాజిల్లే విద్యా స్వరూపిణి.
బుద్ధి, స్మృతి,వాక్కు,విద్య ఆ దివ్య జనని అనుగ్రహ ఫలాలు

అమ్మ చెంతనే వుండే అమ్మ వాహనం హంస - పాలను, నీటిని వేరు చేస్తుంది.
అలాగే మానవులు కూడా మంచి,చెడుల విచక్షణాజ్ఞానంతో మసలుకోవాలని సరస్వతిమాత
తన హంసవాహనం ద్వారా సందేశం ఇస్తుంది .

అజ్ఞాన తీరాలనుండి విజ్ఞానపు వెలుగు వైపుకి నడిపించి,జీవితంలో అవసరమైన జ్ఞాన సంపదను,
కరుణాకటాక్షాలను అనుగ్రహించమని ఆ వాగ్దేవిని శ్రీ పంచమి సందర్భంగా ప్రార్ధిస్తూ
అందరికీ శ్రీ పంచమి శుభాకాంక్షలు.
సరస్వతీ స్తుతి



6 వ్యాఖ్యలు:

భారతి చెప్పారు...

చక్కటి వివరణ.
శ్రీ పంచమి శుభతరుణమున ఆ జ్ఞానస్వరూపిణి కరుణా కటాక్షాల్ని పరిపూర్ణంగా మీరు అందుకోవాలని ఆకాంక్షిస్తూ.....
శ్రీ పంచమి శుభాకాంక్షలు.

రాజి చెప్పారు...

"భారతి" గారూ ధన్యవాదములండీ..
నా చిన్నిప్రపంచానికి స్వాగతం.
శ్రీ పంచమి రోజున అమ్మవారి నామంలో ఒకటైన పేరు కలిగిన మీ ద్వారా ఈ దీవెన అందుకోవటం
స్వయంగా ఆ సరస్వతీదేవి నన్ను దీవించినట్లుగా అనిపించింది..కృతజ్ఞతలు!

Lasya Ramakrishna చెప్పారు...

చాలా చక్కగా వివరించారండి.

రాజి చెప్పారు...

"Lasya Ramakrishna"
గారూ ధన్యవాదములండీ..

తెలుగు పాటలు చెప్పారు...

ఈ పాట నాకు చాల ఇష్టం

రాజి చెప్పారు...

"తెలుగు పాటలు" గారూ ధన్యవాదములండీ..

Related Posts Plugin for WordPress, Blogger...