30, ఏప్రిల్ 2012, సోమవారం
కన్నె అందమా ... కనకమందమా...??
మా ఆయన బంగారం,మా బాబు బంగారు కొండ,ఆ అమ్మాయి పుత్తడి బొమ్మ అంటూ మంచి వాటిని పోలిక పెట్టటానికి బంగారమే వాడుతుంటాము.బంగారం మీద మోజు పడని వాళ్ళు,కావాలని కోరుకోని వాళ్ళు ఉండరేమో నాకు తెలిసి..
బంగారం లేనిదే కుటుంబాల్లో శుభకార్యాలు జరగవు.అమ్మాయి పెళ్లి లో ప్రముఖ పాత్ర పోషించేది బంగారమే... ప్రపంచం మొత్తం డబ్బు చుట్టూ తిరుగుతుంది అంటారు.అలాగే డబ్బు తర్వాత స్థానం మాత్రం ఈ బంగారానిదే..ధర పెరిగితే డిమాండ్ తగ్గుతుందన్న ఆర్ధికశాస్త్ర ప్రాధమిక సూత్రం కూడా ఈ బంగారం మోజు ముందు చిన్నబోతుంది.
వందేళ్ళ క్రితం బంగారం రూపాయి నలభై పైసలట. మన ఇళ్ళల్లో తాతయ్యలో, బామ్మలో మా రోజుల్లో తులం బంగారం ముప్ఫై రూపాయలు అంటే వినటానికి తమాషాగా ఉంటుంది, అలాగే ఆరోజుల్లోఎక్కువ బంగారం ఎందుకు కొనలేదో వీళ్ళు అని కొంచెం బాధగా కూడా అన్పిస్తుందేమో కానీ... 1925 లో తులం బంగారం ధర 18 రూపాయలు మరి ఇప్పుడు బంగారం ధర 30,000 అవుతున్నా ధరతో సంబంధం లేకుండా కోనేస్తున్నాం.. రేటులో ఎన్ని హెచ్చుతగ్గులు వచ్చినా కొనాలన్న ఆలోచన మాత్రం మానుకోము. అందాలకి,అలంకరణలకి మాత్రమే కాదు ఆపదలో కూడా ఆదుకునే ఈ బంగారం ధర ఇప్పుడు చుక్కల్లోనే అయినా బంగారం స్థానం మాత్రం మన మనసుల్లోనే..ఎందుకంటే అది బంగారం కదా మరి.
బంగారం అంటే ఇష్టపడని వాళ్ళు ,ఆభరణాలు పెట్టుకోవాలని కోరుకోని ఆడవాళ్ళు వుండరు కదా..అలాగే నాకు కూడా చాలా ఇష్టమైనది బంగారం.బంగారం నగల యాడ్స్, నగల మోడల్స్ పిక్చర్స్ సేకరించటం ఇష్టం .. ఒకప్పుడు నగల మోడల్స్ ఫొటోస్ ఒక పెద్ద ఆల్బం నిండా కలెక్ట్ చేసేదాన్ని .. ఇప్పుడు నెట్ లో కలెక్ట్ చేస్తున్నాను.
అలా నెట్ లో ఈ అందమైన అపరంజి బొమ్మలని చూడగానే ఈ పోస్ట్ పెట్టాలనిపించింది ...
లేబుళ్లు:
అందాలు - అలంకరణలు,
మహిళాలోకం
16 కామెంట్లు:
నా పెళ్ళప్పుడు తులం 200 రూపాయలట . అప్పుడే ఎక్కువెందుకు కొనలేదని అప్పుడప్పుడు మా అమ్మతో సరదాగా అంటూవుంటాను :) అప్పుడు అంత కొనటమే మాకు కష్టమైంది అంటుంది మా అమ్మ .ఎప్పుడైనా ఏ గొలుసో , గాజో కొందామనుకుంటే మా మామగారు దొంగోడు మెడ కత్తిరిస్త్తాడు అని భయపెట్టేవారు . దానితో మా అమ్మాయి పెళ్ళిదాకా నేను బంగారమే కొనలేదు . ఆ తరువాత మా అబ్బాయి పెళ్ళికే . మా మామగారి బెదిరింపు అలవాటు మా వారికీ వచ్చింది . దానితో నాకు బంగారం కొనాలంటేనే భయం :)
oh..Good post. nenu oppukonu..Shreya ghoshal..pic..yekkada!?
anyaayam Raajegaaru.
రాజి గారు! కడుపు నిండిపోయింది ఈ రోజు కి ....lol..
అసలు ఏమి collection పోస్ట్ చేసారండి? ఒక్కొక్క design is unique! అన్ని సొంతం చేసుకోవాలని ఉంది.. మా అమ్మాయి, నాకు ఒక వార్నింగ్ ఇవ్వడం జరిగింది. గత ఎన్నో years గా ఇండియాలో అడుగుపెట్టటం తరువాయి,
jewelry shops చుట్టూ తిరుగుతున్నావు. ఇక పై అన్ని బంద్. నాకు ఇండియా చూడాలని ఉంది..ఇక పై నువ్వు బంగారం కొనటానికి వీలు లేదు అని order వేసిందండీ! కాని మనసు ఊరుకోదు కదా...I loved your post like a typical female!
బంగారం ధరలు మీరు చెప్పినవి చాలా ఆశ్చర్యం గా వున్నాయి.అలాగే ఫొటొస్ చాలా అందము గా అవున్నాయి.
"మాలా కుమార్" గారూ..
మీ బంగారం జ్ఞాపకాలు బాగున్నాయండీ..
నేను కూడా అమ్మతో అంటుంటాను "ఆ రోజుల్లో బంగారం ఎందుకు ఎక్కువ కొనలేదు అని"
పెద్దవాళ్ళు భయపెడతారని కాదు కానీ దొంగల భయం కూడా నిజమేనండీ..
ఎక్కువ నగలు వేసుకుని ఎక్కడికైనా వెళ్ళినా ప్రశాంతత వుండదు,అలాగని ఇంట్లో వుంచి వెళ్ళినా ప్రశాంతత వుండదు :)
నా పోస్ట్ నచ్చినందుకు,మీ స్పందన తెలియచేసినందుకు థాంక్సండీ..
"వనజవనమాలి" గారూ..
పోస్ట్ నచ్చినందుకు థాంక్సండీ!
శ్రేయా ఘోషల్ పిక్చర్స్ అంత మంచివి లేవని పెట్టలేదండీ..
ఇప్పుడు మీరు అడిగారు కదా అందుకే పెట్టేశాను చూడండి.
జలతారు వెన్నెల గారూ...
collection నచ్చినందుకు థాంక్సండీ..
మీ అమ్మాయి ఇండియా చూడాలన్న కోరిక,మీ jewellery shopping కోరికా రెండూ తీరాలంటే..ఇద్దరూ ఇండియా చూస్తూ అన్ని ప్రాంతాల్లో jewellery shopping చేయండి!
కానీ బంగారం కొనే విషయం లో మీ అమ్మాయి మీమాట వినటమే మంచిదేమో :)
oddula ravisekhar గారూ..
పోస్ట్,ఫోటోలు నచ్చినందుకు మీ స్పందన తెలియచేసినందుకు థాంక్సండీ..
అబ్బో! చాలా నగల్తో నింపేసింది రాజి:) ఏమైందా కనిపించట్లేదు అనుకుంటున్నా, ఇదన్న మాట సంగతి.
ఒకప్పుడు రూపాయే అయినా ఆ తరువాత ముప్పై అయినా ఇంకొంతకాలానికి వందో, వెయ్యో అయినా ఎప్పటికప్పుడు అది ఎక్కువ ధరకిందనే చెప్పుకునేవారు. సరే, ఇప్పటి విషయం పూర్తిగా వేరు. బాగానే కొంటున్నారుగా!!! అసలిప్పుడే ఎక్కువ కొంటున్నారేమో....
"జయ" గారూ.. ఐతే నేను కనిపించకపోతే నా కోసం ఆలోచించారన్నమాట.. ఈ విషయం నాకు ఈ బంగారం కంటే చాలా సంతోషాన్ని కలిగించిందండీ!!
నిజమేనండీ బంగారం ఎంత ఎక్కువ ధర ఐనా ఇప్పుడే ఎక్కువగా కొంటున్నట్లున్నారు..
మీ స్పందనకు థాంక్సండీ..
అబ్బా...అసలే ధరలు చూసి బయపడుతుంటే...ఏమి కల్లెక్షన్ పెట్టారు...అంటే చూసి కళ్ళు నిమ్పుకున్దాము...వేసుకోవాలంటే దొంగల భయం...
"శశికళ" గారూ..
కలెక్షన్ నచ్చినందుకు థాంక్సండీ..
బంగారం కొనాలంటే ఆల్ టైం రికార్డ్ రేటు భయం, వేసుకోవాలంటే దొంగల భయం అందుకే మీరన్నట్లు
ఇంక చూసి సంతోషించటమే :)
ఈరోజుల్లో 'మా ఆయన బంగారం' అనే సర్టిఫికేట్ 'బంగారంలాంటి భర్తలకంటే' బంగారం కొనే భర్తలకే దక్కుతుందేమోనని నా అనుమానం రాజీగారూ.
"బాలు" గారూ..
మీ అనుమానం నిజమేనేమో!
"బంగారం లాంటి భర్త" బంగారమే కానీ
"బంగారం కొనే భర్త" కొంచెం ఎక్కువ బంగారమన్నమాట :)
కనకం లాంటి కన్నె అందం :) నాకెందుకో ఇంత బరువుగా, పెద్దగా ఉండేవి అస్సలు నచ్చవు సింపుల్‌గా క్యూట్‌గా ఉంటే ఇష్టం.
"కనకం లాంటి కన్నె అందం" నిజమే :)
రసజ్ఞ గారూ మీ టేస్ట్ బాగుంటుందండీ...
కానీ పెళ్ళిలో కూడా అలాగే సింపుల్ గా క్యూట్ గా ఉంటే ఇష్టం. అంటే కుదరదేమో :):)
కామెంట్‌ను పోస్ట్ చేయండి