
దేవుడు ప్రతిచోటా వుండలేక అమ్మని స్రుష్టించాడు.
అలాగే అమ్మ తర్వాత దేవుడు స్రుష్టించిన అపురూపబంధంఅన్నా,చెల్లెళ్ళు,అక్కా,తమ్ముళ్ళు.
నా విషయంలో నా తమ్ముడు నాకు దేవుడు ఇచ్చిన వరం,నా అద్రుష్టం.
ఇది నేను అనుకునేది మాత్రమే కాదు.
నా గురించి తెలిసిన వాళ్ళందరూ నాతో అనే మాట.
చిన్నప్పటినుండి నాతో అనుబంధాన్ని అనురాగాన్ని పంచుకున్న నా తమ్ముడే నాకు అన్నయ్య కూడా.
చిన్నప్పటినుండి ఇప్పటిదాకా మా మధ్య వున్న ప్రేమాభిమానాలు ఎప్పటికీ ఇలాగే వుండాలని,
మా మనసుల మధ్య ఎప్పటికీ దూరం అనే మాట రాకూడదని,
భగవంతుడు నా తమ్ముడిని ఆయురారోగ్య,అష్టైశ్వర్యాలతో,
కీర్తి ప్రతిష్టతలతో,ఎల్లప్పుడూ కాపాడాలని ప్రార్ధిస్తూ ...
రక్షాబంధన్ శుభాకాంక్షలు.

ఒక కొమ్మకి పూచిన పువ్వులం అనురాగం మనదేలే..

ఒక గూటిన వెలిగే దివ్వెలం మమకారం మనదేలే..






6 కామెంట్లు:
చిత్రాలు బాగున్నాయండి .
మీకు రక్షాబంధన్ శుభాకాంక్షలు .
మాలాకుమార్ గారూ థాంక్సండీ.
మీకు కూడా లేట్ గా రక్షాబంధన్ శుభాకాంక్షలు .
రాజి గారూ...,వినాయకచతుర్థి శుభాకాంక్షలు
హారం
భాస్కర్ రామిరెడ్డి గారూ ధన్యవాదాలండీ..
మీకు కూడా వినాయకచతుర్థి శుభాకాంక్షలు
ఈ పోష్ట్ చూసినప్పుడు(చదివినప్పుడు) నా మనస్సు
ఎంతో బరువెక్కింది(కనులలో నీరు పెల్లుబుక్కినాయి)
నా కారణాలు నాకున్నాయి. ఫోటోలు ఎక్కడ సేకరించినారో గాని చాలా బాగున్నాయి.
మీకు శుభాకాంక్షలు.
విజయ్ గారూ ధన్యవాదాలండీ
అనుబంధాల విలువ తెలిసిన ప్రతి ఒక్కరికీ మీలాంటి ఫీలింగ్స్ వుంటాయేమో...
ఈ ఫోటోలు నెట్ లో సేకరించానండీ
ఇవి చూడగానే నాకు అనిపించింది అన్నా చెల్లెళ్ళు, అక్కా తమ్ముళ్ళ బంధానికి సరైన అర్ధాన్ని తెలియచేసేలా వున్నాయని...
కామెంట్‌ను పోస్ట్ చేయండి