పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

7, జులై 2012, శనివారం

ఆషాఢం --- గోరింటాకు


హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ??? సుమారు 2 నె తర్వాత ఈ రోజే నా చిన్నిప్రపంచం లోకి వచ్చాను. చాలా రోజులైనట్లుగా వుంది బ్లాగ్ లో పోస్ట్ లు పెట్టి.ఈ మధ్య కొన్ని కారణాల వలన బ్లాగ్ రాయటం కుదరలేదు. కానీ ఈ రోజు మాత్రం తప్పకుండా మీ అందరితో మాట్లాడాలనిపించింది అందుకే ఈ పోస్ట్.. కొన్ని సార్లు ఎంత బిజీగా వున్నా,ఎన్ని చికాకులు వున్నా ఇష్టమైన పని చేయటం ఎప్పుడూ కష్టంగా అనిపించదేమో అలాంటిదే ఈ "నా చిన్ని ప్రపంచం" కూడా...


ఆషాఢం.........
కొత్త
జంటల్ని విడదీసి , ఎడబాటు కలిగించి,ఒకరి తలపుల వానలో మరొకరు తడిచి పోయేలా చేసి,విరహము కూడా మధురమే కదా అనుకునేలా చేసేది ఆషాఢం.
ఆషాఢం శూన్యమాసమని శుభకార్యాలు కూడా వాయిదా వేస్తారు కానీ ఈ నెలలో వచ్చే తొలి ఏకాదశి,జగన్నాధ రధయాత్ర, గురు పౌర్ణమి,బోనాలు ఇలా అందరూ భక్తిగాఆచరించే పర్వదినాలు,ఉత్సవాలు ఈ మాసంలో వున్నాయి.
వర్షాకాలం మొదలయ్యి నల్ల మబ్బులు కమ్ముకునే మాసం
ఆషాఢం.. ఐతే ఈ నెలలో కనిపించే మేఘాలు అంతగా కురవ వట .. దట్టంగా కమ్ముకుని వర్షం పడుతున్నట్లే అనిపించి చెదిరిపోతాయట . అందుకే నమ్మించి మోసం చేసే వాళ్ళను ఆషాఢభూతులు అంటారట.

ఆషాఢం గురించి అందరూ ఇప్పటికే చెప్పేసి ఉండొచ్చు, అందుకే ఆషాఢంలో నాకు ఇష్టమైన గోరింటాకు గురించి చెప్పాలనిపించింది. ఆషాఢంలోముఖ్యమైన ఆచారం గోరింటాకు పెట్టుకోవటం అంటే చాలా ఇష్టం నాకు.
ఈ గోరింటాకు వెనకటి రోజుల్లో ఇంట్లో పెరటిలో, తోటల్లో వున్న చెట్లకి గోరింటాకు కోసుకు వచ్చి , రోటిలో వేసి మజ్జిగ,చింతపండు ,రేగి కాసు వేసి, మెత్తగా అయ్యేదాకా కష్టపడి రుబ్బి,ఇంట్లో ఆడపిల్లలందరూ పోటీ పడి గోరింటాకు పెట్టుకునే వారట మా అమ్మ చెప్తుంటారు.మళ్ళీ ఆ గోరింటాకు పండటానికి తీసుకునే జాగ్రత్తలు కూడా వుండేవట.

ఇప్పుడు అంత కష్టం ఏమీ లేకపోయినా పచ్చి గోరింటాకు దొరకటం మాత్రం చాలా కష్టం.. కోన్ మేహేంది ఎంత అందంగా పెట్టినా గోరింటాకు పెట్టుకున్నంత అందం,కళ వుండదు. అందుకే ఈ ఆషాఢంలో ప్రత్యేకమైన గోరింటాకును కొనుక్కుని
గోరింటాకు సరదా తీర్చేసుకున్నాము.ఎర్రగా పండిన ఆ గోరింటాకు అందం,సువాసన ఇష్టపడని వాళ్ళు వుండరేమో..22 వ్యాఖ్యలు:

మాలా కుమార్ చెప్పారు...

చాలా బాగుంది . గోరింటాకు సువాసన నాకు చాలా ఇష్టం :)

కాయల నాగేంద్ర చెప్పారు...

'ఆషాడం,గోరింటాకు' గురించి చాలా విషయాలు చెప్పారండీ! అభినందనలు.

సుభ/subha చెప్పారు...

బ్లాగు కొచ్చిన వెంటనే నాకిష్టమైన పాట వింటూ గోరింటాకు గురించి చదివేసా.. ఇంతకీ ఏం చదివానండీ? అబ్బా మీరేంటండీ అటేమో మంచి పాట, ఇటేమో మంచి ఆశక్తి కలిగించే విషయం పెట్టారూ? ఇదిగో ఇలా ఉంటుంది చివరికి పరిస్థితి:)
ఇంతకీ చెప్పొచ్చేదేమంటే నాకు చాలా చాలా ఇష్టం గోరింటాకు అలా పెట్టుకోవడం.కోన్ నాకు అంతగా నచ్చదు.మాలా కుమార్ గారు చెప్పినట్టు ఆ సువాసన కూడా బాగుంటుంది.

భాస్కర్ కె చెప్పారు...

welcom back, manchi vishayalu chakkaga chepparandi.
keep writing.

Unknown చెప్పారు...

Welcome Back!
మళ్ళీ బ్లాగుకి గోరింటాకుతో రాయటం మొదలెట్టారు, శుభం!

జలతారు వెన్నెల చెప్పారు...

రాజి గారు, అలా చెప్పపెట్టకుండా మాయం అయితే ఎలాగండి?
ఇక్కడ మాకు బొలేడంత దిగులు కూడా వేసింది మీ మీద.
మీకు స్వాగత. గోరింటాకు అనగానే నాకు మా అమ్మమ్మ గుర్తుకు వస్తుంది.
చిన్నప్పుడు నాకు తన చేతులతో ఎన్ని సార్లు గోరింటాకు పెట్టిందో !
మంచి టపా రాసారు.

వనజ తాతినేని చెప్పారు...

రాజీ గారు.. సుస్వాగతం. చాలా రోజుల తర్వాత.. మీ పోస్ట్ చూసి ఆనందం.
గోరింటాకు,ఆషాఢ మాసం కబుర్లు.. చాలా బాగున్నాయి. మెహందీ డిజైన్స్ ఎన్ని ఉన్నా.. చుక్కలందమే వేరు. పండిన గోరింట చేయి అందం కన్నుల పండుగ.

Meraj Fathima చెప్పారు...

raajee gaaroo manchi paata manchi maata vinipinchatam meeke saadyam. anduke meeru ayyaru priya nestam.

శ్రీ చెప్పారు...

గోరింట పెట్టుకున్న చేతి అందం...
ఎన్ని టాటూలు అతికించుకుంటే వస్తుంది?
ఈ విషయం తెలిస్తే ఈనాటి అమ్మాయిల చేతులు
మళ్ళీ గోరింటలతోనే మెరుస్తాయి కదా!
బాగుంది మీ గోరింటాకు ఎర్రదనం...:-))
@శ్రీ

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

"మాలా కుమార్" గారూ...
గోరింటాకు సువాసన,అందం నాకు కూడా చాలా ఇష్టమండీ :)
నా గోరింటాకు విశేషాలు మీకు నచ్చినందుకు థాంక్యూ...

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

"కాయల నాగేంద్ర" గారూ..
'ఆషాడం,గోరింటాకు'విషయాలు మీకు నచ్చినందుకు,
మీ స్పందన తెలిపినందుకు థాంక్సండీ..

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

సుభ గారూ...
ఐతే పాట మిమ్మల్ని డిస్టర్బ్ చేసిందంటారా??

నాకు కూడా మీలాగే కోన్ నచ్చదండీ మా చెల్లి వాళ్ళు ఆచారం కోసమైనా కోన్ తో పెట్టుకోమన్నా గానీ గోరింటాకు దొరికేదాకా ఆగి నిన్న పెట్టుకున్నాను..
ఆ సంతోషాన్ని మీ అందరితో పంచుకున్నాను..
నా గోరింటాకు విశేషాలు మీ అందరికీ నచ్చినందుకు చాలా సంతోషంగా వుంది.

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

"the tree" గారూ..
Thank you for the welcome

నేను చెప్పిన విషయాలు నచ్చినందుకు,మీ స్పందన తెలిపినందుకు థాంక్సండీ..

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

చిన్ని ఆశ గారూ..
Thank you for the welcome

నిజమేనండీ అనుకోకుండా గోరింటాకుతో మళ్ళీ బ్లాగ్ రాశాను..
మీరు విష్ చేసినట్లే అంతా శుభం జరగాలని కోరుకుంటున్నాను థాంక్యూ..

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

"జలతారువెన్నెల" గారూ...
నేను కొన్నాళ్ళు బ్లాగ్ రాయకపోతే,బ్లాగుల్లో కనపడకపోతే అంతగా నా గురించి ఎవరు అనుకుంటారులే అనుకున్నాను కానీ నా ఆలోచన తప్పని తెలిసింది..
నాకోసం మాలా కుమార్ గారు,వనజవనమాలి గారు మైల్స్ ఇచ్చి మరీ నా క్షేమ సమాచారాలు అడిగారు,

ఇంక మిగతా వాళ్ళందరూ బ్లాగుల్లో కనపడగానే నన్ను ఆత్మీయంగా పలకరించారు.. ఇంకా నేను కనపడకపోతే నా గురించి దిగులు పెట్టుకునే మీరు నా ఫ్రెండ్ కావటం నాకు చాలా సంతోషంగా అనిపించింది.

నా గోరింటాకు మీ జ్ఞాపకాలను గుర్తు చేసిందన్నమాట మీ అభిమానానికి,మీ స్పందనకు థాంక్సండీ..

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

"వనజవనమాలి" గారూ..
మీ స్వాగతానికి థాంక్సండీ ..
అవునండీ చాలా రోజులయ్యింది పోస్ట్ పెట్టి.
ఈ గోరింటాకు జ్ఞాపకాలు మాత్రం "నా చిన్ని ప్రపంచం"లో భద్రపరచాలని ఈ పోస్ట్ పెట్టాను..

మీరు చెప్పింది నిజమేనండీ ఎన్ని డిజైన్లు వున్నా గోరింటాకు చుక్కలు చాలా అందంగా వుంటాయి.
గోరింటాకు విషయాలు,ఆషాఢ మాసం కబుర్లు నచ్చినందుకు,మీ స్పందన తెలిపినందుకు థాంక్సండీ..

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

meraj fathima గారూ..
నా పాటలు,మాటలు మీరంతగా మెచ్చినందుకు,
మీ ప్రియనేస్తం నేనైనందుకు నాకు చాలా చాలా సంతొషమండీ..
థాంక్యూ ప్రియనేస్తం :)

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

"శ్రీ" గారూ...

మీరు చెప్పింది నిజమేనండీ ఈనాటి అమ్మాయిలు కూడా గోరింటాకు అంటే ఇష్టపడని వాళ్ళు ఉండరేమో..

గోరింటాకు ఎర్రదనం మీకు నచ్చినందుకు,
మీ స్పందన తెలిపినందుకు థాంక్సండీ....

Sai చెప్పారు...

రాజీ గారు.. చాలా రోజుల తరువాత కనపడినందుకు సంతోషం అండీ...
గోరింటాకు చాలా బాగా పండింది..

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

"సాయి" గారూ..
ఈ మధ్య కొంచెం బిజీ అందుకే బ్లాగ్ రాయటం కుదరలేదు..
గోరింటాకు పోస్ట్ నచ్చినందుకు,మీ స్పందన తెలిపినందుకు థాంక్సండీ..

రవిశేఖర్ హృ(మ)ది లో చెప్పారు...

గోరింటాకును ఇష్టపడని వారు ఉండరేమో!పండిన తరువాత చేయి వచ్చే కమ్మని వాసన అద్భుతం.వ్రాస్తూ ఉండండి.

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

"oddula ravisekhar" గారూ..
గోరింటాకు పోస్ట్ నచ్చినందుకు,మీ స్పందన తెలిపినందుకు థాంక్సండీ..

Related Posts Plugin for WordPress, Blogger...