కొన్ని పాటలు,మాటలు వినటానికి చాలా బాగుంటాయి,వింటుంటే మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి .. వాటిలోని అసలైన అర్ధాన్ని తెలుసుకుని వింటే మరింత నచ్చుతాయి,ఎప్పటికీ మనసులో అలా గుర్తుండిపోతాయి.."మానస సంచర రే" గీతం అందరికీ తెలిసినదే కానీ ఆ పాటకి అర్ధం మాత్రం నెట్ లో డా . తాడేపల్లి పతంజలి గారి "తెలిసిన పాటలు - తెలియని మాటలు" వివరణ చూసి, ఈ మధ్యనే నేను తెలుసుకున్నాను..
"మానస సంచర రే" - నాకు అర్ధమైన అర్ధ వివరణలు
"రే" - ఒరేయ్ (తక్కువ వారిని పిలవటానికి ఉపయోగించే పదం ) తో
మనసును "రే" అని సంభోదిస్తూ ..
అక్కడక్కడా పనికిమాలిన విషయాలలో అదేపనిగా తిరిగే ఓ మనసా!
శ్రీకృష్ణ పరబ్రహ్మానికి సంబంధించిన విషయాలు వింటూ,చదువుతూ అందులోనే ఆనందాన్ని అనుభవించు.
ఓ మనసా సంతోషంతో నాట్యంచేసే నెమలి పింఛాన్ని అలంకరించుకున్న తల వెంట్రుకలు కలిగిన శ్రీ కృష్ణుని ధ్యానించు.
తనను కొలిచే వారికి మందార కల్పవృక్షంలా కోరిన కోరికలు తీర్చే శ్రీ కృష్ణుని యందు మనస్సు నిలుపు.
కష్టమనే గ్రీష్మానికి ఎండిపోయిన హృదయాలయందు పిల్లనగ్రోవి అనే తీయని ప్రవాహాన్ని నింపే శ్రీ కృష్ణుని నిరతము ధ్యానించు..
అంటూ ఇంకా చాలా మంచి వివరణలతో ఉన్న ఈ పాట చాలా బాగుంది.
మానస సంచర రే ..
మానస సంచర రే .. మానస సంచర రే
బ్రహ్మణి మానస సంచర రే
మానస సంచరరే బ్రహ్మణి మానస సంచర రే
మదశిఖిపింఛా అలంకృత చికురే
మహనీయ కపోల విజితముకురే
మానస సంచరరే బ్రహ్మణి మానస సంచర రే
బ్రహ్మణి మానస సంచర రే
మానస సంచరరే బ్రహ్మణి మానస సంచర రే
శ్రీరమణీకుచ దుర్గవిహారే
సేవక జనమందిర మందారే
మానస సంచరరే బ్రహ్మణి మానస సంచర రే
బ్రహ్మణి మానస సంచర రే
మానస సంచరరే బ్రహ్మణి మానస సంచర రే
పరమహంస ముఖ చంద్రచకోరే
పరిపూరిత మురళీరవ ధారే
మానస సంచరరే బ్రహ్మణి మానస సంచర రే
బ్రహ్మణి మానస సంచర రే
మానస సంచరరే బ్రహ్మణి మానస సంచర రే
0 కామెంట్లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి