సౌభాగ్యలక్ష్మీ రావమ్మా ... అమ్మా ... సౌభాగ్యలక్ష్మీ రావమ్మా
నుదుట కుంకుమ రవిబింబముగా ... కన్నుల కాటుక నిండుగ వెలుగ
కాంచనహారము గళమున మెరియగ ... పీతాంబరముల శోభలు నిండగ
సౌభాగ్యలక్ష్మీ రావమ్మా
నిండుగ కరముల బంగారుగాజులు ... ముద్దులొలుకు నాదమ్ముల మువ్వలు
గలగలమని సవ్వడి చేయగ ... సౌభాగ్యవతుల సేవల నందగ
సౌభాగ్యలక్ష్మీ రావమ్మా
నిత్య సుమంగళి నిత్య కల్యాణి ... భక్త జనుల మా కల్పవల్లివై
కమలాసనవై కరుణ నిండగా ... కనకవృష్టి కురిపించే తల్లీ
సౌభాగ్యలక్ష్మీ రావమ్మా ... అమ్మా ... సౌభాగ్యలక్ష్మీ రావమ్మా

శ్రావణ వరలక్ష్మి అందరినీ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో,సకల సౌభాగ్యాలతో దీవించి,
కోరిన కోరికలను వరాలుగా ప్రసాదించమని ప్రార్ధిస్తూ
"వరలక్ష్మీవ్రతం శుభాకాంక్షలు"
కనకధారా స్తోత్రం

10 కామెంట్లు:
రాజి కొద్ది గాప్ తరువాత మీకు స్వాగతం, వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు.
తెలుగింటి సంస్కృతి.. నిండుగా కనబడింది రాజీ గారు.
కనకధారా స్తోత్రం వినిపించినందుకు ధన్యవాదములు.
సాయంసంధ్య వేళ శ్రావణ శుక్రవార శుభా కాంక్షలు..
ఎగ్జామ్స్ ఎలా వ్రాస్తున్నారు.. ? విజయీభవ !!
రాజీ గారు..
సౌభాగ్యలక్ష్మీ రావమ్మా...ఈ పాట మా అమ్మ చాలా బాగా పాడుతారు అండీ...నాకిష్టం..
మీకూ వరలక్షీవ్రత శుభాకాంక్షలు..
"the tree" గారు..
థాంక్సండీ ..
"వనజవనమాలి" గారూ..
తెలుగింటి సంస్కృతి అని అభినందించినందుకు,
మీ శ్రావణశుక్రవార శుభాకాంక్షలకు,
విజయీభవ అంటూ మీరందించిన దీవెనలకు చాలా థాంక్సండీ...
Group 2 ఎగ్జామ్స్ అయిపోయాయండీ..అందుకే ఇవాళ అమ్మవారిని బాగా విసిగించేశాను వరమిమ్మని :)
"సాయి" గారూ..
అమ్మవారి అందమైన అలంకరణను వర్ణిస్తూ వుండే
ఈ పాట నాకు కూడా ఇష్టమండీ..
మీ అమ్మగారిలాగా పూజల్లో పాటలు పాడుతుంటే వినటం చాలా బాగుంటుంది..
ThankYou..
మీకు అభినందనలు..
కనకధారా స్తోత్రం వినిపించారు...
@శ్రీ
"శ్రీ" గారూ థాంక్సండీ...
ఈ రోజు కనకధారా స్తోత్రం వింటే మంచిదట అందుకే పోస్ట్ చేశాను.
చూడ చక్కని తెలుగింటి సంస్కృతి.
"oddula ravisekhar" గారూ..
మీ అభినందనలకు థాంక్సండీ!!
కామెంట్‌ను పోస్ట్ చేయండి