జీవితమనే మన ప్రయాణంలో ఎన్నో ...
మజిలీలు,గమ్యాలు
సుఖాలు, దుఖాలు
సంతోషాలు,బాధలు
బంధాలు ,బాధ్యతలు....
సుఖం వచ్చినప్పుడు సంతోషించటం,దుఖం కలిగితే బాధపడటం మనిషికి సహజం..
జీవితమనే ఈ ప్రయాణంలో ఎన్ని కష్టాలొచ్చినా నష్టాలొచ్చినా మనసున మనసై బ్రతుకున బ్రతుకై మన కష్ట,సుఖాల్లో పాలు పంచుకునే మనిషి వున్నవాళ్ళు అదృష్టవంతులు...ఎప్పుడైనా నాకు అనిపిస్తూ ఉంటుంది ఎప్పుడూ కష్టాలు,బాధలు వచ్చే మనిషి దురదృష్టవంతుడు కాదు..ఆ కష్టాల్లో నీకు నేనున్నాను,నీ కష్టం నాది అని కనీసం ఓదార్చే తోడులేని మనిషే నిజమైన దురదృష్టవంతుడు అని..
జీవితంలో కొన్ని బంధాలు జన్మతో ఏర్పడతాయి..మరికొన్ని మనం ఎంచుకునే స్నేహితుల ద్వారా,జీవిత భాగస్వాముల ద్వారా ఏర్పడతాయి, ఎలా ఏర్పడిన బంధమైనా, ఏ సంబంధమైనా ...
నిన్ను నిన్నుగా ప్రేమించుటకు,నీ కోసమే కన్నీరు నింపుటకు
నేనున్నానని నిండుగ పలికే తోడొకరుండిన
అదే భాగ్యము.. అదే స్వర్గము
నేనున్నానని నిండుగ పలికే తోడొకరుండిన
అదే భాగ్యము.. అదే స్వర్గము
మనసున మనసై ... బ్రతుకున బ్రతుకై
తోడొకరుండిన అదే భాగ్యము ... అదే స్వర్గము..
12 కామెంట్లు:
ఎంత బాగా చెప్పారండి కొంత వచనం ,కొన్ని కోట్స్ ,ఓ పాట.మనల్ని అర్థం చేసుకునే స్నేహితుడు ఒక్కడుంటే చాలు జీవితానికి.
చక్కని పాటతో బాటు మంచి స్ఫూర్తి దాయకమైన సూక్తులతో కూడిన
చిత్రాలతో బాగుంది ఈ పోస్ట్... అభినందనలు రాజి గారూ!
@శ్రీ
well said!
"oddula ravisekhar" గారూ..
నిజమేనండీ "మనల్ని అర్థం చేసుకునే స్నేహితుడు ఒక్కడుంటే చాలు జీవితానికి"
పోస్ట్ నచ్చినందుకు ThankYou..
ఎందుకో గాని ఈ పాటంటే నాకు చాలా ఇష్టం రాజీ. కొటేషన్స్ కూడా ఎంత బాగున్నాయో. ఇన్ని జీవిత సత్యాలు చెప్తుంటె ఎలా:)
శ్రీ గారూ..
పాట,కొటేషన్స్,పోస్ట్ నచ్చినందుకు,
మీ అభినందనలకు ధన్యవాదములు..
ThankYou రసజ్ఞ గారూ..
"జయ" గారూ.. బాగున్నారా?
పాట,కొటేషన్స్ నచ్చినందుకు థాంక్సండీ.
అలాగే ఈ కొటేషన్స్ జీవిత సత్యాలన్నందుకు చాలా సంతోషం కూడా :)
very very nice raji garu
"skvramesh" గారూ..
"Thank You Very Much"
పోస్ట్ బాగుంది .
"మాలా కుమార్" గారూ..
పోస్ట్ నచ్చినందుకు థాంక్సండీ..
కామెంట్‌ను పోస్ట్ చేయండి