పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

24, డిసెంబర్ 2015, గురువారం

మనీ మ్యూజియం - నాసిక్




నాసిక్ నుండి త్రయంబకేశ్వర్ వెళ్ళే దారిలో మనీ మ్యూజియం ఉంది .ఈ మ్యూజియం గురించి ఎక్కడా వినలేదు, చూడాల్సిన ప్రదేశాల లిస్టు లో కూడా లేకపోయినా మా తమ్ముడు దారి తెలియటం కోసo ఉపయోగించిన "GPS" మేము వెళ్తున్న రోడ్ లోనే మ్యూజియం ఉందని చూపించటంతో సరే చూద్దామని మెయిన్ రోడ్ నుండి కొంచెం లోపలి వెళ్ళగానే ప్రశాంతమైన వాతావరణంలో చుట్టూ పచ్చని ప్రకృతి మధ్యలో అంజనేరి పర్వత్ కి దగ్గరలో ఉన్న మనీ మ్యూజియం ఇంకా K.G. మహేశ్వరీ ఫోటో ఆర్ట్ గ్యాలరీ కనిపించాయి.అక్కడ ఒకొక్కళ్ళకి 20 రూపాయల టికెట్ తీసుకోవాలి.లోపలికి కెమెరాలు  అనుమతిస్తారు.Indian Institute of Research in Numismatic Studies  ఆధ్వర్యంలో 1980 లో ఏర్పాటు చేసిందే ఈ కాయిన్  మ్యూజియం. నాణేల సేకరణ శాస్త్రంను ముద్రాశాస్త్రం అని కూడా అంటారు. నుమిస్మాటిక్స్ అనే ఈ శాస్త్రం కరెన్సీపై అధ్యయనం చేయడం మరియు నాణేలు, టోకెన్లు, పేపర్ మనీని ఇంకా ద్రవ్య సంబంధిత వస్తువులను సేకరించడం చేస్తుంది.


ఈ మ్యూజియంలో కరెన్సీ విధానానికి సంబంధించి ఎన్నో వస్తువులు, ఫొటోలు ప్రదర్శిస్తారు.బంగారు నాణాలు,గుప్త ,మొఘల్,మరాఠా,ఢిల్లీ సుల్తాన్,డెక్కన్,సౌత్ ఇండియన్,ఇస్లామిక్,విజయనగర,రిపబ్లిక్ ఇండియా,బ్రిటిష్ & ఇండిపెండెంట్ ఇండియా ఇలా ఎన్నోరకాల నాణాలు,నోట్లు ఇక్కడ చూడొచ్చు. పురాతన నాణాలు సేకరించే ఆసక్తి ఉన్నవాళ్ళకి ఈ మ్యూజియం బాగానచ్చుతుంది.ఈ మ్యూజియం చూడటం ద్వారా ఏంతో కొంత కొత్త విషయాలైతే తప్పకుండా తెలుసుకోవచ్చు.


రిసెప్షన్ లో గ్లాస్ లో పెట్టిన బ్రిటీష్ టైమ్ బగ్గీ












ఈ మనీ మ్యూజియం లోనే  ఉన్న మరో చూడాల్సిన ప్రదర్శన K.G. మహేశ్వరీ ఆర్ట్ గ్యాలరీ. దీనికి సంబంధించిన విశేషాలు  ఈ పోస్ట్ లో చూడొచ్చు  K. G. Maheshwari Photo Art Gallery - Nasik




Related Posts Plugin for WordPress, Blogger...