పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

2, మార్చి 2012, శుక్రవారం

స్మితా - ఇషానా



 

తెలుగు పాప్ సింగర్ స్మిత ఇప్పటిదాకా ఓల్డ్ తెలుగు సాంగ్స్ ని రీమిక్స్ చేసిన సింగర్ గా,ప్లేబ్యాక్ సింగర్ గా తెలుసు. కానీ ఇప్పుడు స్మిత తన "శైలికి భిన్నంగా" Devotional ఆల్బమ్ తయారు చేశారు.నాకు ఈ మ్యూజిక్ ఆల్బమ్ నచ్చటానికి ముఖ్యమైన కారణం ఈ ఆల్బమ్ లోని పాటలు కోయంబత్తూర్ లోని సద్గురు ఆశ్రమంలోని ధ్యానలింగం, లింగభైరవి ఆలయాలలో చిత్రీకరించారు.ఇషా ఫౌండషన్ గురించి తెలుసుకున్నప్పటి నుండి నాకు సద్గురు ఆశ్రమంలోఈ దేవాలయాలు ఎంతగానో నచ్చాయి.ఇంతకుముందు నా బ్లాగ్ లో ఈ ఇషా ఫౌండషన్ గురించి కూడా రాశాను.

ఆ ఆశ్రమం పరిసరాల్లో,ఆలయాల్లోని ప్రశాంతమైన ఆధ్యాత్మిక వాతావరణంలోస్మిత తయారు చేసిన ఇషానా ఆల్బమ్ లో పాటలు,స్తోత్రాలు బాగున్నాయి.ఈ పాటల ద్వారా ఆశ్రమాన్ని, ఆలయంలోని ధ్యానలింగాన్ని, అమ్మవారిని,అక్కడి ఉత్సవాలను,పూజలను చూడటం చాలా బాగుంది..ఈ వీడియోలను చూస్తుంటే తప్పకుండా వెళ్లి ఆ ఆశ్రమాన్ని.ఆలయాలను చూడాలి అనిపిస్తుంది.

 
ఓం నమః శివాయ .. మహాదేవాయ నమః 


అంబా శాంభవి



8 కామెంట్‌లు:

Lasya Ramakrishna చెప్పారు...

రాజీ గారు, మాకు మంచి ఆల్బం పరిచయం చేసారు. ధన్యవాదాలు.

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

ThankYou "Lasya Ramakrishna" Gaaru..

సుభ/subha చెప్పారు...

పోన్లెండి పాత పాటలని ఖూని చేయకుండా దేవుడు దారి ఇలా మళ్ళించాడన్నమాట;).ఏమైనా తప్పుగా అంటే క్షమించండి రాజీ గారూ ఆవిడ ఒకవేళ మీ అభిమాన పాప్ సింగర్ ఐతే కనుక..

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

"సుభ" గారూ.. మీరు పొరబడ్డారు ఈ విషయంలో నాకు అభిమాన పాప్ సింగర్ ఫాల్గుణి పాఠక్ మాత్రమే..
స్మిత గురించి నేను ముందుగానే నా పొస్ట్ లో రాశానండీ తన శైలికి భిన్నంగా అని..
దాన్ని మీరు మన భాషలొ చక్కగా చెప్పారు "ఖూనీ" అని :)
నాకు ఈ ఆల్బం లో నచ్చింది ఇషా ఫౌండేషన్ ఆశ్రమం మాత్రమే.

మాలా కుమార్ చెప్పారు...

మీరు చెప్పినట్లే వెంటనే వెళ్ళి ఆశ్రమం చూడాలనిపిస్తోందండి . బాగుంది .

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

"మాలా కుమార్" గారూ థాంక్సండీ..
ఆశ్రమం చూడాలన్న మనిద్దరి కోరిక త్వరలోనే
తీరాలని కోరుకుంటాను..

cbrao చెప్పారు...

పరిచయం బాగుంది. పాటల గొలుసులు తెరుచుకొవటం లేదు. Copyright Violation ఉన్న చలనచిత్ర గొలుసులను తొలగించగలరు.

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

cbrao గారూ పోస్ట్ నచ్చినందుకు, మీ స్పందన తెలియచేసినందుకు ధన్యవాదాలండీ.

పాటలు మార్చాను.. యూట్యూబ్ లో వీడియోలు ఏదో ఒక Copyright Violation తో తీసేస్తూనే ఉన్నారు.
అది ఒక సమస్య అయింది. నా పాటల బ్లాగ్ లో ఇలాగే అవుతుంది.
పోస్ట్ సరిచేయటానికి హెల్ప్ చేసినందుకు thanks అండీ ..

Related Posts Plugin for WordPress, Blogger...