పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

3, మే 2010, సోమవారం

ఒక చిన్ని నవ్వు..

రోజు నవ్వుల దినోత్సవం.

అపరిచితులనైనా స్నేహితుల్ని చేసేది చిరునవ్వు.
మన మనసులోని ఆనందాన్ని,సంతోషాన్ని వ్యక్తం చేసే భావమే చిరు నవ్వు.

ఒక చిన్ని నవ్వే నవ్వి యుద్ధాలెన్నో ఆపొచ్చు
ఒక చిన్ని నవ్వే నవ్వి బంధాలెన్నో కలపొచ్చు
చిరునవ్వుల దీపం వెలిగించు బాధల చీకటి తొలగించు
చిరునవ్వుల బాణం సంధించు శత్రువులే వుండరు గమనించు

మనిషన్నోడే మనసారా తానే నవ్వొచ్చు
మనసున్నోడే తన వారిని కూడా నవ్వించు
పైనున్నోడే నీ నవ్వులు చూసి దిగివచ్చు
నీతో పాటే తన కష్టం మరవచ్చు

ఒక చిన్ని నవ్వే నవ్వి యుద్ధాలెన్నో ఆపొచ్చు
ఒక చిన్ని నవ్వే నవ్వి బంధాలెన్నో కలపొచ్చు

నీ గుండెల్లోనా గాయలెన్నున్నా పెదవుల్లో నవ్వే వాటికి మందు
నీ కన్నులలోనా కన్నీరెంతున్న ఆధారాల నవ్వే వాటికి హద్దు

త్వరగా
నిను చూసి నవ్విన వారే నివ్వెర పోయేట్టు

సరిగా నీ నవ్వుని నిచ్చెన చేసి ఎక్కర పై మెట్టు

నీ
కోపం నువ్వే కరిగించు నీ రూపం నువ్వే వెలిగించు

పాఠం నువ్వే పాటించు పదిమందికి నువ్వే చాటించు

ఒక చిన్ని నవ్వే నవ్వి యుద్ధాలెన్నో ఆపొచ్చు
ఒక చిన్ని నవ్వే నవ్వి బంధాలెన్నో కలపొచ్చు

ఏడ్చే వాళ్ళుంటే ఇంకా ఏడ్పించి కసితీరా నవ్వేస్తుందీ లోకం
నవ్వే వాళ్ళుంటే నవ్వులు నటియించి కడుపార నవ్వేస్తుందీ కాలం

కనుకే
లోకాన్నే ఎదిరించేటి మార్గం కనిపెట్టు

కదిలే కాలాన్నే ఎదురీదేటి ధైర్యం చూపెట్టు

జీవిత సత్యం గుర్తించు.. ఆనందం నువ్వై జీవించు

నీ చలనం నువ్వే గమనించు ..సంచలనం నువ్వే సృష్టించు

ఒక చిన్ని నవ్వే నవ్వి యుద్ధాలెన్నో ఆపొచ్చు
ఒక చిన్ని నవ్వే నవ్వి బంధాలెన్నో కలపొచ్చు

ప్రతి ఒక్కరూ 'నవ్వుతూ బతకాలి.నవ్వులు పంచాలి' .
అందరికీ నవ్వుల దినోత్సవ శుభాకాంక్షలు.

Related Posts Plugin for WordPress, Blogger...