హైదరాబాద్ పుస్తక ప్రదర్శన ఈ నెల 17 న మొదలయ్యింది. పుస్తకాలంటే మా ఇంట్లో అందరికీ ఆసక్తే కాబట్టి చూసి,కొని వద్దామని బయలుదేరాము. ఈ పుస్తక ప్రదర్శనని పుస్తక ప్రదర్శన కాదు పుస్తకాల సముద్రం అనాలేమో .. ఢిల్లీ,కోల్ కతా నగరాల తర్వాత అతిపెద్ద పుస్తక ప్రదర్శన ఇదేనట. తిరిగే ఓపిక, కొనే ఓపిక ఉండాలే కానీ లేని పుస్తకం అటూ లేదేమో అనిపించేన్ని ఎన్నో పుస్తకాలు ఇక్కడ ఉన్నాయి.
ప్రవేశ టికెట్ ఒకరికి 5 రూపాయలు.ఈ టికెట్ పోయిన సంవత్సరం లేదట. ఈ సంవత్సరమే పెట్టారని ఎవరో జర్నలిస్ట్ అడిగితే చెప్తున్నారు అక్కడి వాళ్ళు.
Asia Law House వాళ్ళ స్టాల్ బాగుంది.సుప్రీం కోర్టు సీనియర్ న్యాయమూర్తి కృష్ణ అయ్యర్ గారి పుస్తకాలు చాలా ఉన్నాయి ఇక్కడ.
పుస్తక ప్రదర్శన లో ఈసారి ఒక విశేషం బ్లాగ్,ఫేస్ బుక్ ఫ్రెండ్స్
తమ రచనలతో ఏర్పాటు చేసిన స్టాల్...
బ్లాగ్స్ లో ఫేస్ బుక్ లో తెలిసిన మాలా కుమార్ గారు, ఇంకా కొంతమంది రచయిత్రులు రాసిన "తండ్రి, తనయ" పుస్తకం కొన్నాను. రైటర్ కన్నెగంటి అనసూయ గారు,బ్లాగర్,రైటర్ జ్యోతి,జ్ఞాన ప్రసూన గారు వారి పుస్తకాలను గురించి చెప్పారు.
ఓషో -- మహిళ
మహిళ గురించి ఏమి రాశారో తెలుసుకోవాలని
ఈ పుస్తకం కొన్నాను.
పెద్దల కోసం వంటల పుస్తకాలు
పిల్లల కోసం కార్టూన్స్,cd లు
రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రచురణ
సంస్థలు,ప్రజలు ఈ ప్రదర్శనలో పాల్గొన్నా ప్రదర్శన అంతా తెలంగాణా
ఆనవాళ్ళు,సాంస్కృతిక చిహ్నాలతో తెలంగాణా వైతాళికుల పేర్లు,చిత్రాలతో
ఏర్పాటు చేసిన వేదికలు,ద్వారాలతో మొత్తానికి పుస్తకాల ప్రదర్శన అంతా
తెలంగాణా సాంస్కృతిక అస్తిత్వ ప్రదర్శనగా కళ కళ లాడుతుంది...
పుస్తక ప్రపంచంలో ఎంత సేపు విహరించినా విసుగు రాలేదు. కానీ కాళ్ళ నొప్పులతో ఆగిపోవాల్సి వచ్చింది. ఇవీ "హైదరాబాద్ బుక్ ఫెయిర్ 2014" విశేషాలు.
0 కామెంట్లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి