పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

24, మార్చి 2010, బుధవారం

శ్రీ సీతారాముల కళ్యాణము చూతమురారండి.


సీతారాముల కళ్యాణంచూతము రారండి శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి....
సిరికళ్యాణపు
బొట్టునుపెట్టి , మణిబాశికమును నుదుటను గట్టి
పారాణిని
పాదాలకు పెట్టి
పెళ్లి
కూతురై వెలసిన సీత .. కళ్యాణంచూతము రారండి
సంపగి
నూనెను కురులను దువ్వి ,ఓంపుగా కస్తూరి నామము గీసి చంపగా వాసి చుక్కను పెట్టి
పెండ్లి
కొడుకై వెలసిన రాముని .. కళ్యాణంచూతము రారండి
శ్రీ
సీతారాముల కళ్యాణం చూతము రారండి....

అందరి దేవుళ్ళకి కళ్యాణాలు జరుగుతాయి కానీ ప్రతి ఒక్కరు తమ ఇంట్లో పెళ్ళిలాగా సందడిగా చేసే పెళ్లి సీతారాముల పెళ్లి.
సీతారాముల కళ్యాణం ఒక సుందర,సుమధుర దృశ్య కావ్యం.

చిన్నప్పుడు ప్రతి వీధికి ఒకటి,రెండు పందిళ్ళు వేసి చిన్నచిన్న రాముడి గుడులు కట్టి పానకం,వడపప్పులు పంచేవారు.
వీధిలో వెళ్తుంటే పట్టుకుని మరీ ప్రసాదం పెట్టేవారు.
ప్రస్తుతం ఇలాంటివి అంతగా కనిపించటం లేదనుకుంటా..

సీతారాములు అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించాలని కోరుకుంటూ అందరికీ
శ్రీరామనవమి శుభాకాంక్షలు.
రామా! నీల మేఘ శ్యామా! నిను చూసి ప్రేమ అంకురించే పడతి సీతమ్మకు.
రామా
! ధనుజ విరామా!నిను కొల్వ సర్వ శుభములు కలిగే మా జన్మకు.

22, మార్చి 2010, సోమవారం

నవమినాటి వెన్నెల నేను



రెండు రోజుల క్రితం టి.వి.9 లో మంత్రనగరి అనే కార్యక్రమం ప్రసారం అయ్యింది.సినీ రంగానికి చెందిన పలువురు ప్రముఖులను,వారి జీవితవిశేషాలను పరిచయం చేసే ఈ కార్యక్రమం బాగుంది.మొన్న శనివారం దర్శకుడు.దాసరి నారాయణరావు గారి సినీ జీవిత విశేషాలను పరిచయం చేశారు. ఆయన సినిమాల్లో కొన్నిపాటలు నాకు కూడా చాలా ఇష్టం.

జయసుధ నటించిన శివరంజని సినిమాలోని నవమినాటి వెన్నెల నేను పాట చాలా బాగుంటుంది.ఆ పాట సున్నితమైన భావాలతో, అర్ధవంతంగా, వినడానికి హాయిగా వుంటుంది.నాకు ఇష్టమైన ఆడియోలకి మా చెల్లి రమ్య తో స్లైడ్ షో తో వీడియో మిక్సింగ్ చేయించటం నాకు హాబి.ఐతే మొదటిసారిగా నాకు చాలా ఇష్టమైన ఈ పాటకి నేనే వీడియో తయారు చేయాలని ఈ పాటని మా చెల్లి హెల్ప్ తో చేసాను.నాకు నచ్చింది.మరి మీకు...

రాజి.


16, మార్చి 2010, మంగళవారం

ఉగాది శుభాకాంక్షలు.

మావిచిగురు తిని మీకు శుభమని మేలుకోలిపెను గండు కోయిలా...
ఉగాది పచ్చడితో నూతన సంవత్సరాన్ని ఆహ్వానిద్దాం.



కొత్త సంవత్సరం అందరికీ సకల శుభాలను అందించాలని ఆశిద్దాం.

వికృతినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.
రాజి.

అమ్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు...


ఈ రోజు మా ఇంట్లో రెండు పండుగలు చేసుకుంటాము.అది ఒకటి ఉగాది,ఇంకొకటి మా అమ్మ పుట్టినరోజు...
మా అమ్మ ఉగాది రోజు పుట్టిందట అందుకనే అమ్మ పుట్టినరోజు ప్రతిసంవత్సరం ఉగాదిరోజునే జరుపుకుంటుంది.
అందుకే ఉగాది రోజు మాకు రెండు సందళ్ళు..ఈ రోజంతా సందడే సందడి...
ఈ సంవత్సరం మాఅమ్మకి అమ్మ నుండి అత్తగా హోదా పెరిగింది.
మా శ్రీవారు,మా మరదలు ఈ సంవత్సరం మా అమ్మ పుట్టినరోజు celebrations లో ముఖ్య అతిధులు..

మా అమ్మ నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో,సుఖ సంతోషాలతో మా అందరితో ఇలాగే ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటూ...














 మా చెల్లి రమ్య మాఅమ్మ పుట్టినరోజుకి బహుమతిగా
తను
సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాట

ఎవరు రాయగలరు అమ్మా అను మాట కన్నా కమ్మని కావ్యం
ఎవరు
పాడగలరు...అమ్మా అను రాగం కన్నా తీయని రాగం...




12, మార్చి 2010, శుక్రవారం

ఆ రోజుల్లో....



జ్ఞాపకాలే మైమరపు జ్ఞాపకాలే మేల్కొలుపు
జ్ఞాపకాలే నిట్టూర్పు జ్ఞాపకాలే ఓదార్పు
నా చూపుల దారులలో చిరుదివ్వెలు వెలిగేలా
నా ఊపిరి ఊయలలో చిరునవ్వులు చిలికేలా...



ప్రతి మనిషి జీవితం లో మరచిపోలేని జ్ఞాపకాలు ఎన్నో ఉంటాయి.
బాల్యం ఒక మధుర జ్ఞాపకం,ఎప్పటికి మరచిపోలేనిది మరలిరానిది బాల్యం.

పక్కింట్లో అక్క,తమ్ముడు ఆడుకుంటుంటే వెంటనే నేను,నా తమ్ముడు ఆడుకుంటూ అంతలోనే గొడవపడుతూ మళ్లీ మాట్లాడుకోకుండా ఉండలేని జ్ఞాపకం కళ్ళముందు కదులుతుంది.

స్కూల్ కి వెళ్ళే పిల్లల్ని చూస్తే నా స్కూల్ రోజులు జ్ఞాపకానికి వస్తాయి.

ఇలా ప్రతి క్షణం మనల్ని వెన్నంటి వుండే చిన్ననాటి జ్ఞాపకాలు మన బాల్యం అనే పూతోటలో మనతో పాటు పెరిగిన మొక్కలు అనిపిస్తుంది.

కొన్ని విషయాలు,వస్తువులు,ప్రదేశాలు చూడగానే మన మనస్సు వెంటనే నా చిన్నప్పుడు అంటూ ఆ రోజుల్లోకి వెళ్ళిపోతుంది.

అలాంటివి ఎన్నాళ్ళైనా మనసులో నుండి చెరిగిపోని కొన్ని జ్ఞాపకాల పరంపర ఇది.మీకు కూడా అలా ఏమైనా గుర్తుకు వస్తాయేమో చూడండి.

మేము చిన్నప్పుడు చాలా ఇష్టంగా తినే న్యుట్రిన్ చాక్లెట్స్ ,కాడ్బరిస్ జెమ్స్

స్కూల్ కి వెళ్లేముందు హార్లిక్స్,ఇంటికి వచ్చిన తర్వాత జింగ్ థింగ్ గోల్డ్ స్పాట్.


అందరికీ తెలిసిన పాపులర్ నటరాజ్ జామెంట్రీ బాక్స్, నటరాజ్ పెన్సిల్స్
రోజుల్లో పెన్ వాడటం చాలా గొప్ప. హీరో పెన్స్ ,రేనాల్డ్స్ పెన్స్

ఎక్కువ వాడకపోయినా ఇంట్లో ఉంచుకునే బ్రిల్ ఇంక్, కామెల్ గమ్మ్
నాన్న నాకు తెచ్చిన సైకిల్,బడి మొదలవగానే నాన్నతో షాపింగ్ కి వెళ్లి తెచ్చుకునే స్కూల్ షూస్
ఆదివారం వస్తే టీవీ ముందునుండి కదలకుండా చూసే మహాభారతం,రామాయణం.

మాల్గుడి డేస్,జంగిల్ బుక్.



ఆడియో,విడియో కాసెట్ లు.ఇప్పటికీ ఇంట్లో దాచింది అమ్మ.


అమ్మ మా చిన్నప్పటి ఫోటోలు తీసిన రీల్ కెమెరా,నాకు తమ్ముడి గిఫ్ట్ వాక్ మాన్

రోజుల్లో ముఖ్యమైన కమ్యూనికేషన్ సాధనాలు.











ఆ రోజుల్లో ఇంకేమి ప్రోగ్రామ్స్ లేక దూరదర్శన్ లో వచ్చే అన్ని హిందీ ప్రోగ్రామ్స్ చూసేవాళ్ళం.ఆ విధంగా మాకు హిందీ బాగా రావటానికి ఉపయోగపడిన దూరదర్శన్ ప్రోగ్రామ్స్ అంటే నాకు చాలా అభిమానం.




రాజి.

10, మార్చి 2010, బుధవారం

మహిళా మనోరధం.


అలుపన్నది ఉందా ఎగిరే అలకు ఎదలోని లయకు
అదుపన్నది ఉందా కలిగే కలకు కరిగే వరకు
మెలికలు
తిరిగే నది నడకలకు
మరి
మరి ఉరికే మది తలపులకు

నా
కోసమే చినుకై కరిగి ఆకాశమే దిగదా ఇలకు
నా
సేవకే సిరులే చిలికి దాసోహమే అనదా వెలుగు
ఆరారు
కాలాల అందాలు బహుమతి కావా నా ఊహలకు
కళలను
తేవా నా కన్నులకు

మహిళ తలచుకుంటే సాధించలేనిది ఏది లేదని మరోసారి రుజువు చేసుకుంది.

ఆత్మవిశ్వాసంతో గత పద్నాలుగు సంవత్సరాలుగా ప్రయత్నించి ఈనాటికి తమ ప్రయత్నం లో విజయం సాధించిన మహిళ ప్రయత్నం ప్రశంశనీయం.

భారతదేశ భవిష్యత్తును ప్రభావితం చేసే మహిళా రిజర్వేషన్ బిల్లును ఎగువసభ ఆమోదించింది.దిగువ సభ ఆమోదం ఇంకా లభించాల్సి వుంది.

నూట ఎనిమిదవ రాజ్యాంగ సవరణ ద్వారా లోక్ సభ,రాష్త్ర అసెంబ్లీ లో మహిళలకు మూడోవంతు స్థానాలను కేటాయిస్తూ చట్టం అమల్లోకి రాబోతుంది.

చట్ట సభల్లో మహిళల ప్రాతినిధ్యం పెంచిన ఈ చట్టం సామాజిక మార్పునకు ఎంతగానో దోహదం చేస్తుంది.

రాజకీయ నాయకుల బంధువులు,వారి అండ వున్నవారికి,
డబ్బున్న వారికే ఈ చట్టం వలన లాభం ఎక్కువ అన్న అభిప్రాయం కొందరిలో వున్నప్పటికీ,

ఇప్పటికే చాలామంది మహిళలు రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పొషిస్తున్నారు కాబట్టి
ఈ మహిళా బిల్లు మహిళలకి మరిన్ని ఎక్కువ అవకాశాలను కల్పిస్తుందని,
తమ తోటి మహిళల సమస్యలను పరిష్కరించగలిగే ఒక ఆయుధంగా మారుతుందని ఆశిద్దాం.
ఫోటో .....ఈనాడుదినపత్రిక నుండి
రాజి

8, మార్చి 2010, సోమవారం

అమ్మ


యత్ర నార్యస్తు పూజ్యంతే, రమంతే తత్ర దేవత
ఎక్కడైతే స్త్ర్రీ పూజించబడుతుందో అక్కడ దేవతలు కొలువుంటారు.

కల
తానై అలరించేది మగువ
తనువు
తానై మురిపించేది మగువ
ఉలి
తానై మనిషినే మలిచేది మగువ
నింగినైనా
నేలనైన అముల్యమైనదీ మగువ
వెల
లేని నిధియే మగువ.

ప్రతి పురుషుడి విజయం వెనక ఒక స్త్రీ ఉంటుందంటారు కాని కేవలం ఒక్క పురుషుడి వెనక మాత్రమే కాదు ప్రతిమనిషి విజయం,వ్యక్తిత్వం వెనక ఒక స్త్రీ తప్పకుండా వుంటుంది.
ఆమె తల్లి ,భార్య ,అక్క,చెల్లి ,స్నేహితురాలు ఎవరైనా కావచ్చు.

ఈ లోకం లో ప్రతి మహిళా ఆదర్శ మరియు పరిపూర్ణ మహిళే అని నా అభిప్రాయం.

నా మొదటి ఆదర్శ మహిళ మా అమ్మఎవరికైనా మొదటి గురువు అమ్మే అని నా అబిప్రాయం.

కుటుంబంలో అందరితో కలిసిపోయి అందరి బరువు,భాధ్యతలను సంతోషంగా స్వీకరించే అమ్మ,

ఇంట్లో ఎవరినీ బాధించకుండా సామరస్యంగా సమస్యలను పరిష్కరించగలిగే అమ్మ తెలివి అభినందనీయం.

నేను ఎప్పుడైనా చలి ఎక్కువగా ఉందమ్మా అంటే చాలు నువ్వు డిసెంబర్ లో పుట్టావు అందుకే నీకు చలి ఎక్కువ,అప్పట్లో నిన్ను చలి నుంచి కాపాడటానికి ఎంత కష్టపడ్డానో తెలుసా అంటూ ఆనందంగా చెప్పే అమ్మని చూస్తే చిన్నతనం ఇంకా నా కళ్ళ ముందు ఉన్నట్లే వుంటుంది.

చిన్నప్పుడు నువ్వు సన్నగా వుండేదానివి అందుకే నిన్నుఎత్తుకుని తమ్ముడిని నడిపించేదాన్ని
అని అమ్మ చెప్తే ఆనందంగా అనిపిస్తుంది..

అమ్మ నన్ను రెడీ చేసే విధానం,నా డ్రెస్సింగ్ స్టైల్ చూసి నన్ను అనుకరించాలని చూసే
మా బంధువుల పిల్లల్ని,నా స్నేహితులని చూసి నా గొప్పతనానికి గర్వపడేదాన్ని.

చదువు విషయం లో కూడా మా బంధువులు నా కంటే చిన్నపిల్లలకి అక్క చూడు ఎలా చదువుతుందో అలా చదవాలి అని వాళ్ళ పిల్లల్ని ప్రోత్సహించే విధంగా అమ్మ నన్ను చదివించింది.

నా బి.ఎ అయిపొగానే అందరూ ఆడపిల్ల కదా బి.ఎడ్ చదివించమని సలహా ఇచ్చారు కాని అమ్మ నన్ను ''లా'' చదివిస్తానని పట్టుపట్టింది.నేను లా చదివి జడ్జ్ కావాలన్నది అమ్మ కోరిక.

నన్ను లా లో జాయిన్ చేయడానికి అమ్మ, చేసిన ప్రయత్నం నేను ఎప్పటికి మరిచిపోలేను.
లాసెట్ లొ నాకు మంచి రాంక్ తో విజయవాడ సిద్ధర్థా లా కాలేజ్ లొ సీట్ వచ్చింది.

నేను చదువుకునే రోజుల్లో అమ్మ నాకు వారానికి ఒక వుత్తరం రాసేది.నన్ను బాగా చదవమని,
భయపడొద్దని నేను చదవాల్సిన అవసరాన్ని నాకు గుర్తు చెసేది.

అమ్మ నన్ను కోరిన కోరిక నేను బాగా చదివి మంచి పేరు తెచ్చుకోవాలని, నేను జడ్జ్ కావాలన్నది.

అమ్మ కోరికలో బాగా చదవాలనే మొదటి కోరిక తీర్చగాలిగాను లా మూడు సంవత్సరాలు అమ్మాయిలలో నేనే మంచి మార్కులు తెచ్చుకుని బెస్ట్ అవుట్ గోయింగ్ ఫిమేల్ స్టూడెంట్ గా గోల్డ్ మెడల్ సాధించటం నా జీవితం లొ మరచిపోలేని మధురానుభూతి.

గోల్ద్ మెడల్ తీసుకునే రోజు నా కుటుంబం,నా స్నేహితులు అందరు నాతో వున్నారు.
నా వాళ్ల ముందు నాకు దక్కిన ఈ అరుదైన గౌరవానికి స్ఫూర్తి మా అమ్మ.

నేను జడ్జ్ కావాలన్న అమ్మ కోరిక ఇంకా తీర్చలేకపోయాను.
కానీ అవకాశం వున్నంత వరకు అమ్మ కోరిక తీర్చడానికి ప్రయత్నిస్తాను.

ఇలా పిల్లల్ని వ్యక్తిత్వంతో,ధైర్యంగా ఎలాంటి సమస్యలనైనా ఎదుర్కొని విజయం సాధించగల విజేతలుగా నిలపగలఅమ్మ కంటే రోల్ మోడల్ ఇంకెవరైనా ఉంటారా?
అందుకే అమ్మకి జే జే.

ఒక్క మా అమ్మకే కాదు అమ్మలందరికీ,మహిళామణులకి
మహిళాదినోత్సవ శుభాకాంక్షలు.


4, మార్చి 2010, గురువారం

లీడర్



ఈ మధ్య వచ్చిన సినిమాల్లో నాకు నచ్చిన సినిమా లీడర్.శేఖర్ కమ్ముల తన అన్ని సినిమాల్లాగానే గొడవలు,అల్లర్లు లేకుండా తనదైన శైలిలో ప్రెజెంట్ చేసిన సినిమా లీడర్.రాజకీయాలు ఒక వర్గానికి మాత్రమే సంబంధించినవిగా,ఒక వృత్తిగాడబ్బు సంపాదించే వ్యాపారంగా, కొనడం,అమ్ముడుపోవడమే రాజకీయాలుగా
మారిన ఈ రోజుల్లో ప్రస్తుత రాజకీయాలను మార్చి ప్రజల్లో బ్రతకడానికి ఆశని కల్పించమన్న తల్లి కోరిక మేరకు
అవినీతిని,కులవ్యవస్థను అంతం చేయాలన్న సంకల్పంతో అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించి
ముఖ్యమంత్రి అవుతాడు అర్జున్ ప్రసాద్.

వ్యవస్థను మార్చాలన్నఅతని సంకల్పానికి ఎన్నో అడ్డంకులు ఎదురవుతాయి.ఎ సి బి దాడులనుండి ప్రజాప్రతినిధులను తప్పించటం,పోలీసు అకాడమి కోసం హోంమినిస్టర్ లంచం డిమాండ్ చేయటం,
ఒక ఆడపిల్లను చంపిన ఎం ఎల్ ఎ కొడుకుకి శిక్ష పడకుండా చేయటం ఈ పరిస్థితుల్లో ఉన్నతమైన వ్యక్తిత్వం
వున్న అర్జున్ ప్రసాద్ నిస్సహాయ స్థితిలో తప్పు చేయవలసి వచ్చినప్పుడు అనుభవించే మానసిక వేదన ఆత్మవిమర్శ చేసుకునే ప్రతి వ్యక్తికీ ఏదో ఒక సమయంలో ఎదురైవుంటుంది.

ప్రస్తుత రాజకీయాల్లో బంధుత్వాలని స్వార్ధం కోసం ఎలా వాడుకుంటున్నారొ అర్చన [టీవీ ఛానల్ ఓనర్]తో
ప్రేమ విషయంలో తెలుస్తుంది.హీరో రానా డీసెంట్ గా,మంచి వ్యక్తిగా,సమాజంలో మార్పు తేవాలని ఆరాటపడే యువనాయకుడిగా అర్జున్ ప్రసాద్ పాత్రకు సరిగ్గా సరిపోయాడు.తన కొడుకుని రాజకీయనాయకుడిగా కాకుండా నాయకుడిగా, సమాజానికి ఉపయోగపడే వ్యక్తిగా తయారు చేయాలన్నసంకల్పం వున్న తల్లిగా సుహాసిని చేసిన సౌమ్యమైన తల్లి పాత్ర ప్రతి అమ్మ తమ పిల్లల పెంపకం గురించి ఆలోచించేలా చేసింది.

హీరోయిన్ లు ఇద్దరు చాల సింపుల్ గా ,స్నేహితుడిని అర్ధం చేసుకుని తోడుండే మంచి మనసున్న వ్యక్తులుగా బాగా నటించారు.

మనవరాలితో కలిసి సి.ఎం తో మాట్లాడటానికి వచ్చిన ముసలివాడు మేము బస్ లోనే వెళతాం బాబు అక్కడైతే జనాలు వుంటారు అనే సన్నివేశం చాలా బాధ కలిగిస్తుంది.

శిక్ష తప్పించుకున్నాను అన్న ఆనందంతో సి.ఎం కు బొకే ఇవ్వడానికి వచ్చిన వెధవని చాచి కొట్టే సన్నివేశం
మంచి పని చేసాడు అన్న ఆనందం కల్గించింది.

ప్రజలు డబ్బు కోసం ఆశపడకుండా మంచి నాయకుడిని ఎన్నుకోవాల్సిన సామాజిక బాధ్యతను ఈ చిత్రం గుర్తు చేసింది.

ఇప్పుడిప్పుడే సమాజం గురించి ఆలోచిస్తూ ఇంకా అన్యాయం,అక్రమాలకి అలవాటుపడని వ్యక్తులు,
ఇప్పటిదాకా కొన్ని తప్పులు చేసినా ఇంకముందు సమాజ శ్రేయస్సు కొరుకునే వ్యక్తులు తప్పకుండా
చూడాల్సిన సినిమా లీడర్

వందేమాతరం,మా తెలుగు తల్లికి మల్లెపూదండ పాటలు చాలా బాగున్నాయి.

వందేమాతరం .. వందేమాతరం



రాజి
Related Posts Plugin for WordPress, Blogger...