"విశ్వదాభిరామ వినురవేమ" అనే ఈ మాట తెలియని, అలాగే ఒక్క వేమన పద్యమైనా రాని తెలుగువాళ్ళు ఉండరేమో... చిన్నప్పుడు చదువుకున్న చదువులో ఏమి గుర్తున్నా లేకపోయినా వేమన పద్యాలు మాత్రం గుర్తున్నాయి ఇప్పటికీ..
ఎలాంటి భావమైనా సరళమైన భాషలో, చక్కటి ఉదాహరణలతో హృదయానికి హత్తుకునేలా చెప్పిన కవి వేమన .. పద్యం మొదటి రెండు పాదాల్లోను నీతిని చెప్పి, మూడో పాదంలో దానికి తగిన పోలికతో .. నాలుగో పాదం "విశ్వదాభిరామ వినుర వేమ" అనే మకుటంతో వేమన పద్యాలుంటాయి..
వేమన పద్యం లోని ఈ మకుటానికి అర్థంపై కూడా రెండు వాదనలున్నాయి.
వేమన ఆలనా పాలనా చూసిన ఆయన వదిన విశ్వదనూ, ఆయన ఆప్తమిత్రుడు అభిరాముడినీ మకుటంలో చేర్చి వారికి శాశ్వతత్వాన్ని ఇచ్చాడని ఒక వాదన. విశ్వద అంటే విశ్వకారకుడికి, అభిరామ అంటే ప్రియమైనవాడని - సృష్టికర్తకు ప్రియమైన వేమా, వినుము - అని ఈ మకుటానికి మరో అర్థం చెప్పారు, పండితులు.
ఎవరికైనా కూడా అర్థమయ్యే భాషలో పద్యాలు చెప్పి ప్రజల్ని మెప్పించిన ప్రజాకవి వేమన . ఆయన పద్యాలలోనే విలువ గల సలహాలు, సూచనలు, లోకనీతిని తెలిపిన మహానుభావుడు, సమాజంలోని అన్ని సమస్యలను గురించి తన పద్యాలలో వేమన ప్రస్తావించారు.
"ఉప్పు కప్పురంబు నొక్క పోలిక నుండు" పద్యం మనుషులందరూ చూడటానికి ఒక్కలాగే వున్న వాళ్ళ గుణాల్లోని తేడాలను తెలియచేస్తే..
"అనువు కాని చోట అధికులమనరాదు" అన్న పద్యం ఎక్కడ ఎలాగా ప్రవర్తించాలి అనే జ్ఞానాన్ని బోధిస్తుంది.
అలాగే "అల్పుడెపుడు పల్కు ఆడంబరముగాను సజ్జనుండు పలుకు చల్లగాను" అనే పద్యం మంచి వాడికి,చెడ్డవానికి గల తేడాలను తెలియచేస్తుంది..
ఇలా ఎన్నో పద్యాలు మన నిత్య జీవితంలో మనకు అనుభవం అయ్యేవి,ఉపయోగపడేవి ఎన్నో ఉన్నాయి..
నాకు కూడా వేమన పద్యాలలో కొన్ని బాగా గుర్తుండి పోయాయి కొన్ని సంఘటనలను,మనుషులను చూసినప్పుడు ఈ పద్యాలు వెంటనే వాటికి పోల్చుకునేలా గుర్తుకొచ్చేస్తాయి.. వాటిలో కొన్ని పద్యాలు..
ఉప్పు కప్పురంబు ఒక్క పోలికనుండు
చూడ చూడ రుచుల జాడ వేరు
పురుషులందు పుణ్య పురుషులు వేరయ
విశ్వదాభిరామ వినురవేమ!
యినుము విరగనేని ఇరుమారు ముమ్మారు
కాచియెతకవచ్చు గ్రమము గాను
మనసు విరిగెనేని మరి ఆతుకగారాదయా
విశ్వదాభిరామ వినురవేమ!
అనువుగాని చోట అధికులమనరాదు
కొంచెముందుటెల్ల కొదువకాదు
కొండ యద్దమందు కొంచమై ఉండదా
విశ్వదాభిరామ వినురవేమ!
అల్పుడెపుడు బల్కు నాడంబరముగాను
సజ్జనుండు పలుకు చల్లగాను
కంచుమ్రోగినట్లు కనకంబుమ్రోగునా
విశ్వదాభిరామ వినురవేమ!
అనగననగరాగ మతిశయించునుండు
తినగ తినగ వేము తియ్యనుండు
సాధనమున పనులు సమకూరు ధరలోన
విశ్వదాభిరామ వినుర వేమ!
అల్పబుద్ధివానికధికారమిచ్చిన
దొడ్డవారినెల్ల తొలగగొట్టు
చెప్పుదినెడు కుక్క చెరకు తీపెరుగునా
విశ్వదాభిరామ వినుర వేమ!
భూమి నాది యనిన భూమి ఫక్కున నవ్వు
దాన హీనుఁ జూచి ధనము నవ్వు
కదన భీతుఁ జూచి కాలుఁడు నవ్వును
విశ్వదాభిరామ వినురవేమ!
చిత్తశుద్ధి కలిగిచేసిన పుణ్యంబు
కొంచెమైన నదియు కొదవగాదు
విత్తనంబు మర్రి వృక్షంబునకు నెంతో
విశ్వదాభిరామ వినుర వేమ!
గంగి గోవుపాలు గరిటడైనను చాలు
కడవెడైనను నేమి ఖరముపాలు
భక్తికల్గుకూడు పట్టెడైనను చాలు
విశ్వదాభిరామ వినురవేమ!
ఆత్మ శుద్ది లేని యాచారమదియేల
భాండశుద్ది లేని పాక మేల
చిత్తశుద్దిలేని శివపూజలేలరా
విశ్వదాభిరామ వినురవేమ!
మేడిపండు చూడ మేలిమై యుండును
పొట్టవిచ్చి చూడ పురుగులుండు
పిరికివాని మదిని బింకమీలాగురా
విశ్వదాభిరామ వినురవేమ!
కస్తూరి నటుచూడ కాంతి నల్లగ నుండు
పరిమళించు దాని పరిమళమ్ము
గురువులైన వారి గుణము లీలాగురా
విశ్వదాభిరామ వినురవేమ !
చూడ చూడ రుచుల జాడ వేరు
పురుషులందు పుణ్య పురుషులు వేరయ
విశ్వదాభిరామ వినురవేమ!
యినుము విరగనేని ఇరుమారు ముమ్మారు
కాచియెతకవచ్చు గ్రమము గాను
మనసు విరిగెనేని మరి ఆతుకగారాదయా
విశ్వదాభిరామ వినురవేమ!
అనువుగాని చోట అధికులమనరాదు
కొంచెముందుటెల్ల కొదువకాదు
కొండ యద్దమందు కొంచమై ఉండదా
విశ్వదాభిరామ వినురవేమ!
అల్పుడెపుడు బల్కు నాడంబరముగాను
సజ్జనుండు పలుకు చల్లగాను
కంచుమ్రోగినట్లు కనకంబుమ్రోగునా
విశ్వదాభిరామ వినురవేమ!
అనగననగరాగ మతిశయించునుండు
తినగ తినగ వేము తియ్యనుండు
సాధనమున పనులు సమకూరు ధరలోన
విశ్వదాభిరామ వినుర వేమ!
అల్పబుద్ధివానికధికారమిచ్చిన
దొడ్డవారినెల్ల తొలగగొట్టు
చెప్పుదినెడు కుక్క చెరకు తీపెరుగునా
విశ్వదాభిరామ వినుర వేమ!
భూమి నాది యనిన భూమి ఫక్కున నవ్వు
దాన హీనుఁ జూచి ధనము నవ్వు
కదన భీతుఁ జూచి కాలుఁడు నవ్వును
విశ్వదాభిరామ వినురవేమ!
చిత్తశుద్ధి కలిగిచేసిన పుణ్యంబు
కొంచెమైన నదియు కొదవగాదు
విత్తనంబు మర్రి వృక్షంబునకు నెంతో
విశ్వదాభిరామ వినుర వేమ!
గంగి గోవుపాలు గరిటడైనను చాలు
కడవెడైనను నేమి ఖరముపాలు
భక్తికల్గుకూడు పట్టెడైనను చాలు
విశ్వదాభిరామ వినురవేమ!
ఆత్మ శుద్ది లేని యాచారమదియేల
భాండశుద్ది లేని పాక మేల
చిత్తశుద్దిలేని శివపూజలేలరా
విశ్వదాభిరామ వినురవేమ!
మేడిపండు చూడ మేలిమై యుండును
పొట్టవిచ్చి చూడ పురుగులుండు
పిరికివాని మదిని బింకమీలాగురా
విశ్వదాభిరామ వినురవేమ!
కస్తూరి నటుచూడ కాంతి నల్లగ నుండు
పరిమళించు దాని పరిమళమ్ము
గురువులైన వారి గుణము లీలాగురా
విశ్వదాభిరామ వినురవేమ !
18 కామెంట్లు:
రాజీ గారు!
ధన్యవాదాలండి, చక్కటి పద్యాలు ప్రస్తావించారు. వేమనపద్యాలు చదివినవారికి చక్కటి ఫలశ్రుతి ఉంది -
ఇహపరంబులకు నిది సాధనంబని
వ్రాసి చదివి విన్న వారికెల్ల
మంగళంబు లొనరు మహిలోన నిజమిది
విశ్వదాభిరామ వినురవేమ !
రాజి గారు, మీ ప్రయత్నం హర్షదాయకం.
అయినా ఇది రాజీ గారే చేయగలరు, మంచి పద్యాలని వినే భాగ్యం కలిగించారు.
బాగుందండీ ! మంచి టపా ! నాకు చాలా ఇష్టమైన పద్యాలు
మంచి పద్యాలని శ్రవణానందకరంగా వినిపించారు. ఇవి ఎవరు ఎక్కడ పాడినవండీ?
మంచి పద్యాలు రాజి గారు...
దానికి తోడుగా ఆడియో కూడా బాగుంది...
బ్లాగులన్ని చూడ ఒక్కలాగే ఉండు...
అందులోన 'రాజి' బ్లాగులే వేరయా...
విశ్వదాభిరామ.......:-))......
అభినందనలు...
@శ్రీ
"భారతి" గారూ..
పద్యాలు మీ అందరికీ వినిపించాలన్న నా ప్రయత్నం మీకు నచ్చినందుకు,
అనుకోకుండా నేను పోస్ట్ చేసిన వేమన పద్యాలకి చక్కటి ఫలశ్రుతి కూడా ఉందని తెలియచేసినందుకు ధన్యవాదములండీ..
"Meraj Fathima" గారూ..
పద్యాలు నచ్చినందుకు,మీరు అభిమానంతో అందించిన ప్రసంశకు ధన్యవాదములండీ..
పరుచూరి వంశీ కృష్ణ .గారూ..
పోస్ట్,పద్యాలు నచ్చినందుకు,
మీ స్పందన తెలిపినందుకు థాంక్సండీ..
"నాగేస్రావ్" గారూ..
పద్యాలు నచ్చినందుకు థాంక్సండీ!
ఈ పద్యాలను "రామకృష్ణ" పాడారట..
"శ్రీ" గారూ..
వేమన పద్యాల పుణ్యమా అని నా బ్లాగులను గురించి మీరు చెప్పిన పద్యం చాలా బాగుందండీ..
ThankYou :)
పద్యాలు,ఆడియో నచ్చినందుకు,మీ అభినందనలకు ధన్యవాదములు..
అత్యుత్తమ స్థాయి వ్యక్తిత్వ వికాస పుష్పాలు, వేమన పద్యాలు.
బాగుంది రాజీ, వేమన శతకం మీద పరిశోధన. నా కైతే
Ph.D.ఇచ్చేయాలనిపిస్తోంది.
"అత్యుత్తమ స్థాయి వ్యక్తిత్వ వికాస పుష్పాలు"
"the tree" గారూ.. నిజమేనండీ
వేమన పద్యాల గురించి చాలా చక్కగా చెప్పారు..
Thankyou!!
"జయ" గారూ.. బాగున్నారా??
ఇన్నిరోజులు నా చిన్నిప్రపంచానికి రాకపోతే ఎలాగండీ :)
నాకు Law లో Ph.D చేయాలని కోరిక ఉంది..
కానీ దానికంటే ముందే మీరిచ్చిన ఈ Ph.D
నాకు చాలా సంతోషాన్ని కలిగించింది :)
ThankYou!!
చిన్నప్పుడు నేర్చుకున్న పద్యాలను మరల గుర్తు చేసారండి.వేమన పద్యాల్లో మన జీవితం కనిపిస్తూ ఉంటుందండి.
"oddula ravisekhar" గారూ..
పద్యాలు మీ అందరికీ వినిపించాలన్న నా ప్రయత్నం నచ్చినందుకు,
మీ స్పందన తెలిపినందుకు థాంక్సండీ..
రాజి గారు ....నేనేమైపోయానా అని అనుకుంటున్నారు కదూ ....!!! ఎక్కడున్నా మీ బ్లాగు దర్శనం చేస్తూనే ఉన్నా....కామెంటు కే టైం ఉండటంలేదు .....పద్యాల గురించి బానే రాసారు గాని...సొంత పద్యం ఒకటి వదల్లెకపోయారు ...హిహిహి
"raf raafsun" గారూ..
అబద్ధమెందుకండీ చెప్పడం మీరేమైపోయారా అని ఆలోచించే తీరిక, అవసరం నాకు కలగలేదండీ ఇప్పటిదాకా...
ఇప్పుడు మాత్రం మీరు మళ్ళీ కనపడినందుకు చాలా సంతోషం..నా బ్లాగ్ రెగ్యులర్ గా చూస్తున్నందుకు మరీ సంతోషం..
ఇంక సొంత పద్యం అంటారా ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేస్తేనే పద్ధతిగా వుంటుందేమో ...
అందుకే నేనెప్పుడు నాకు రాని పనులు చేయాలని ప్రయత్నించను..
ThankYou!!
కామెంట్‌ను పోస్ట్ చేయండి