సంక్రాంతి రాకముందే మొదలైన సంక్రాంతి సంబరాలు అందరినీ బిజీ బిజీ చేసేసాయి.సంక్రాతి పండగ అంటేనే ముగ్గుల పండగ కదా అందుకే అందరూ ఆడవాళ్ళకి ముగ్గుల పోటీలు పెట్టటంలో పోటీ పడుతున్నారు. ఆడవాళ్ళు కొంతమంది నిజంగానే పోటీపడుతూ వాళ్ళ ముగ్గుకే మొదటి బహుమతి రావాలంటూ ముగ్గులు వేస్తే మరికొందరు మాత్రం కనీసం పార్టిసిపేట్ చేసినందుకైనా ఇచ్చే గిఫ్ట్ కోసం ముగ్గులు వేశారు.
అలాగే ఈ సంవత్సరం ముగ్గుల పోటీల్లో మహిళలు నిర్భయకు నివాళిగా, ఆమెకు న్యాయం జరగాలని, కరెంట్ సమస్యలు,తెలుగు భాషాభిమానం వంటి సంగతులను ముగ్గులో ప్రస్తావించారు...ఇవీ నిన్న జరిగిన ముగ్గుల పోటీలో కొన్ని విశేషాలు.. నాకు నచ్చిన కొన్ని ముగ్గులు..
4 కామెంట్‌లు:
హ హా...భలే ఉన్నాయండీ ముగ్గులు. ముగ్గులతో వీధులన్నీ వైభవంగా ఉన్నాయి.
అంబరాలనంటే సంబరాలు అలా అంబరానికెగిరి పోకుండా ఇంటి ముంగిట రంగులతో చేసే సందడి పండగే రంగు రంగుల సంక్రాంతి.
కలిసి సంబరం చేసుకునే ప్రతి మనసూ విజేతే, పోటీలో నిలిచే ప్రతి ముగ్గూ విజేతే!
"చిన్ని ఆశ" గారూ.. నిజమేనండీ
"కలిసి సంబరం చేసుకునే ప్రతి మనసూ విజేతే, పోటీలో నిలిచే ప్రతి ముగ్గూ విజేతే!"
ముగ్గుల పోటీలు చూడటం చాలా సరదాగా అనిపించింది.. రంగురంగుల సంక్రాంతి కళ అంతా అక్కడే కనిపించింది..
అందరి ముగ్గులను మెచ్చుకున్నందుకు,మీ స్పందనకు ధన్యవాదములు :)
Anni muggulu chaalaa baagunnaayi.. Raajee gaaru.
Thanks for Sharing.
"వనజవనమాలి" గారూ..
మీకు ముగ్గులు నచ్చినందుకు,మీ అభినందనలకు థాంక్సండీ..
కామెంట్‌ను పోస్ట్ చేయండి