పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

4, సెప్టెంబర్ 2012, మంగళవారం

మన జీవితం...!


రోజులు,గంటలు,నిమిషాలు,క్షణాలంటూ
కాలం కొలతల్లో బంధించిన మన జీవితం
ఆగకుండా కదిలే కాలచక్రంతో పోటీ పెట్టుకున్న
ఉరుకులు పరుగుల పరుగుపందెం...

పరుగుపందెంలో అలసి,ఆగిపోతున్న
అనుభూతులు, అనుబంధాలు,ఆప్యాయతలు
ఎంతగా అలసిపోయినా సేదతీరేందుకు సమయం లేదు!

ప్రతి మనిషికి ముందు చూపే
తన చుట్టుపక్కల ప్రపంచం ఏమైపోతుందో
తెలుసుకోవాల్సిన అవసరం, అవకాశం లేదు!

జీవిత ప్రయాణంలో ఎదురయ్యే పరీక్షలకు
సమాధానాలు వెతకటమే తప్ప
ఈ ప్రయాణం సరైనదేనా అని సమీక్షంచుకునే
సందర్భం కూడా రాదు!

జీవితపు బరిలో బంధువులు,స్నేహితులే మన ప్రత్యర్ధులు
అందరూ అయినవారే ... అయినా ఎవరికి వారే పోటీ
ఒకరికంటే నేను బాగుండాలనే ఈ తాపత్రయంలో
గెలుపు,ఓటములు ... లాభ నష్టాల కూడికలు తీసివేతలే ఈ జీవితం!

ఉన్నది లేదనుకుని ... లేనిది కావాలనుకుని
ఏదో సాధించాలనుకుని ... ఎక్కడికో చేరాలనుకునే
ఈ ఆశలు,ఆశయాల పరుగు
ఎక్కడికో ?? ఎందాకనో ???




15 కామెంట్‌లు:

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

అవును రాజీ గారు.. మీరు అన్నది నూటికి నూరు శాతం నిజం. ఎక్కడికో ఈ పరుగు.. అలసి పోతూ.. అనిపిస్తూ ఉంటుంది.
ఎక్కడికి వెళ్ళినా.. మన మనసేగా..మారాల్సింది.
చక్కని పోస్ట్. చాలా బావుంది.

భాస్కర్ కె చెప్పారు...

చక్కగా రాశారండి, అభినందనలు.

సుభ/subha చెప్పారు...

అంతరంగాల్లోని అంతః సంఘర్షణకు అంతే లేకుండా పోతోందండీ.. నిజమే దేని కోసమో ఈ ఉరుకుల పరుగులు??

జ్యోతిర్మయి చెప్పారు...

'పోనీ మానేద్దామా' అంటే వెనుకబడి పోతామేమో అన్న భయం. కవిత చాలా బావుంది రాజి గారు.

anrd చెప్పారు...

చక్కగా రాసారండి.

భారతి చెప్పారు...

ఉన్నది లేదనుకుని...లేనిది కావాలనుకుని ...........
నిజమేనండి....... ఈ పరుగులు ఎక్కడికో? ఎందాకనో???
చాలా చక్కగా చెప్పారండి, నేటి చాలామంది జీవన గమనాన్ని.

శ్రీ చెప్పారు...

అవును రాజి గారూ!
జనం 'సంతృప్తి' అనే పదం మరచిపోయారేమో!
పరుగుపందెంలో అలిసినా..సోలిసినా ఆగదు పరుగు..
ఆగితే 'వెనకపడతామేమోననే భయం' తరుముతుంటుంది కదా!...
బాగా వ్రాసారు. అభినందనలు..
@శ్రీ

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

@ "వనజవనమాలి" గారూ..
మీరు చెప్పింది నిజమే
"ఎక్కడికి వెళ్ళినా.. మన మనసేగా..మారాల్సింది."
పోస్ట్ నచ్చినందుకు,మీ స్పందనకు థాంక్సండీ..


@ "the tree" గారూ..
పోస్ట్ నచ్చినందుకు,అభినందనలకు థాంక్సండీ..


@ "సుభ/subha" గారూ..
"అంతరంగాల్లోని అంతః సంఘర్షణ"
గురించి మంచిమాట చెప్పారండీ!
మీ స్పందనకు ధన్యవాదములు..

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

@ "జ్యోతిర్మయి" గారూ..
మీరు చెప్పింది నిజమేనండీ "పరుగు మానేస్తే వెనకపడతామనే భయం"...
కవిత నచ్చినందుకు,మీ స్పందన తెలిపినందుకు ధన్యవాదములు..


@ anrd గారూ..
నా చిన్నిప్రపంచానికి స్వాగతమండీ..
నేను రాసింది నచ్చినందుకు,
మీ స్పందనకు ధన్యవాదములు..

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

@ "భారతి" గారూ..
నిజమేనండీ "నేటి మనిషి జీవనగమనం"
ఇదే కదా అనిపిస్తుంది ఒక్కోసారి..
పోస్ట్ నచ్చినందుకు,మీ స్పందన తెలిపినందుకు ధన్యవాదములు..


@ "శ్రీ" గారూ..
"జనం 'సంతృప్తి' అనే పదం మరచిపోయారేమో!"
మీరు చెప్పింది నిజమేనండీ..
నేను వ్రాసింది మీకు నచ్చినందుకు,
మీ అభినందనలకు ధన్యవాదములు..

Meraj Fathima చెప్పారు...

రాజీ గారూ, ఆలస్యానికి మన్నించాలి. మీ పోస్ట్ బాగుంది .
మనిషి పరుగెడుతున్నాడు కానీ మనసు అక్కడే ఉంటుంది.
దానికోసం వెనక్కి రావాల్సిందే..... మెరాజ్

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

"meraj fathima" గారూ..
ఆలస్యంగానైనా నా ఆలోచనలను గురించి
మీ అభిప్రాయం తెలియచేస్తారని నాకు తెలుసండీ..
మనిషి,మనసు గురించి మంచి విషయం చెప్పారు!

పోస్ట్ నచ్చినందుకు,మీ స్పందన తెలిపినందుకు ధన్యవాదములు..

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

"the tree" గారూ..
థాంక్సండీ..
మీకు,మీ కుటుంబ సభ్యులకు వినాయకచవితి శుభాకాంక్షలు..

రవిశేఖర్ హృ(మ)ది లో చెప్పారు...

మీ కవిత ప్రస్తుత పరిస్థితికి అద్దం పట్టింది.జీవితమనే పరుగు పందెంలో గెలవాలని పడే తాపత్రయంలో అన్నీ మరిచి పోతున్నారు.గమ్యమే కాదు గమనం కూడా ముఖ్యమే ఎప్పుడో సాధించబోయే దాని కోసం కాకుండా వర్తమానాన్ని ఎంత ఆనందంగా గడుపుతున్నామన్నది ముఖ్యం.మంచి కవిత.

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

"oddula ravisekhar" గారూ..

కవిత నచ్చినందుకు,మీ స్పందన తెలిపినందుకు ధన్యవాదములు..

Related Posts Plugin for WordPress, Blogger...