పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

10, మే 2012, గురువారం

మా పావురాల ప్రేమ ఊసులు ...


మా ఇంటి దగ్గర పావురాలు మాకు అతిధులు..మేము పిలవకపోయినా వచ్చి ఇంటి చుట్టూ సందడి చేస్తుంటాయి.ఈ ఎండకి మా బాల్కనీ,స్లాబ్ గట్లు ,విండో లు వాటికి స్థావరాలు.. ఆ పావురాల్ని చూడటం, ఫోటోలు తీసుకోవటం నాకు సరదా ఐతే... ఇల్లు చుట్టు పక్కలంతా శుభ్రం చేయటానికి మా భారతమ్మకు మహా కష్టం..
ఏంటమ్మా వాటిని కొట్టనివ్వవు ఇల్లంతా పాడు చేస్తుంటే అని తెగ బాధ పడిపోతుంది..

ఒక పావురం ముందుగానే వచ్చి మరో పావురం కోసం ఎదురు చూస్తూ కూర్చుని, తను ఎదురుచూస్తున్న పావురం రాగానే ముచ్చట్లు,ఆలస్యంగా వచ్చిందని అలకలు..
ఎప్పుడూ ప్రేమికులకు ప్రేమ సందేశాల్ని అందించే పావురాలు తమ మనసులోని ప్రేమ గురించి చెప్పుకుంటున్న ఊసులు ... ఫొటోలతో పాటూ నాకు"నచ్చిన" ... "వచ్చిన కాదు" :) కవిత కూడా ...

మా పావురం ఎదురుచూపులు - కవిత్వాలు


ఎన్నాళ్ళు ప్రియా నా ఎదురుచూపులు
మనసూ మనసుకు మధ్య మరచిపోలేని మమతానురాగాలు
మరువగలవా ప్రియా ?? మరపురాని సంఘటనలు
ఎందుకు ప్రియా ఆకాశానివై అందనంటావు??


ఎండమావివై దొరకనంటావు ...
పాద రసమై పట్టుబడనంటావు...
కలువపువ్వువై నన్ను కవ్వించరావా ...
మల్లె తీగవై నన్ను అల్లుకోవా?


కంటిలో కనుపాపలా నాలో కలిసిపోవా
చీకటిలో చిరు వెలుగువై రావా..
చినుకులా నా మీద పడి నా కౌగిలిలో కరిగిపోవా
కల అనుకున్న నా జీవితాన్ని నిజం చేయలేవా !!!


13 కామెంట్‌లు:

శశి కళ చెప్పారు...

హ...హ...భలే ఉంది అండి మీ పావురాల కవితాలాపన...నిజంగా చాలా చక్కగా వర్ణించారు.

మాలా కుమార్ చెప్పారు...

మీ పావురాల ఊసులు బాగున్నాయండి .

మా ఇంట్లోనూ బాదం చెట్టు మీద , డాబా మీద తెగ సందడి చేస్తాయి . ఆవాలు , మెంతులు , మాగాయి ముక్కలు ఏవి ఆర బోసినా అవి రుచి చూడాల్సిందే ! ఫొటో తీసుకోబోతే తుర్రున ఎగిరిపోతాయి .

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

కపోతాల ఊసులు.. మీ మనసులోని మాటలు చాలా బాగున్నాయి రాజీ.. గారు.
యెంత బాగా కవితలల్లారు. అఫ్కోర్స్.. మాట అయినా కవిత్వంలా ఉండటం అయినా ఇదే! చాలా బాగుంది. కీప్ ఇట్ అప్.

Sai Bharadwaj చెప్పారు...

చాలా బాగా వర్ణించారు.. సూపర్...

చెప్పాలంటే...... చెప్పారు...

photos baavunnaYI MI COMMENTS KAVITALU BAAVUNNAYI

జ్యోతిర్మయి చెప్పారు...

రాజి గారూ మీ పావురాలు బావున్నాయండీ..

జలతారు వెన్నెల చెప్పారు...

పావురాల చిత్రాలు, మీ కవిత రెండు బాగున్నాయి రాజి గారు.

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

@ "శశి కళ" గారూ..

మా పావురాల కవితాలాపన,నా వర్ణన నచ్చినందుకు థాంక్సండీ..

@ "మాలా కుమార్" గారూ..

ఐతే మీకు కూడా పావురాలు అతిధులేనన్నమాట..
నిజమేనండీ పారిపోవటం లో ఫస్ట్ ఇవి అంత తేలిక గా దొరకవు :)
మా పావురాల ఊసులు నచ్చినందుకు,మీ పావురాల ఊసులు కూడా చెప్పినందుకు థాంక్సండీ..

@ వనజవనమాలి గారూ..

మా కపోతాల ఊసులు,నా మనన్సులోని మాటలు మెచ్చి మీరు అభినందించినందుకు థాంక్సండీ..

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

@ సాయి భరద్వాజ్ గారూ..

మా పావురాల ఊసుల వర్ణన నచ్చినందుకు థాంక్సండీ!

@ చెప్పాలంటే......

మంజు గారూ.. ఫొటో,కామెంట్స్,కవితలు మొత్తానికి మా పావురాల ఊసులు నచ్చినందుకు థాంక్సండీ..

@ జ్యోతిర్మయి గారూ..

మా పావురాలు నచ్చినందుకు, స్పందించినందుకు థాంక్సండీ..

@ జలతారువెన్నెల గారూ..

మా పావురాల చిత్రాలు,కవిత నచ్చినందుకు,నన్ను మెచ్చుకున్నందుకు థాంక్సండీ..

రసజ్ఞ చెప్పారు...

వహ్వా వహ్వా రాజి గారు! భలే ఉంది.

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

రసజ్ఞ గారు...

మా పావురాల ఊసులు నచ్చినందుకు నన్ను అంతగా మెచ్చినందుకు థాంక్సండీ :)

కెక్యూబ్ వర్మ చెప్పారు...

చాలా నచ్చాయి మీ పావురాలుతో పాటుగా మీ కవితా వెల్లువ...

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

కెక్యూబ్ వర్మ గారు...

నా చిన్నిప్రపంచానికి స్వాగతమండీ..
మా పావురాలు,కవిత నచ్చి,మీ స్పందన తెలిపినందుకు థాంక్సండీ..

Related Posts Plugin for WordPress, Blogger...