పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

2, ఆగస్టు 2012, గురువారం

☼ రక్షాబంధన్ శుభాకాంక్షలు ☼




మ్ముడూ అనురాగానికి,అనుబంధానికి మారుపేరైన మన బంధం
నిండు నూరేళ్ళు కొనసాగాలని కోరుకుంటూ
నిన్ను దీవిస్తున్నాను.




మమతానురాగాలనే జరీ దారాలను పెనవేసి,
జన్మ జన్మల అనుబంధమనే పసిడి పూలు ముడివేసిన
ఎర్రటి తోరణంతో రాఖీ కడుతున్నాను..




న్నటికీ తరగని,ఎప్పటికీ మరవని ప్రేమాభిమానాలు,
ఆత్మీయతానురాగాలు మన సొంతం కావాలని కోరుకుంటూ,
నీకు అన్నిటా శుభం కలగాలని దేవుడిని ప్రార్ధిస్తున్నాను.




పసిడి పసితనంనుండీ మనం పంచుకున్న
మధురానుభూతులన్నీ మన జీవితాలను ఎప్పటికీ
మధురంగా కొనసాగించేలా చేయాలని ఆకాంక్షిస్తున్నాను.




అమ్మలోని ఆప్యాయతను, నాన్నలోని ఆపేక్షను,
అనుక్షణం అభిమానాన్ని, ఎప్పటికీ నీడలా తోడుండే

నీ ప్రేమను రక్షణగా... కానుకగా స్వీకరిస్తున్నాను.



మ్ముడూ భగవంతుడు నిన్ను ఎల్లప్పుడూ
ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో దీవించి ,కాపాడాలని
మన మధ్య ప్రేమానుబంధాలు,ఆప్యాయతానురాగాలు
ఎప్పటికీ నిలిచి వుండాలని కోరుకుంటూ

రక్షాబంధన్ శుభాకాంక్షలు



అన్నా చెల్లెళ్ళు, అక్కా తమ్ముళ్ళ అనుబంధంతో పాటూ..
సర్వ మానవ సౌభ్రాతృత్వానికీ, అభిమానానికి ప్రతీక రక్షాబంధన్ ,
అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు.




8 కామెంట్‌లు:

మాలా కుమార్ చెప్పారు...

బాగా రాశారండి .
మీకు కూడా రక్షాబంధన్ శుభాకాంక్షలు .

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

"మాలాకుమార్" గారూ..
చాలా రోజుల తర్వాత నా చిన్నిపపంచానికి వచ్చారు..
పోస్ట్ నచ్చినందుకు,మీ శుభాకాంక్షలకు చాలా థాంక్సండీ..
మీకు కూడా రక్షాబంధన్ శుభాకాంక్షలు!

భాస్కర్ కె చెప్పారు...

రక్షాబంధన్ శుభాకాంక్షలు
భలే వుందండి, మీ టపా,
మీకు పెద్ద పెట్టెంత గిఫ్ట్ కావాలనమాట, హి, హి....

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

"the tree" గారూ..
టపాలో చెప్పాను కదండీ నాకు కావాల్సిన గిఫ్ట్ లు ఏమిటో :)

ప్రేమాభిమానాలను ఎంత ఎక్కువ కోరుకున్నా
తప్పులేదు కదా ...
పోస్ట్ నచ్చినందుకు,మీ శుభాకాంక్షలకు చాలా థాంక్సండీ..

మీకు కూడా రక్షాబంధన్ శుభాకాంక్షలు!

రసజ్ఞ చెప్పారు...

మీకు కూడా రక్షాబంధన్ (కాస్త ఆలస్యంగా) శుభాకాంక్షలు!

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

"రసజ్ఞ" గారూ..
మీ శుభాకాంక్షలకు థాంక్సండీ..

మీకు కూడా రక్షాబంధన్ శుభాకాంక్షలు!

Meraj Fathima చెప్పారు...

రాజీ గారూ, చూడటం ఆలస్యం అయింది , మీకు కూడా శుబాకాంక్షలు

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

"meraj fathima" గారూ..
ఆలస్యంగానైనా శుభాకాంక్షలు అందించినందుకు థాంక్సండీ..

మీకు కూడా రక్షాబంధన్ శుభాకాంక్షలు!

Related Posts Plugin for WordPress, Blogger...