నిన్న మా అమ్మ పుట్టినరోజు. మా అమ్మ ఉగాది పండగరోజే పుట్టింది కాబట్టి ప్రతి ఉగాదికి మాకు రెండు పండగలు.నిన్న face Book లో విషెస్ పెట్టాను.నా ఫ్రెండ్స్,మా తమ్ముడి ఫ్రెండ్స్ అందరూ అమ్మకి విషెస్ చెప్పారు. ఎప్పుడూ బ్లాగ్ లో కూడా విషెస్ పెట్టేదాన్ని ఈసారి పెట్టలేదు.కొంచెం లేట్ గా ఈరోజు పోస్ట్ చేస్తున్నాను.ఎంతైనా బ్లాగ్‌లో రాసుకున్నవన్నీ మంచి జ్ఞాపకాలుగా ఎప్పటికీ నిలిచిపోతాయి కదా..
ఉగాది రోజునే పుట్టిన మా అమ్మకి పుట్టినరోజు శుభాకాంక్షలు
Happy BirthDay అమ్మ :)
మాలోనే తన చిన్నిప్రపంచాన్ని చూసుకుంటూ
నేను, తమ్ముడు,చెల్లి ఎలాంటి అసూయద్వేషాలు
నేను, తమ్ముడు,చెల్లి ఎలాంటి అసూయద్వేషాలు
లేకుండా ఎప్పటికీ ఒకరికొకరు తోడుగా నిలవాలనే ప్రేమ,ఆప్యాయతలు
ఎవరికీ మేలు చేయలేకపోయినా,కీడుమాత్రం చేయొద్దని,
మాకు మేముగా ఎవరినీ ఇబ్బంది పెట్టకూడదనే ఆలోచనతో పాటు
కావాలని మాకు హాని చేయాలనుకునే వాళ్ళనుండి కాపాడుకోగలిగే ధైర్యం
ఎవరినుండి ఏమీ అతిగా ఆశించకూడదు,ఎవరి తోడు లేకపోయినా
దేవుడు ఎప్పుడూ మనల్ని కాపాడతాడనే నమ్మకంతో పాటు,
సమాజంలో ఎక్కడ ఎలా ప్రవర్తించాలి ,మాట్లాడాలనే హద్దులు తెలుసుకునే ఇంగితఙ్ఞానం
రాత్రి ఉంటే పగలు కూడా ఉంటుంది, ప్రయాణం ఉంటే గమ్యం కూడా ఉంటుంది,
అలాగే ప్రతి సమస్యకీ పరిష్కారం ఉంటుంది కాబట్టి
ఎన్ని సమస్యలున్నా ఎదుర్కోవాలనే ఆత్మవిశ్వాసం
అన్ని విషయాలు గురువు,నేస్తంగా నేర్పిన, నేర్పుతున్న
మా అమ్మని ఆయురారోగ్యాలతో కాపాడమని భగవంతుడ్ని వేడుకుంటూ,
ఎప్పటికీ మాకు తోడుగా,మా అందరితో సంతోషంగా ఎన్నో పుట్టినరోజులు చేసుకోవాలని కోరుకుంటూ...
Happy Birthday 🎂💐 అమ్మా
Many Many Happy returns of the day...
నా కలలని కన్నది నీవే నా మెలకువ వేకువ నీవే
ప్రతి ఉదయం వెలుగయ్యింది నీవేగా
నా కష్టం నష్టం నీవే చిరునవ్వు దిగులు నీవే
ప్రతి నిమిషం తోడై ఉంది నీవేగా
Love u మా 💕💞💝
Raaji,Vamsi,Ramya
5 కామెంట్లు:
కదిలే కాలాన్ని కట్టేసి మీ చిన్ని ప్రపంచపు
మధుర భావాల సుమ మాలతో మా కనులను
అలంకరించినందులకు మీకు అభినందనలు.
కష్టం, నష్టం, చిరునవ్వూ, దిగులు అన్నింటా
ప్రతి నిమిషం మీ తోడూ, నీడా - మెలకువ,
వేకువ, ధైర్యం, నమ్మకం అన్నీ తానైన మీ
మాతృమూర్తికి నా జన్మదినోత్సవ శుభాకాంక్షలు...
మీ అమ్మ గారి యెడ మీ అనురాగాన్ని
చక్కని మాటల్లో సున్నితంగా పొందు పరచడం ద్వారా
మీరు మా అభిమానాన్ని అందుకున్నారిలా ...
:)
"nmrao bandi" గారు..
నా చిన్నిప్రపంచం,అమ్మకి నేను అందించిన శుభాకాంక్షలు
మీకు నచ్చి,మెచ్చుకుని,అభిమానంతో అందించిన చక్కని వ్యాఖ్యకు,
మా అమ్మకి మీరందించిన జన్మదిన శుభాకాంక్షలకు
హృదయపూర్వక ధన్యవాదాలండీ..
మీ శుభాకాంక్షలు మా అమ్మగారికి అందించాను చాలా సంతోషించారు :)
Thank You so much..
రాజిగారు: మీ అమ్మగారికి నా పుట్టినరోజు శుభకామనలు అందించండి.
ఉగాది రోజు అమ్మ పుట్టినరోజు గుర్తుంచుకుని wishes అందించినందుకు అమ్మ చాలా సంతోషించారండి,
నేను కూడా :) Thank you so much లలిత గారు ..
__/\__ ...
:)
కామెంట్‌ను పోస్ట్ చేయండి