"అమ్మవంటిది ... అంతమంచిదిఅమ్మఒక్కటే"
-- ఆత్రేయ
అమ్మ అన్నది ఒక కమ్మని మాట అది ఎన్నెన్నో తెలియనీ మమతల మూట
దేవుడే లేడనే మనిషున్నాడు, అమ్మే లేదనువాడు అసలే లేడు
-- దాశరథి. కృష్ణమాచార్య
"అమ్మను మించి దైవమున్నదా....జగమే పలికే శాశ్వత సత్యమిదే
అందరిని కనే శక్తి అమ్మ ఒక్కతే
అవతార పురుషుడైనా ఓ అమ్మకు కొడుకే "
-- సి. నారాయణరెడ్డి
పట్టుపరుపేలనే పండువెన్నెలేలనే
అమ్మ ఒడి చాలునే నిన్ను చల్లంగ జోకొట్టునే
నారదాదులేలనే నాదబ్రహ్మలేలనే
అమ్మ లాలి చాలునే నిన్ను కమ్మంగ లాలించునే
--వేటూరి. సుందరరామమూర్తి
ఎవరు రాయగలరూ అమ్మ అను మాటకన్న కమ్మని కావ్యం
ఎవరు పాడగలరూ అమ్మ అనురాగం కన్న తీయని రాగం
అమ్మేగా… అమ్మేగా తొలిపలుకు నేర్చుకున్న భాషకి
అమ్మేగా ఆదిస్వరం ప్రాణమనే పాటకి
-- సిరివెన్నెల. సీతారామశాస్త్రి
పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా
కదిలే దేవత అమ్మ కంటికి వెలుగమ్మా
తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా
తన లాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమా
మనలోని ప్రాణం అమ్మ మనదైనా రూపం అమ్మ
ఎనలేని జాలి గుణమే అమ్మ నడిపించే దీపం అమ్మ
కరుణించే కోపం అమ్మ వరమిచ్చే తీపి శాపం అమ్మ
-- చంద్రబోస్
ఇవన్నీఅమ్మ గురించి గొప్పగొప్ప రచయితలూ, కవులు చెప్పినమాటలు,
గొప్పవాళ్ళ మాటల్లోనేకాదు...
ప్రతీ మనిషి మనసులోని మాట "అమ్మకనిపించే ... కనిపెంచేదేవత" అని.గొప్పవాళ్ళ మాటల్లోనేకాదు...
అమ్మ నేను సంతోషిస్తే తను చిరునవ్వవుతుంది...
నా కష్టంలో తను కన్నీరవుతుంది..
నా విజయం లో తానే విజేతగా సంబరపడుతుంది...
నా ఓటమిలో ఓదార్పవుతుంది ..
నా సమస్యకు పరిష్కారమవుతుంది..
నా అలకను తీర్చే అక్షయపాత్ర అవుతుంది...
నా చుట్టూ ఆవరించిన శూన్యం నన్ను నిస్తేజం చేసినప్పుడు,
నిస్సహాయంగా నిలిచినప్పుడు,ఆ శూన్యమనే చీకటిని తొలగించే
కాంతి పుంజంలా అమ్మమాట, అమ్మ చెప్పే ధైర్యం
నన్ను చైతన్యవంతం చేస్తుంది.
బిడ్డపైన అమ్మకు వుండే ప్రేమాభిమానాలను తెలుపుతూ అమ్మపాడే పాట ఇది..
అమ్మ కొంగుపట్టుకుని తిరుగుతూ, కధలు చెప్పమని ముద్దుగా అల్లరిచేసే చిన్నారి అల్లరికి సంతోషిస్తూ..
ఎంతో ముద్దుగా పెంచుకున్న చిట్టితల్లి పెళ్లై అత్తవారింటికి వెళ్తే తనను చూడకుండా ఎలావుండగలననే కన్నతల్లి బాధను వ్యక్తపరుస్తూ...
నువ్వు ఎక్కడవున్నా ఆనందంగా వుండాలి,కలతలు,కష్టాలు లేకుండా నీకలలన్నీ పండి నీ జీవితం సంతోషంగా వుండాలని మనసారా బిడ్డను దీవిస్తూ ...
అమ్మ మనసును ప్రతిబింబించే ఈ పాట రచనా,సంగీతం "పాలగుమ్మివిశ్వనాధం" గారు..
ఈ పాటను "శ్రీమతి వేదవతీ ప్రభాకర్" గారు పాడారు..
నాకు చాలా ఇష్టమైన పాట మా అమ్మకోసం , అమ్మలందరికోసం..
అమ్మదొంగా నిన్నుచూడకుంటే నాకు బెంగ
అమ్మ దొంగా నిన్నుచూడకుంటే నాకు బెంగ
అమ్మ దొంగా నిన్నుచూడకుంటే నాకు బెంగ
కొంగట్టుకు తిరుగుతూ ... ఏవో ప్రశ్నలడుగుతూ ...
నా కొంగట్టుకు తిరుగుతూ ... ఏవో ప్రశ్నలడుగుతూ
గలగలమని నవ్వుతు కాలం గడిపే
నిన్ను చూడకుంటే నాకు బెంగ
అమ్మ దొంగా నిన్నుచూడకుంటే నాకు బెంగ
కథ చెప్పేదాకా కంట నిదురరాక
కధ చెప్పేదాకా నీవు నిదురపోక
కధ చెప్పేదాకా నన్ను కదలనీక
మాట తోచనీక మూతి ముడిచి చూసేవు
అమ్మ దొంగా నిన్నుచూడకుంటే నాకు బెంగ
అమ్మ దొంగా నిన్నుచూడకుంటే నాకు బెంగ
ఎపుడో ఒక అయ్య నిన్నెగరేసుకు పోతే
నిలువలేక నామనసు నీవైపే లాగితే
ఎపుడో ఒక అయ్య నిన్నెగరేసుకు పోతే
నిలువలేక నామనసు నీవైపే లాగితే
గువ్వలెగిరి పోయినా ... గూడు నిదురపోవునా
గువ్వలెగిరి పోయినా ... గూడు నిదురపోవునా
అమ్మ దొంగా నిన్నుచూడకుంటే నాకు బెంగ
అమ్మ దొంగా నిన్నుచూడకుంటే నాకు బెంగ
నవ్వితే నీ కళ్ళు ముత్యాలు రాలు
ఆ నవ్వే నిను వీడక ఉంటే అది చాలు
నవ్వితే నీ కళ్ళు ముత్యాలు రాలు
ఆ నవ్వే నిను వీడక ఉంటే అది చాలు
కలతలూ కష్టాలూ నీ దరికి రాక
కలకాలం నీ బ్రతుకు కలలదారి నడవాలి
కలతలూ కష్టాలూ నీ దరికి రాక
కలకాలం నీ బ్రతుకు కలలదారి నడవాలి
అమ్మ దొంగా నిన్నుచూడకుంటే నాకు బెంగ
అమ్మ దొంగా నిన్నుచూడకుంటే నాకు బెంగ
అమ్మ దొంగా నిన్నుచూడకుంటే ... నాకు బెంగ
16 కామెంట్లు:
Great post!!
Ammaki jEjElu.
Happy Mother's day
'అమ్మ దొంగా నిన్ను చూడకుంటే నాకు బెంగ'
మంచి పాటతోపాటు చక్కటి చిత్రాలు అపురూపంగా ఉన్నాయి. అమ్మ గురించి కవులు చెప్పిన మాటలు పూలమాలగా అందించినందుకు అభినందనలు.
మీకు మాతృదినోత్సవ శుభాకాంక్షలు!
Iddaramu teliyakundaane okate post pettamana maata! Meeru amma gurinchi ee post lo chaalaa baagaa raasaaru raji gaaru. Meeru amma kosam paata post chesaaru. Nenu ammaayi kosam post chesaanu. Ante tedaa..:))
"వనజవనమాలి" గారూ..
అమ్మ గురించి నేను రాసిన ఈ పోస్ట్ నచ్చినందుకు థాంక్సండీ..
మీకు మాతృదినోత్సవ శుభాకాంక్షలు!
"కాయల నాగేంద్ర" గారూ..
అమ్మ పాట,చిత్రాలు,అమ్మ గురించి కవుల వర్ణన .. మొత్తానికి అమ్మను గురించి రాయాలన్న నా ప్రయత్నం మీకు నచ్చినందుకు థాంక్సండీ..
మీకు మాతృదినోత్సవ శుభాకాంక్షలు!
జలతారువెన్నెల గారూ..
అవునండీ ఇద్దరమూ ఒకే పాటను గురించి పోస్ట్ పెట్టాము,మీరేమో అమ్మగా,నేనేమో అమ్మాయిగా
ఈ పాటను గుర్తుచేసుకున్నామన్నమాట :)
అమ్మ గురించి నేను రాసింది నచ్చినందుకు థాంక్సండీ..
మీకు మాతృదినోత్సవ శుభాకాంక్షలు!
అమ్మ గురించి....కవులు చెప్పినవి మాకు అందించారు...
అభినందనలు మీకు...
'స్త్రీ అన్ని రూపాలలో ఉన్నా....
మాతృ స్థానంలోనే అత్యంత పూజనీయురాలు 'అని ఎక్కడో చదివిన జ్ఞాపకం
@శ్రీ
అమ్మ గురించి బాగా రాసారు .
చాలా మంచి పాట . అమ్మ మనసు కు ప్రతి రూపం ఈ పాట .
నేనూ ఈ పాట ఓసారి మా అమ్మాయి పుట్టినరోజున పోస్ట్ చేసాను .
మీకు హాపీ మదర్స్ డే .
శ్రీ గారూ ...
"స్త్రీ అన్ని రూపాలలో ఉన్నా....
మాతృ స్థానంలోనే అత్యంత పూజనీయురాలు '"
మీరు చదివిన మంచి మాటను మాకు కూడా చెప్పినందుకు,నా పోస్ట్ నచ్చి..
మీ స్పందన తెలిపినందుకు థాంక్సండీ..!
మీకు మాతృదినోత్సవ శుభాకాంక్షలు!
"మాలా కుమార్" గారూ..
అవునండీ అమ్మ మనసుకు ప్రతిరూపం ఈ పాట..
నేను కూడా చాలా రోజుల క్రితమే ఈ పాట విన్నాను కానీ ఇప్పటికి కుదిరింది పోస్ట్ చేయటం..
నేను అమ్మ గురించి రాసింది మీకు నచ్చినందుకు, మీరందించిన శుభాకాంక్షలకు థాంక్సండీ..
మీకు మాతృదినోత్సవ శుభాకాంక్షలు!
మాతృదినోత్సవ శుభాకాంక్షలు!
ThankYou "bonagiri" గారూ..
మీకు కూడా మాతృదినోత్సవ శుభాకాంక్షలు..
ThankYou Ammulu..
Happy Mother's Day!
అమ్మ గురించి గొప్ప మాటలన్నీ గుదిగుచ్చారు ఒకచోట .మంచిపాట.
@ నాని...
థాంక్యూ అమ్మా :)
oddula ravisekhar గారూ..
అమ్మ గురించి రాసింది మీకు నచ్చినందుకు..
మీ స్పందన తెలిపినందుకు థాంక్సండీ..!
కామెంట్‌ను పోస్ట్ చేయండి