మూడు కాలాల్లోను నేను ఇష్టపడే కాలం వర్షాకాలం .
వర్షం ఎప్పుడు పడినా ఒక అధ్బుతమే.
హోరున వర్షం, చల్లగాలి చక్కిలిగింతలు మనసుకు ఎంతో హాయిని కలిగిస్తాయి.
చిన్నప్పుడు వాన పడుతుంటే తుంపరలలో తడవటం,
కాగితపు పడవలు నీళ్ళలో వదులుతూ పోటీ పడటం ఒక ఆట.
అమ్మ కోప్పడితే అయిష్టంగా లోపలికి వచ్చినా మా చూపులన్నీ బయట వర్షం మీదే...
వర్షం పడినప్పుడు స్కూల్ మానేయడం కూడా ఒక సరదా మాకు అప్పట్లో.
నిన్న సాయంత్రం టీ తాగుతూ బాల్కనీలో కూర్చున్నాము ...
ఆకాశంలో ఒక్కసారిగా మేఘాల మెరుపులు, ఉరుముల విన్యాసాలతో వర్షం మొదలైంది.
చల్లగాలితో వర్షం తుంపరలు,ఆకాశం అంతా పరచుకున్న ఇంద్రధనస్సుతో
మా ఇంటి దగ్గర వర్షం ప్రకృతిని ఎంతో రమణీయంగా మార్చేసింది.
ఆకాశం నేలకు వచ్చిందీ
చిరుజల్లుగా మారి నాతోటి చిందులు వేసిందీ..
వచ్చే వచ్చే నల్లమబ్బుల్లారా
ఆకాశం నేలకు వచ్చింది.
ఇంద్రధనస్సులో ఎన్ని రంగులో
బ్రహ్మ సృష్టిలో ఎన్ని వింతలో
బ్రహ్మ సృష్టిలో ఎన్ని వింతలో
4 కామెంట్‌లు:
mee images vaaTiki taggaTu gaamee visleashaNa chala baagunnayi anDi.
hanu garu thanks andee..
ఫోటోలు కాపీ చేస్తరనా ప్రతి ఫోటో కి చిన్ని ప్రపంచం అని ట్యాగ్ పెట్టేరు.
మే బ్లాగ్ చాల బాగుంది.
kodakanti.suri గారూ కొన్ని సార్లు అలాగ జరిగింది,అందుకే అలా చేసాను.
అంటే నా ఫోటోల కంటే మంచి ఫోటొస్ చాలా వుంటాయి కానీ నా ఫోటొస్ నాకు గొప్పే కదా..
నా బ్లాగ్ నచ్చినందుకు థాంక్సండీ...
కామెంట్‌ను పోస్ట్ చేయండి