పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

26, డిసెంబర్ 2018, బుధవారం

మా గుంటూరు కూరగాయల మార్కెట్ / 🌽 Vegetable Market Tour 🌽 @ My Guntur..

మా గుంటూరు కూరగాయల మార్కెట్
 🌽 Vegetable Market Tour 🌽 @ My Guntur..

11, డిసెంబర్ 2018, మంగళవారం

శ్రీ ఛాయా సోమేశ్వరాలయం, నల్గొండ - పానగల్లు

శ్రీ ఛాయా సోమేశ్వరాలయం నల్గొండ - పానగల్లు 
Ancient & Mysterious Sri Chaya Someswara Temple

శ్రీ ఛాయా సోమేశ్వరాలయం తెలంగాణా రాష్ట్రం నల్గొండ  జిల్లాలోని పానగల్లు గ్రామంలో ఉంది.నల్గొండ నుండి 5 K.M దూరంలో పానగల్లు గ్రామం చివరిలో,పచ్చని పంటపొలాల మధ్య ఆలయం ఉంటుంది.

తెలంగాణా ప్రాచీన నగరంలో ఒకటైన పానగల్లు పట్టణం క్రీ. శ 11 - 12 శతాబ్దంలో కుందూరు చోళరాజుల రాజధానిగా ఉండేది..కాకతీయులకు సామంతులైన ఈ కుందూరు చోళులు తమ ఆరాధ్యదైవమైన పరమేశ్వరునికి ఈ ఛాయా సోమేశ్వరాలయాన్ని,పచ్చల సోమేశ్వరాలయాన్ని నిర్మించారు.ఈ ఆలయంలో లభించిన పురాతన శాసనాల ప్రకారం కాకతీయ ప్రభువు ప్రతాపరుద్రుడు కూడా ఆలయ అభివృద్ధికి కృషి చేశారని తెలుస్తుంది. 

ఈ ఆలయాన్ని త్రికూటాలయం అని కూడా పిలుస్తారు.తూర్పుముఖంగా వున్న గర్భగుడిలోని శివలింగంపైన రోజంతా ఒక స్తంభాకారలోని నీడ పడుతూ ఉంటుంది .ఇదే ఛాయా సోమేశ్వరాలయం లోని  ప్రత్యేకత.ఎప్పుడూ నీడతో (ఛాయ)కప్పబడి ఉంటాడు కాబట్టి ఇక్కడ స్వామికి ఛాయా సోమేశ్వరుడనే పేరు వచ్చింది.సుమారు పది దశాబ్దాలు ఈ నీడ ఎలా వస్తుందో ఎవరికీ తెలియని మిస్టరీ ఈ ఆలయంలో వుంది అంటారు.కానీ ఈ మధ్య తెలంగాణకే చెందిన ఎవరో టీచర్  ప్రయోగాలు చేసి నీడ ఎలా వస్తుందో కనిపెట్టారని చెప్తున్నారు. 

ఆలయంలో ప్రధాన మండపంలో స్తంభాలు,వాటిపైన శిల్పకళ చాలా బాగుంటుంది.ఆలయ ప్రాంగణంలో శిధిలమైన నంది విగ్రహాలు ,మండపాలు కనిపిస్తాయి.మేము 2016 పుష్కరాల తర్వాత వెళ్ళాము.పుష్కరాలకు గుడిని కొంచెం సరిచేశారని చెప్పారు అక్కడి పూజారి.సోమేశ్వరాలయం  హైదరాబాద్ నుండి 100 K.M దూరంలో ఉంటుంది.

పానగల్లు గ్రామంలో ఉన్న మరో శివాలయం పచ్చల సోమేశ్వరాలయం.దీన్ని కూడా కుందూరు చోళులు నిర్మించారు. ఆలయంలో 70 స్తంభాల మండపం,స్తంభాల మీద రామాయణ,మహాభారత ఘట్టాలు,పురాణ పాత్రలు చూస్తున్నట్లుగానే అనిపించే పెద్ద నంది ఈ ఆలయ ప్రత్యేకతలు.

ఆలయ విశేషాలు ఈ వీడియోలో చూడొచ్చు.

శ్రీ ఛాయా సోమేశ్వరాలయం

29, నవంబర్ 2018, గురువారం

మా గుంటూరు ఆర్ట్స్ & క్రాఫ్ట్స్ ఎగ్జిబిషన్ @ గుంట గ్రౌండ్

గుంటూరు గుంట గ్రౌండ్ గుంటూరు వాళ్లందరికీ బాగా తెలిసిన,పరిచయమున్న ప్రదేశం.ఇక్కడ మా చిన్నప్పుడు, అలాగే ఇప్పుడు కూడా సమ్మర్ లో ఎగ్జిబిషన్ పెడతారు.అందుకే ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ అని, దీన్నే నాజ్ సెంటర్ అని కూడా పిలుస్తారు.ఈ  మధ్య సంవత్సరంలో రెండు మూడు సార్లు ఆర్ట్స్ & క్రాఫ్ట్స్ ఎగ్జిబిషన్ కూడా పెడుతున్నారు. మేము కూడా వెళ్తుంటాము. ఎగ్జిబిషన్  విశేషాలు ఈ వీడియోలో చూడొచ్చు. 

 మా గుంటూరు ఆర్ట్స్ & క్రాఫ్ట్స్ ఎగ్జిబిషన్ @ గుంట గ్రౌండ్ 

23, నవంబర్ 2018, శుక్రవారం

మా ఊరు - మా స్కూల్ - మా జ్ఞాపకాలు - My School Memories

Old School Memories 
A trip down memory lane..

17, నవంబర్ 2018, శనివారం

శ్రీ చింతల రామలింగేశ్వర స్వామి ఆలయం (రామప్ప గుడి) - మాచర్ల - గుంటూరు జిల్లా

ఆలయంలో 2016 లో ఏర్పాటుచేసిన శివపార్వతుల విగ్రహాలు

మా మాచర్లలోని రామప్పగుడి - శ్రీ గంగా పర్వతవర్ధినీ సమేత, శ్రీ చింతల రామలింగేశ్వర స్వామి ఆలయం చిన్నప్పటి  జ్ఞాపకం.చిన్నప్పుడు కార్తీకమాసం,శివరాత్రి ఇలా పండగరోజుల్లో మాత్రమే ఈ ఆలయం ప్రస్తావన వచ్చేది. ఎందుకంటే ఆ గుడి ఊరికి చాలా దూరంగా ఉండేది.రవాణా సౌకర్యాలు అంతగా ఉండేవి కాదు.అయినా కార్తీకమాసం వనభోజనాలకు,పూజలకు తప్పకుండా ఈ గుడికి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు గుడి దగ్గర కూడా ఇళ్ళు,మంచి రోడ్లు,ఆటోలు అన్ని సౌకర్యాలు వచ్చేసాయి.

ఈ గుడి చాలా పురాతనమైనది.జమదగ్ని మహర్షి,రేణుకా మాతల కుమారుడు పరశురాముడు ప్రతిష్టించిన ఆలయంగా చెప్తారు.పరశురాముడు విష్ణుమూర్తి దశావతారాల్లో ఆరవ అవతారం.హైహేయ వంశస్థుడైన కార్తవీర్యార్జున చక్రవర్తి శాపవశాత్తూ చేతులు లేకుండా జన్మించి,దత్తాత్రేయుని పూజించి వేయి చేతులు వరంగా పొందుతాడు.ఒకరోజు వేటకోసం అడవికి వచ్చిన కార్తవీర్యార్జునుడు  జమదగ్ని మహర్షి ఆశ్రమానికి సేదతీరటానికి రాగా జమదగ్ని మహర్షి రాజుకి,ఆయన పరివారానికి పంచభక్ష్య పరమాన్నాలతో భోజనం పెడతాడు. అది చూసిన కార్తవీర్యార్జునుడు ఓక సాధారణ మహర్షికి ఇదంతా ఎలా సాధ్యపడిందని అడగగా, తన దగ్గరున్న కామధేనువు జాతి గోమాత వలనే అని చెప్తాడు.

అప్పుడు కార్తవీర్యార్జునుడు ఆ గోవును తనకిమ్మని అడగగా మహర్షి నిరాకరిస్తాడు.అందుకో కోపించిన చక్రవరి బలవంతంగా ఆవును తీసుకెళ్ళిపోతాడు.విషయం తెలుసుకున్న పరశురాముడు కార్తవీర్యార్జునుని వేయిచేతులు ఖండించి,సంహరించి గోమాతను తీసుకువస్తాడు.జమదగ్ని మహర్షి పరశురాముడిని మందలించి తపస్సు చేసుకోమ్మని పంపిస్తాడు.పరశురాముడు తండ్రిని చంపినందుకు కక్ష పెంచుకున్న కార్తవీర్యార్జునుని కుమారులు జమదగ్ని మహర్షిని చంపివెళ్ళిపోతారు.తల్లి దుఃఖం చూసిన పరశురాముడు 21 సార్లు భూ ప్రదక్షిణ చేసి, కార్తవీర్యార్జునుని కుమారులతో పాటు అధర్మపరులై ప్రజలను హింసిస్తున్న క్షత్రియ రాజుల్ని  సంహరిస్తాడు. యుద్ధాల్లో  గెలిచిన భూమిని కశ్యప మహర్షికి దానంగా ఇచ్చేసి, పాప ప్రక్షాళన కోసం తపస్సు చేసుకోవటానికి వెళ్ళిపోతాడు

ఆ తపస్సులో భాగంగా శివుడ్ని పూజించి 108 స్వయంభూ శివలింగాలను ప్రతిష్టించినట్లు, అందులో ఒకటి మాచర్ల లోని ఈ రామప్ప గుడి అనేది స్థలపురాణం.రామప్పగుడిని దక్షిణ కాశీగా పిలుస్తారు.ఇక్కడ స్వామిని దర్శిస్తే కాశీలో విశ్వనాధుడ్ని దర్శించినట్లుగా భక్తులు భావిస్తారు.ఇక్కడ స్వామికి స్వయంగా మనమే అభిషేకాలు చేయొచ్చు,స్పర్శదర్శనం చేసుకోవచ్చు.మేము ఈ కార్తీక మాసంలో మొదటి సోమవారం ఈ గుడికి వెళ్ళాము.ఆలయంలో స్వామివారికి అభిషేకాలు,అమ్మవారికి కుంకుమపూజ,రుద్రహోమం, ప్రతిరోజూ భక్తులకు అన్నదానం,సహస్ర దీపాల సేవ అన్ని చాలా బాగా జరుగుతున్నాయి.

మా రామప్పగుడిని ఈ వీడియోలో చూడొచ్చు 
 
15, నవంబర్ 2018, గురువారం

హంసలదీవి.. కృష్ణవేణి పవిత్ర సాగర సంగమం

హంసలదీవి, కృష్ణా జిల్లా కోడూరు మండలంలోని ఒక గ్రామము.మహాబలేశ్వరంలోని  జన్మస్థానము నుండి మొదలైన కృష్ణానది సాగరుణ్ణి కలిసే పవిత్ర సాగర సంగమ ప్రదేశం హంసలదీవి. పాలకాయతిప్ప అనే ప్రదేశం దగ్గర కృష్ణానది సముద్రంలో కలుస్తుంది. ఒకవైపు గట్టుతో కృష్ణమ్మ,మరొకవైపు అనంతమైన బంగాళాఖాతం రెండిటినీ చూడొచ్చు.అందరి పాపాలను కడుగుతూ మలినమైన గంగానది కాకి రూపంలో వచ్చి ఇక్కడి పవిత్ర కృష్ణవేణి సాగర సంగమంలో స్నానం చేయగానే హంసగా మారిపోయింది కాబట్టి ఈ ప్రదేశానికి హంసలదీవి అనే పేరు వచ్చిందనేది స్థలపురాణం.

మేము ముందుగా రేపల్లె,తెనాలి వైపునుండి మోపిదేవి సుబ్రహ్మణ్యస్వామి గుడికి వెళ్లి అక్కడినుండి హంసలదీవి వెళ్ళాము.అగస్త్య మహాముని సుబ్రహ్మణ్యస్వామిని నాగరూపంలో గుర్తించి,ప్రతిష్టించిన సన్నిధానమే మోపిదేవి.సుబ్రహ్మణ్యస్వామి,ఈశ్వరుడు ఒకే రూపంగా కొలువై సుబ్రహ్మణ్యేశ్వరస్వామిగా దర్శనమిచ్చే ఈ క్షేత్రం చాలా మహిమ కలిగినది.

హంసలదీవి కృష్ణా జిల్లాలో విజయవాడకు 110 కి. మీ., అవనిగడ్డకు 25 కి.మీ. దూరంలో వుంది. విజయవాడ నుంచి పామర్రు, కూచివూడి, చల్లపల్లి, మోపిదేవి, అవనిగడ్డ, కోడూరు దివిసీమ గ్రామాల నుండి వెళ్లొచ్చు అలాగే గుంటూరు నుండి తెనాలి,రేపల్లె వైపు పెనుమూడి వారధి మీదగా వెళ్లొచ్చు.లంక గ్రామాల్లో పచ్చని వాతావరణంలో ప్రయాణం చాలా హాయిగా అనిపిస్తుంది.దారులు బాగానే ఉంటాయి కానీ ఇక్కడికి మన  వెహికల్తో వెళ్తే ఇబ్బంది లేకుండా అన్ని ప్రదేశాలు చూడొచ్చు.

ముందుగా బీచ్ దగ్గరికి వెళ్తాము.బీచ్ దగ్గరనుండి కృష్ణమ్మ సముద్రంలో కలిసే చోటికి మన వెహికల్స్ వెళ్ళటం కష్టం ఎందుకంటే వేగంగా వస్తున్న సముద్రం అలల పక్కనే కారు వెళ్ళాలి.కారు టైర్స్ కూడా లాగేసేంత ఉధృతంగా అలలు వస్తుంటాయి.అందుకే అక్కడ ఆటోలో ఉంటాయి వాళ్ళు  మనిషికి కొంత అమౌంట్ తీసుకుని,సాగరసంగమ ప్రదేశం దగ్గరికి తీసుకెళ్తారు.అక్కడ కృష్ణమ్మ విగ్రహం, పాదాలు ఉంటాయి.ఈ సాగరసంగమ పెద్దలకి పుణ్యస్నానాలకే కాదు పిల్లలు ఆడుకోవటానికి కూడా చాలా సరదాపడతారు.వెంటనే అక్కడినుండి రావాలనిపించదు.ఇక్కడి దగ్గరలో ఒక భవనం ఉంటుంది.దీనిపై నుండి చూస్తే సాగరసంగమ దృశ్యం  చాలా బాగా కనిపిస్తుంది.ఇక్కడికి చీకటి పడకముందే వెళ్తే బాగుంటుంది.ఎందుకంటే అక్కడినుండి వెంటనే రావాలనిపించదు మరి.అక్కడ షోడాలు,ఐస్ క్రీమ్ బండ్లు ఉంటాయి కానీ మనమే మంచి నీళ్ళు,తినటానికి కావాల్సినవి ఏమైనా తీసుకెళ్తే ఇబ్బంది లేకుండా ఉంటుంది.

ఇక్కడినుండి వేణుగోపాలస్వామి గుడికి వెళ్ళాము. వూర్వం దేవతలు  ఒక్క రాత్రిలోనే ఆలయాన్ని నిర్మించారట. కోడి కూసే సమయానికి రాజగోపురం సగమే పూర్తయింది. తెల్లవారి మనుషుల అలికిడి వినపడటంతో వారు గోపురాన్ని అసంపూర్తిగా వదిలేసి వెళ్ళిపోయారు.తర్వాత చోళ రాజుల కాలంలో ఆలయ పునరుధ్ధరణ జరిగింది.ప్రస్తుతం ఈ ఆలయం విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి ఆలయానికి దత్తత దేవాలయంగా గుర్తించబడింది.

ఇక్కడికి మేము రెండుసార్లు వెళ్ళాము.వెళ్ళినప్రతిసారి ప్రయాణం విసుగనిపించదు ,అక్కడ గడిపే సమయం కూడా విసుగనిపించదు.మా అందరికీ చాలా నచ్చిన ప్రదేశం హంసలదీవని ఈ వీడియోలో చూడొచ్చు

హంసలదీవి.. కృష్ణవేణీ సాగర సంగమం

10, నవంబర్ 2018, శనివారం

Pochampally Ikkath Sarees / పోచంపల్లి చీరలు @ భూదాన్ పోచంపల్లి

పోచంపల్లి చీరలు తెలంగాణ రాష్ట్రములోని యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన భూదాన్ పోచంపల్లి లో తయారవుతున్న ప్రసిద్ధ చీరలు.తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కి సుమారు  42 కిలోమీటర్ల దూరంలో ఉన్న పోచంపల్లి చేనేత వస్త్రాలు, భూదానోద్యమానికి ప్రసిద్ధి చెందింది.విజయవాడ హై వే NH65 మీద గుంటూరు నుండి హైదరాబాద్ వెళ్లే దారిలో కుడివైపు పెద్ద ఆర్చ్ కనపడుతుంది.ఆ ఆర్చ్ నుండి లోపలికి వెళ్ళగానే 12 kms చాలా చక్కని రోడ్,చుట్టూ పచ్చని చెట్లతో ప్రయాణం మనకి తెలియకుండానే పోచంపల్లి వచ్చేస్తాము.ఊరిలోకి వెళ్తుండగానే రోడ్డుకి రెండువైపులా చీరాల షాపులు కనపడుతుంటాయి.

అక్కడి చేనేత కార్మికులు నేసిన చీరలు అందరినీ మురిపిస్తాయి. ఇక ఆడవారినైతే అమితంగా ఆకర్షిస్తాయి. చేనేతల్లో మొదటగా పేటెంట్ హక్కు పొందడం ఓ ప్రత్యేకత. దేశ విదేశీ వనితల వరకూ అందరినీ ఆకట్టుకునే చేనేత ఉత్పత్తులు, చీరలతో ఖండాంతర ఖ్యాతిని పోచంపల్లి పొందింది. ఈ పనితనం "చీరాల" నుండి ఈ ప్రాంతానికి వచ్చింది.

చూడగానే ఇవి పోచంపల్లి  చేనేత చీరలు,వస్త్రాలు అని చెప్పగలిగేంత విభిన్నమైన డిజైన్స్ తో చాలా అందంగా హుందాగా అనిపిస్తాయి. పోచంపల్లి చీరలు కానీ డ్రెస్సులు కానీ ఏ సందర్భానికైనా తగినట్లు గా సెట్ అవ్వటం కూడా వీటి ప్రత్యేకత అనిపిస్తుంది.

పోచంపల్లి విశేషాలు ఈ వీడియోలో చూడొచ్చు..

Pochampally Ikkath Sarees 
పోచంపల్లి చీరలు @ భూదాన్ పోచంపల్లి

8, నవంబర్ 2018, గురువారం

A Day In Ramoji Film City - రామోజీ ఫిల్మ్ సిటీ - హైదరాబాద్ -

A Day In Ramoji Film City
రామోజీ ఫిల్మ్ సిటీ - హైదరాబాద్
A must visit Tourist Destination

5, నవంబర్ 2018, సోమవారం

Domino's Pizza @ My Guntur

Domino's Pizza @ My Guntur

4, నవంబర్ 2018, ఆదివారం

Flowers In Daily Life - Making Memories with Flowers

Flowers In Daily Life - Making Memories with Flowers 
పువ్వులంత అందమైన జ్ఞాపకాలు

30, అక్టోబర్ 2018, మంగళవారం

Indian clay art Terracotta Beautiful collection of handicrafts / టెర్రకోట కళాకృతులు

Indian clay art Terracotta Beautiful collection of handicrafts 
టెర్రకోట కళాకృతులు

బ్రైట్ కలర్స్ తో విభిన్నమైన డిజైన్స్ తో అందంగా ఆకట్టుకునే టెర్రకోట బొమ్మలు ఇష్టపడనివాళ్ళు  నచ్చనివాళ్ళు ఉండరేమో.. హైదరాబాద్  శిల్పారామం తర్వాత ఉప్పల్ రోడ్డులో టెర్రకోట బొమ్మలు ఎక్కువగా చూడొచ్చు.ఫుట్ పాత్ మీద వరసలుగా పెట్టిన ఆ బొమ్మలు ఎంతబాగున్నాయో అనిపించేలా ఉంటాయి.దేవతా మూర్తులు, పక్షులు, ఏనుగులు,గుర్రాలు,వివిధరకాల జంతువులూ, దీపాలు, ఫ్లవర్ వాజ్ లు , ఇంకా చాలా అలంకరణ వస్తువులు చెప్పలేనన్నని వెరైటీలతో పాటు మనం నిత్యం వాడుకునే వంట పాత్రలు,గిన్నెలు,కప్స్,డిన్నర్ సెట్స్ కూడా వీటిలో ఉంటాయి.

మేము హైదరాబాద్ వెళ్ళినప్పుడు దీపావళి ప్రమిదలు అక్కడైతే మంచి డిజైన్స్ వుంటాయని వెళ్ళాము..  నిజంగా చూడటానికి కూడా ఓపిక ఉండాలి అనిపించేన్ని దీపాలు,బొమ్మల వెరైటీస్ ఉన్నాయి. మేము వెళ్లేసరికి చీకటి పడింది అయినా చీకట్లోనే వీడియో తీసాను టెర్రకోట బొమ్మలని రాజస్థాన్,గుజరాత్,ఒరిస్సా నుండి తెచ్చి ఇక్కడ ఫుట్ పాత్ ల మీద అమ్ముతున్నామని,రేట్ చాలా తక్కువగా అడుగుతారని ఆ బొమ్మలు అమ్ముతున్న  సత్య,మహేందర్ మాట్లాడారు. ఇంకా దీపావళి సీజన్ మొదలవలేదని,దీపావళికి వాళ్ళ బిజినెస్ బాగుంటుందని చెప్పారు.

మేము కృష్ణుడి విగ్రహం,కొన్ని దీపాలు కొన్నాము. మాకు చాలా నచ్చాయి..
మరికొన్ని టెర్రకోట బొమ్మల విశేషాలు ఈ వీడియోలో చూడొచ్చు

టెర్రకోట కళాకృతులు

26, అక్టోబర్ 2018, శుక్రవారం

చుట్టుగుంట పోలేరమ్మ తల్లి దేవస్థానం - గుంటూరు - దసరా నవరాత్రుల విశేషాలు

కొలిచిన వారికి కొంగు బంగారంగా ఆదరించి,దీవించి,కాపాడి రక్షించే ఆ అమ్మలగన్న అమ్మ,పోలేరమ్మ తల్లిగా కొలువైన గుంటూరు చుట్టుగుంటలోని పోలేరమ్మతల్లి దేవస్థానంలో జరిగిన దసరా వేడుకలు,విశేషాలు నా చిన్నిప్రపంచంలో వీడియోగా ...

చుట్టుగుంట పోలేరమ్మ తల్లి దేవస్థానం - గుంటూరు

24, అక్టోబర్ 2018, బుధవారం

మా వినాయకచవితి పూజ సందడి - 2018

మా వినాయకచవితి పూజ సందడి - 2018

ఓం గం గణపతయే నమః

21, అక్టోబర్ 2018, ఆదివారం

Southern Sojourn - Highlights Of Guntur To kanyaKumari Road Trip

Southern Sojourn
Guntur To kanyaKumari Tour

13, ఆగస్టు 2018, సోమవారం

హాయి హాయిగా జాబిల్లి --- తెలుగు,హిందీ,తమిళ్,గుజరాతీ భాషల్లో

హాయి హాయిగా జాబిల్లి తొలిరేయి వెండి దారాలల్లి  వెలుగు నీడలు (1961) సినిమా కోసం "శ్రీ శ్రీ" గారు రచించిన ఈ పాట ఆనాటి ఆపాత మధురాల్లో ఒకటి.ఇదే ట్యూన్ తో ఈ పాట హిందీలో కూడా ఉంది "Naya Sansar (1959)" సినిమాలో "చందా లోరియా సునాయే" అనే జోలపాట.. చాలా బాగుంటుంది.నాకు ఈ హిందీ పాట వరకే తెలుసు.

బ్లాగర్  "నీహారిక" గారు ఇదే పాట తమిళ్,గుజరాతీలో కూడా ఉందని చెప్పారు.అన్ని పాటలు కలిపి ఒకేచోట ఉంచితే బాగుంటుందనే నీహారిక గారి ఆలోచన బాగుంది కదా అని అన్ని భాషల్లో పాటల్ని ఒకేచోట ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను.తెలుగు,తమిళ్ డబ్బింగ్ పాటలే కానీ ,గుజరాతీ, హిందీలో మాత్రం పూర్తి  వైవిధ్యంగా వున్నాయి. 
Thank You so Much నీహారిక గారు .. మంచి పాటని ఇన్ని భాషల్లో పరిచయం చేసినందుకు ..

హాయి హాయిగా జాబిల్లి --- తెలుగు,హిందీ,తమిళ్,గుజరాతీ భాషల్లో 

 హాయి హాయిగా జాబిల్లి తొలి రేయి వెండి దారాలల్లి 
మందు జల్లి నవ్వ సాగే ఎందుకో 
మత్తు మందు జల్లినవ్వసాగే ఎందుకో
వెలుగు నీడలు - 1961

Chanda loriya sunaye     
Hawa jhulna jhulaye     
Rani nindiya sulaye mere laal ko
Naya Sansar - 1959

Inba loga jothi roopam pole
Tamil Movie
 Thooya Ullam - 1961

Tari Aankh No Afini
Gujarati Album Song - Soli Kapadiya

15, జులై 2018, ఆదివారం

శ్రీశైలం జంగిల్ సఫారీ / Srisailam Wildlife Sanctuary Jungle Safari

2018 కొత్త సంవత్సరం ప్రారంభం కాగానే అంటే జనవరిలో మాకు శ్రీశైల మల్లన్న దర్శనం చేసుకునే అదృష్టం కలిగింది. ముందు రోజూ రాత్రే వెళ్లి అక్కడ వుండి, ఉదయాన్నే పూజలు,దర్శనాలు అయ్యాక ఖాళీ  టైమ్ ఉండటంతో మా తమ్ముడు జంగిల్ సఫారీ కొత్తగా పెట్టారు వెళదాం అనటంతో  సరేనని వెళ్ళాము. శ్రీశైలం నుండి సున్నిపెంట వెళ్లే దారిలో మెయిన్ రోడ్ కి పక్కనే చుట్టూ వెదురుపొదల మధ్యలో చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఉంది ఈ జంగిల్ సఫారీ.చుట్టూ కోతుల గుంపులు,ఎంట్రన్స్ లోనే పెద్దపులి బొమ్మలతో అడవిలోకి వచ్చేశామనే ఫీలింగ్ కలుగుతుంది.

 సఫారీ ఎంట్రన్స్ 

 చుట్టూ నిశ్శబ్దం,పక్షుల అరుపులు తప్ప ఇంకేమీ వినిపించవు.అక్కడ స్టాఫ్ రోజంతా ఆ నిశ్శబ్దంతోనే గడుపుతారు.. మనం ఒక్కరోజు వెళ్లి రావటానికి బాగానే ఉంటుంది కానీ రోజంతా అక్కడ ఉండటమంటే  గొప్పే అనిపించింది.స్టాఫ్ వెళ్లిన వాళ్లకి జీప్స్ అలాట్ చేయటం,ఏ టైమ్ కి ఎవరు వెళ్లారు లాంటి డిటైల్స్ నోట్ చేస్తుంటారు.ఇక్కడ గిరిజన ఉత్పత్తులు అమ్మే స్టాల్,అడవి జంతువుల విశేషాలతో ఒక మ్యూజియం కూడా వున్నాయి.

స్టాఫ్ తో మా అమ్మ

ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు జీపుల్లో అడవిలోకి తీసుకెళ్తారు.డ్రైవర్ తో పాటు,ఒక గైడ్ కూడా మనతో పాటు జీపులో వస్తారు.1 1/2 గంటన్నర సేపు అడవిలోకి తిప్పి బయటికి తీసుకు వస్తారు. పెద్దపులి కనిపిస్తుందేమో చూద్దాం అనుకున్నాం కానీ నిజంగా రాకూడదనే కోరుకున్నాం :). ఓపెన్ టాప్ జీప్ లో కూర్చుని చుట్టూ రకరకాల చెట్లు,గడ్డి పొదలు చూస్తూ వెళ్ళటం చాలా బాగుంది. రోడ్డు కూడా చాలా చిన్నగా, రాళ్లు,మట్టితో  ప్రమాదంగానే అనిపిస్తుంది.కోతులు,కొండముచ్చులు,కొన్ని రకాల చిన్న పక్షులు,ఒక జింక కనిపించాయి.ఎక్కడో జూలో కాకుండా వాటి ప్రపంచంలో  హాయిగా స్వేచ్ఛగా తిరుగున్న జంతువుల్ని  చూడటం చాలాబాగుంది.

సఫారీకి తీసుకెళ్లే జీప్,డ్రైవర్
అడవిలో దారి

అడవిలో అంతా  జంతువుల నీళ్ల కోసం సిమెంట్ తో సాసర్స్ లాగా కట్టారు.వేసవి కాలంలో వాటిలో నీళ్లు నింపుతారట.గంట అడవిలో ప్రయాణం తర్వాత ఒక చెరువు దగ్గరికి జీప్ తీసుకెళ్లి ఆపారు.అక్కడంతా బురద,జంతువుల పాదముద్రలు,విపరీతమైన నిశ్శబ్దం మధ్యలో పక్షుల అరుపులు చాలా వింతగా,కొంచెం భయంగా కూడా అనిపిస్తుంది.అక్కడ గైడ్ మాకు ఈ చెరువు దగ్గరికి పులి కూడా నీళ్లు తాగటానికి వస్తుంది అంటూ పులి పాదముద్రను కూడా చూపించాడు.కాసేపు అక్కడ ఉండి,తిరిగి జీప్ లో వేరే దారిలో బయటికి వచ్చేశాము. 

 జంతువులు నీళ్లు తాగే చెరువు 
 పులి పాదముద్ర 

ఎప్పుడూ శ్రీశైలం వెళ్తూ ఘాట్ రోడ్ లో అడవిని చూస్తూ బయటికే ఇలా వుంది ఇంకా లోపలి వెళ్తే ఎలా ఉంటుందో అనుకునే మా సరదా ఈ జంగిల్ సఫారీతో తీరిపోయింది.నిజంగా చాలా అద్భుతంగా,ఎప్పటికీ గుర్తుండేలా వుంది మా "జంగిల్ సఫారీ" అనుభవం

మరికొన్ని ఫోటోలు,విశేషాలు ఈ వీడియోలో చూడొచ్చు.

జంగిల్ సఫారీ

Related Posts Plugin for WordPress, Blogger...