ఆగదేనాడు కాలము ఆగినా గడియారమూ అంటూ కాలం ఎవ్వరి కోసం ఆగదు . అలసట, నీరసం మనకుంటాయేమో కానీ కాలానికి కాదు . అందుకే అది ఎప్పుడూ పరిగెత్తుతూనే వుంటుంది నిర్విరామంగా ..
సంతోషంలో చిరునవ్వు... బాధలో దుఃఖం
ప్రేమానురాగాలు ... అసూయ ద్వేషాలు
హృదయంలో నిలిచిపోయే తీపి జ్ఞాపకాలు ,
గుర్తుకు తెచ్చుకోవటం కూడా ఇష్టం లేని కొన్ని గుర్తులు
కొందరు మనుషులు... కొన్ని సంఘటనలు నేర్పిన గుణపాఠాలు
సంతోషాన్నిచ్చే కొత్త బంధాలు ..
సంతోషాన్నిచ్చే కొత్త బంధాలు ..
వదులుకోవాల్సి వచ్చే కొన్ని బంధుత్వాలు
కలిసే కొత్త స్నేహాలు ..
కలిసే కొత్త స్నేహాలు ..
ఇష్టం లేకపోయినా సాగిపోవాల్సిన కొన్ని దారులు
వదిలేసిన పాత ప్రదేశాలు ... చేరుకున్న కొత్త మజిలీలు
ఎప్పుడూ దోబూచులాడే గెలుపు ఓటములు
పెరుగుతున్న వయసు .... నేర్చుకుంటున్న అనుభవాలు
వీటన్నిటినీ భరిస్తూ, తనలోనే దాచుకుంటూ ...
నేను కూడా కాలం లాగా అలుపు లేని దాన్నే అంటుంది మనసు ...
కేవలం డైరీ కాగితాల్లో నిలిచిపోయేది మాత్రమే కాలం కాదు...
"ఏమి రాసినా కాగితం తనలో దాచుకుంటుంది.. కానీ కొన్ని రాతలు మాత్రమే కాగితాన్ని దాచుకునేలా చేస్తాయి"...
అనుభవాలు కూడా అంతే .. చాలా అనుభవాలు తామరాకు మీద నీటిబొట్టులా జారిపోతుంటాయి.కొన్ని మాత్రమే మనసు పొరల మధ్య మొగలిరేకుల్లాగా నిలిచి పోతుంటాయి ...
ఏ జ్ఞాపకం తామరాకు మీద నీటి బొట్టు అవుతుందో,
ఏ అనుభవం మది పొరల్లో మొగలిరేకు అవుతుందో నిర్ణయించాల్సింది కాలమే..
ఏ అనుభవం మది పొరల్లో మొగలిరేకు అవుతుందో నిర్ణయించాల్సింది కాలమే..
కొంతమంది జీవితాన్ని తమ కోణం లో నుండే చూస్తారు..
వాళ్ళు చేసేదే సరైనదని,ఎదుటి వాళ్ళు చేసేదంతా తప్పనీ ,
తనలో తప్ప అందరిలో లోపాలుంటాయని గట్టిగా నమ్ముతారు..
కానీ జీవితంలో అనుభవం పెరిగే కొద్దీ , అభిప్రాయాలు మారే కొద్దీ
ఒకప్పుడు ఎంతో గొప్పగా కనపడిన వారి ప్రవర్తన వారినే పునరాలోచించుకునేలా చేస్తుంది...ఏది తప్పు,ఏది ఒప్పు, ఎవరు ఎలాంటి వాళ్ళు, అనేది అనుభవపూర్వకంగా మాత్రమే మనకి తెలుస్తుంది .
ఆ అనుభవాన్ని నేర్పే గురువు కూడా కాలమే ...
కాబట్టి కాలం ముందు ముందు మనకోసం ఏమి దాచించో అనే మంచి ఊహలతో ,కోరికలతో సంతోషంగా సాగిపోవటమే మనిషి విధి అని కాలమనే గురువు గారి ఉవాచ ..
0 కామెంట్లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి