ఈ ప్రపంచంలో మనిషికి కనీసావసరాలు కూడు, గూడు, గుడ్డ ఇది మొన్నటిదాకా మనందరికీ తెలిసిన విషయం.ఐతే ఈ మధ్య వచ్చిన "ఉలవ చారు బిర్యానీ" సినిమాలో ప్రకాష్ రాజ్ చెప్పిన ఒక మాట
"ప్రపంచంలో మనిషికి రెండు విషయాలు కామన్ ఒకటి ప్రేమ రెండు ఆకలి" ...
నిజమే కదా మనిషి ఆకలికి తట్టుకోలేడు అలాగే తనని ప్రేమించే మనుషులు లేకపోయినా తట్టుకోలేడు. రెంటికీ మనిషి జీవితం తో ఇంత అవినాభావ సంబంధం ఉందన్న మాట ..
తిండి విషయానికి వస్తే కొంత మందికి తినాలని ఉన్నా వాళ్ళు కోరినట్లు వండి పెట్టే వాళ్ళు ఉండరు .బయట తిందామంటే ఆరోగ్యానికి ఇబ్బంది . ఇలా ఎంత డబ్బున్నా, ఏమున్నా కోరుకున్నవి తినలేని వాళ్ళు కూడా వుంటారు . తినాలనిపించింది ఏదైనా సరే ఏ సందేహం లేకుండా తినేసి ఏ ఇబ్బంది లేకుండా ఉండగలిగే వాళ్ళే నిజమైన అదృష్టవంతులు అనిపిస్తుంది ఒక్కోసారి .
సాధారణంగా వంటని,వంట చేసే వాళ్ళని చులకనగా చూస్తుంటారు ."Cooking Isn't Rocket Science" అని కూడా అంటుంటారు కొంతమంది. కానీ నాకు మాత్రం కుకింగ్ Rocket Science లాంటిదే .. కొత్త కొత్త ప్రయోగాలు చేయటం, అవి బాగున్నాయా లేదా అని తిన్న వాళ్ళు మన వాళ్లైనా బయటి వాళ్లైనా సరే వంట గురించి వాళ్ళ అభిప్రాయం చెప్పేదాకా ఎలా వుందో ఏమిటో అని వాళ్ళ ఫీడ్ బాక్ కోసం ఎదురు చూడటం,వాళ్ళు మెచ్చుకుంటే సంతోషించటం, బాగా లేదంటే అంతటితో ఆ ప్రయత్నం విరమించటం లేదా పట్టుదలతో మళ్ళీ సాధించటం ..ఈ అనుభవాలన్నీ ఏ శాస్త్రవేత్త అనుభవాలకి తీసిపోవని నా అభిప్రాయం..మా ఇంట్లో శాస్త్రవేత్తలు మాత్రం మా అమ్మ,చెల్లి...
మా చిన్నప్పుడు అమ్మ వాళ్ళ రోజుల్లో మగ వాళ్ళు వంట గది వైపుకి కూడా వెళ్ళకూడదు అలా వెళ్ళటం అవమానంగా భావించే వాళ్ళు . పురాణాల్లో నలుడు,భీముడు ఇలా మగవాళ్ళే వంట చేశారని ఉన్నా ఎందుకనో కొంత కాలం ఆ విషయాన్ని మర్చిపోయి వంట అంటే ఆడవాళ్ళ పనే అన్నట్లు డిసైడ్ అయ్యారు . కానీ తర్వాతి రోజుల్లో వంట మగవాళ్ళకు కూడా హాబీ అయిపొయింది . హాబీ నుండి వృత్తిగా కూడా మారిపోయింది .
స్టార్ హోటళ్ళ నుండి చిన్న హోటళ్ళలో కూడా మగ వాళ్ళే షెఫ్ లు ఇప్పుడు . హిందీ లో సంజయ్ కపూర్ , మన తెలుగు లో ఐతే ఈ టీ వీ రాజు గారు ఆడవాళ్ళ మధ్యలో సరదాగా తిరుగుతూ వంటచేసేస్తుంటారు. టీ వీ షోలే కాదు ఇళ్ళలో కూడా ఆడుతూ పాడుతూ వంటలు చేసే మగవాళ్ళు ఉన్నారనేది అందరికీ తెలిసిన విషయమే కదా ..
ఒకప్పుడు చదువు రాని వాళ్ళు, ఇంటర్ లో ఎమ్ సెట్ లో ర్యాంకు రాని వాళ్ళు హోటల్ మేనేజ్ మెంట్ కోర్సులు చేస్తారని ఒక అభిప్రాయం ఉంది . కానీ ఇప్పుడు చాలా మంది ఇష్ట పడి ఆ కోర్సులు చేస్తున్నారు . ఎంతోమంది ఆకలిని తీర్చి , ఆరోగ్యాన్ని కాపాడే వంటని వృత్తిగా ఎంచుకోవటం కూడా గొప్పే కదా అనిపిస్తుంది . దేశం మొత్తం లోని సాంప్రదాయ రుచులతో పాటు వివిధ ప్రాంతాలకు చెందిన వంటలను పరిచయం చేస్తూ కొత్త కొత్త హోటళ్ళు ,రెస్టారెంట్లు అందరినీ ఆకట్టుకుంటున్నాయి .ఆంధ్రా స్వగృహ ఫుడ్స్, తెలంగాణారుచులు, రాయలసీమ ఘాటు రుచులు, ఇలా వంటల్లో కూడా ప్రాంతీయతని గుర్తు చేస్తున్నారు ..
పండగలంటే పూర్ణాలు,బొబ్బట్లు ,పులిహోర, గారెలు ఇవీ స్పెషల్ వంటలు .. కానీ ఇప్పుడు కొత్త కొత్త వంటలు ఇంట్లోనే రెడీ అవుతున్నాయి .నెట్ లో చూసి, టీవీలో చూసి రక రకాల ప్రయోగాలు చేస్తున్నారు . బీరకాయ పీచు పాయసం , అరటి తొక్క పచ్చడి లాంటివి కూడా చేసేసి ఇవే కొత్త ప్రయోగాలు అంటారు కొంత మంది టీవీలో.. ఇలాంటి వాళ్ళను చూసినప్పుడు మాత్రం వంట ఇలాగ కూడా చేస్తారా అనిపిస్తుంది .
మన తెలుగు టీవీల్లో వంటలు, వంటల ప్రయోగాలు కాస్త ఆగినట్లున్నాయి
ఈ మధ్య.. హిందీలొ కొన్ని ఛానల్స్ పూర్తిగా వంటలే వచ్చేవి వున్నాయి వాటిలో చెఫ్ సంజయ కపూర్ zee khana khajana , Food Food ,Active cooking ఛానల్స్ చాలా బాగుంటాయి .. కొత్త కొత్త ప్రదేశాల వంటలు, పద్ధతులు తెలుసుకోవచ్చు వీటి ద్వారా
ఇక నెట్ లోవంటల బ్లాగర్లు కూడా విభిన్న ప్రాంతాల వంటలను పరిచయం చేస్తున్నారు.. ఒకప్పుడు తెలియని వంటని ఫోనులు చేసి మరీ అమ్మల్ని, ఫ్రెండ్స్ ని అడిగి తెలుసుకున్నట్లు ఇప్పుడు బ్లాగులు చూసి నేర్చుకుంటున్నారు..బ్లాగుల్లో వంటలు సులభంగా అర్ధమయ్యేలాగానే ఉంటున్నాయి.వాటిని చూసి నేర్చుకోవచ్చు,చేయొచ్చు కొన్ని బాగానే వస్తాయి .. ఇలాంటివి కొత్తగా వంట నేర్చుకునే వాళ్లకి ఉపయోగకరం కూడా ..
టీవీలు,బ్లాగులు ఇవేమీ చూడకుండా వంట చేయలేరా,ఇంతకుముందు వాళ్ళు చేయలేదా అనిపిస్తుంది కానీ మనకేమీ నష్టం లేనంతవరకు కొత్త, మంచి విషయాలను చూసి నేర్చుకోవటంలో కూడా తప్పు లేదు కదా...
ఇవాళ ఉలవచారు బిర్యానీ లో "ఈ జన్మమే రుచి చూడటానికి దొరికేరా" పాట విని ఈ వంట,తిండి పురాణం రాయాలనిపించింది.
ఈ జన్మమే రుచి చూడటానికి దొరికేరా
ఈ లోకమే వండి వార్చటానికి వేదికరా
ఈ లోకమే వండి వార్చటానికి వేదికరా
మరొక తిండి పురాణం పాట మిధునంలో .. ఆంధ్రుల ఆవకాయ,గోంగూర నుండి మన పూర్వీకుల వంటలన్నీ వడ్డించారు ఈ పాటలో
ఆవకాయ మన అందరిదీ
EAT WELL STAY WELL
4 కామెంట్‌లు:
నిజమేనండి...పాకశాస్త్రం అంటే రాకెట్ సైన్సే.. ఎన్నెన్ని కొత్త వంటలో రోజూ వస్తున్నాయి.. వంటల మీదా పెద్ద పెద్ద చానల్స్ "మాస్టర్ చెఫ్" లాంటి పోటీలే పెడుతున్నాయి. ఏ వంటకానైనా ఆస్వాదించి తింటే ఆ అనందమే వేరు.. ఈ వంటలు చేసెవారిలో కూడా సబ్జెక్ట్ మాస్టర్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు .. వంట సైన్స్ కాదని ఎవరు అన్నారు...ఇది హోం సైన్స్ ...మంచి టపా రాసారు..
"నవజీవన్" గారూ..
'మాస్టర్ చెఫ్' ఇంగ్లీష్ కాదు కానీ స్టార్ ప్లస్ హిందీలో చూసే వాళ్ళం .
చాలా బాగుండేది రక రకాల టార్గెట్స్ , పోటీలతో ..
మీరన్నట్లు వంటల చానల్స్ లో
Food Food, Active Cooking, Zee Khana Khajana
ఇవన్నీ బాగుంటాయి ..
వంటల గురించి నా పోస్ట్ నచ్చి మీ అభిప్రాయం చెప్పినందుకు చాలా థాంక్సండీ ..
Thank You ..
మంచి ఆహారం తింటే మంచి ఆరోగ్యంతో పాటూ మంచి ఆలోచనలు వస్తాయట. వంట చేసేవాళ్ళ ఆలోచనా ప్రభావం తినే వాళ్ళ మీద కూడా వుంటుందని ఒక కధ చదివాను . నాకైతే మాత్రం వంట చేయటం కంటే తినటమే ఇష్టం .
మంచి కాఫీ లాంటి సినిమా లాగా మంచి Food లాంటి పోస్ట్ బాగుంది
"Swarna M" గారూ..
నాకూ మీలాగ వండటం కన్నా తినటమే ఎక్కువ ఇష్టం .. :)
పోస్ట్ నచ్చినందుకు,మంచి మంచి కామెంట్ ఇచ్చినందుకు థాంక్సండీ
కామెంట్‌ను పోస్ట్ చేయండి