పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

30, అక్టోబర్ 2018, మంగళవారం

Indian clay art Terracotta Beautiful collection of handicrafts / టెర్రకోట కళాకృతులు


Indian clay art Terracotta Beautiful collection of handicrafts 
టెర్రకోట కళాకృతులు

బ్రైట్ కలర్స్ తో విభిన్నమైన డిజైన్స్ తో అందంగా ఆకట్టుకునే టెర్రకోట బొమ్మలు ఇష్టపడనివాళ్ళు  నచ్చనివాళ్ళు ఉండరేమో.. హైదరాబాద్  శిల్పారామం తర్వాత ఉప్పల్ రోడ్డులో టెర్రకోట బొమ్మలు ఎక్కువగా చూడొచ్చు.ఫుట్ పాత్ మీద వరసలుగా పెట్టిన ఆ బొమ్మలు ఎంతబాగున్నాయో అనిపించేలా ఉంటాయి.దేవతా మూర్తులు, పక్షులు, ఏనుగులు,గుర్రాలు,వివిధరకాల జంతువులూ, దీపాలు, ఫ్లవర్ వాజ్ లు , ఇంకా చాలా అలంకరణ వస్తువులు చెప్పలేనన్నని వెరైటీలతో పాటు మనం నిత్యం వాడుకునే వంట పాత్రలు,గిన్నెలు,కప్స్,డిన్నర్ సెట్స్ కూడా వీటిలో ఉంటాయి.
మేము హైదరాబాద్ వెళ్ళినప్పుడు దీపావళి ప్రమిదలు అక్కడైతే మంచి డిజైన్స్ వుంటాయని వెళ్ళాము..  నిజంగా చూడటానికి కూడా ఓపిక ఉండాలి అనిపించేన్ని దీపాలు,బొమ్మల వెరైటీస్ ఉన్నాయి. మేము వెళ్లేసరికి చీకటి పడింది అయినా చీకట్లోనే వీడియో తీసాను టెర్రకోట బొమ్మలని రాజస్థాన్,గుజరాత్,ఒరిస్సా నుండి తెచ్చి ఇక్కడ ఫుట్ పాత్ ల మీద అమ్ముతున్నామని,రేట్ చాలా తక్కువగా అడుగుతారని ఆ బొమ్మలు అమ్ముతున్న  సత్య,మహేందర్ మాట్లాడారు. ఇంకా దీపావళి సీజన్ మొదలవలేదని,దీపావళికి వాళ్ళ బిజినెస్ బాగుంటుందని చెప్పారు.

మేము కృష్ణుడి విగ్రహం,కొన్ని దీపాలు కొన్నాము. మాకు చాలా నచ్చాయి..
మరికొన్ని టెర్రకోట బొమ్మల విశేషాలు ఈ వీడియోలో చూడొచ్చు


టెర్రకోట కళాకృతులు
2 వ్యాఖ్యలు:

Chandrika చెప్పారు...

ఆ ఉప్పల్ రోడ్డంతా ఇవే. చాలా బావుంటాయి. నేను ఈ మధ్య ఇండియా వచ్చినపుడు వీటిని చూసి ప్యాక్ చేయించుకుని తెచ్చాను. ఒక బొమ్మ విరిగింది కూడాను

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

"SaraChandrika Chandrika".. గారు Thank you so much అండీ..

నిజంగా ఉప్పల్ రోడ్ లో చాలా కలర్ ఫుల్ గా అందంగా, బాగుంటాయి కదా ఈ బొమ్మలు.. మా అమ్మ ఇంతకుముందు ఇక్కడే తెచ్చుకున్న పింగాణీ తులసికోట పాతగా అయ్యిందని, కొత్తదానికోసం వెళ్ళాము,అప్పుడే ఈ వీడియో తీశాను. పగలయితే వీడియో ఇంకా బాగా వచ్చేది అనిపించింది..
మీకు నచ్చినందుకు, మీ స్పందనకు ధన్యవాదాలు :)

Related Posts Plugin for WordPress, Blogger...