పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

26, డిసెంబర్ 2010, ఆదివారం

Last sunday of 2010


Today is the last Sunday of 2010.

Goodnight to the Last Sunday
Of The last Week

Of The last Month
Of This Year 2010.

25, డిసెంబర్ 2010, శనివారం

క్రిస్మస్ శుభాకాంక్షలు...


క్రిస్మస్ అనగానే నాకు గుర్తొచ్చేది నా స్కూల్ డేస్.చిన్నప్పటినుండి నేను,తమ్ముడు, చెల్లి అందరం చదువుకుంది st'anns school కావటంతో ప్రతి సంవత్సరం క్రిస్మస్ మేము కూడా school లో సెలెబ్రేట్ చేసుకునేవాళ్లము.
క్రిస్మస్ కి 10 రోజులకి ముందే Half-yearly ఎగ్జామ్స్ అయిపోగానే మా school లో క్రిస్మస్ సెలెబ్రేట్ చేసి,
పిల్లలతో క్రిస్మస్ నాటకాలు వేయించి,అప్పటి నుండి jan 1 వరకు సెలవులు ఇచ్చేవాళ్ళు.
మాకు సంవత్సరం లో ఎక్కువ సెలవలు వచ్చే పండగ క్రిస్మస్ కాబట్టి ఈ పండుగ కోసం వెయిట్ చేసేవాళ్ళం అప్పట్లో.

స్కూల్లో క్రీస్తుజననం సెట్టింగ్ నాకు చాలా నచ్చేది.చిన్న పాక,పాకలో చిన్ని,చిన్ని దేవదూతలు,క్రీస్తు,మరియమ్మ బొమ్మలతో ఆ సెట్టింగ్ అంతా చూడ ముచ్చటగా వుండేది.
మిలమిల మెరిసే స్టార్స్ తో,గ్రీటింగ్ కార్డ్స్ తో క్రిస్మస్ ornaments తో అందమైన క్రిస్మస్ tree ఈ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా వుండేది.





ఈ పండగ జరుపుకునే అందరికీ 
క్రిస్మస్ శుభాకాంక్షలు...





20, డిసెంబర్ 2010, సోమవారం

ధనుర్మాసం.


ధనుర్మాసం మొదలయ్యింది.విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైనది ధనుర్మాసం.
ఈధనుర్మాసం నెలరోజులు వెంకటేశ్వరస్వామికి సేవలో గోదాదేవి పాడిన 30 పాశురాలను పాడతారు
విష్ణు పూజకి ప్రాధాన్యమైన ఈ నెలలో పూజలకే కాకుండా ఎన్నో సరదాలు,సందళ్ళు కూడా వుంటాయి.




ధనుర్మాసం మొదలవగానే ప్రతి ఇంటి ముందు రంగురంగుల రంగవల్లులు కనిపిస్తాయి.
తూర్పు తెలవారకముందే ఎంతో శ్రమతో ఇంతులు తీర్చిదిద్దిన రంగవల్లులు స్వాగతం పలుకుతాయి.
ఎంత చదువుకున్నా,కాలం మారినా మన రంగవల్లుల సంప్రదాయాన్నిమాత్రం మర్చిపోలేము.
ధనుర్మాసం మొదలవగానే ఇంటి ముందు మంచి ముగ్గు వేయాలన్న కోరిక ప్రతి అమ్మాయికి కలుగుతుందేమో...

dec 16 నుండి సంక్రాంతి పండగ దాకా ముగ్గులు వేయటం ఆనవాయితీ దీన్నే నెలపట్టడం అంటారు.
నాకు కూడా ఈ నెలరోజులు ఇంటి ముందు ముగ్గు వేయటం చాలా సరదా..చిన్నప్పటినుండి అమ్మ,పెద్దమ్మలు వేసే ముగ్గులు పుస్తకంలో వేసుకున్నవాటితో పాటూ,కొన్ని సంవత్సరాలుగా పేపర్ లొ వచ్చే ముగ్గుల్ని కూడా దాచిపెట్టటం అలవాటయ్యింది.. అలా నా ముగ్గుల పుస్తకం నాకు ఇష్టమైనవాటిల్లో ఒకటి.





ఈ నెలలో మాత్రమే కనిపించే మరొకరు హరిదాసు.ప్రతి ఇంటికీ హరిదాసు జరీ పట్టుపంచెతో, తలపాగా చుట్టి, మెడలోబంతి పూల హారంతో , పట్టు వుత్తరీయముతో ,నుదుట హరి నామంతో,తుంబుర ఒక చేత్తో చిడతలుమరో చేత్తో పట్టుకుని తుంబుర మీటుతూ,పసుపు కుంకుమలతో,పూలతోనూ అలంకరించి గుమ్మడికాయ ఆకారంలో వుండే ఇత్తడి లేదా రాగి పాత్రను తలపై పెట్టుకుని హరినామస్మరణ చేస్తూ వచ్చే హరిదాసుకి భిక్ష వేయడానికిచిన్నప్పుడు పిల్లలమంతా పోటీ పడే వాళ్లము.
కృష్ణార్పణం అంటూ భిక్ష స్వీకరించే హరిదాసు ఆగమనం ధనుర్మాసంలో మొదలై సంక్రాంతితో ముగుస్తుంది.




గంగిరెద్దులు ధనుర్మాసంలో మరో ముఖమైన అతిథులు.రంగురంగుల బట్టలతో అలకరంచిన గంగిరెద్దులను ఆడిస్తూ,సన్నాయి ఊదుతూ ఇంటి ముందుకు వచ్చే గంగిరెద్దుల వాళ్ళని చూడటం చాలా సరదాగా వుండేది.
ఇంటి వాళ్ళు ఇచ్చే పాత బట్టలు,బియ్యం తీసుకుని అమ్మగారికి దండం పెట్టు,అయ్యగారికి దండం పెట్టు అంటూ దీవించి వెళ్తారు.


ధనుర్మాసం తీసుకువచ్చే సంబరాలలో ఇవి కొన్నిమాత్రమే ఇంకా చెప్పుకోవాల్సినవి చాలానే వున్నాయి.
ప్రస్తుతానికి ముగ్గులతో బిజీ,ముగ్గులు నేర్చుకోవటం,అందరికన్నామంచి ముగ్గు వేయాలని పోటీపడటం,
ఈ సందడి అంతా ఈ ఒక్క నెలలోనే కదా.


17, డిసెంబర్ 2010, శుక్రవారం

God's Help...

జీవితంలో అప్పుడప్పుడు మన తప్పు ఏమీ లేకపోయినా ఎన్నో మాటలు పడాల్సిరావచ్చు,
కొన్ని ఎదురుదెబ్బలు తగలవచ్చు...
ఆ పరిస్థితుల్లో ప్రతి మనిషీ దేవుడా నేను నిన్ను పూజిస్తాను,నిన్నే నమ్ముకున్నాను
కానీ ఎందుకు నన్నిలా చేస్తున్నావు అని బాధపడతారు.
నేను కూడా ఒక్కోసారి అంతే అనుకుంటాను... కానీ దేవుడు మన వెన్నంటే వుండి మనకి తగలాల్సిన
ఎంతో పెద్ద రాళ్ళని అడ్డుకుంటాడు,మనకి వచ్చే కష్టాలు చిన్న రాళ్ళు మాత్రమే
అని దేవుడి గొప్పతనాన్ని తెలిపే ఈ ForwardMail మా తమ్ముడు నిన్న నాకు పంపాడు...








దేవుడు మనం అడిగినా అడగకపోయినా ఎప్పుడూ మనల్ని కాపాడుతూనే ఉంటాడు.

15, డిసెంబర్ 2010, బుధవారం

నా చిన్నారిస్నేహం...



నిన్న మాఇంటికి అనుకోని అతిధి వచ్చింది.తను నాచిన్నప్పటి ఫ్రెండ్ రాజేశ్వరి.St'anns girls high school లో నేను 6th class లో జాయిన్ అయినప్పటినుండి తను నాకున్న ఒకే ఒక్క ఫ్రెండ్.మా స్నేహం 6th నుండి 10th వరకు ఒకే స్కూల్లో ఎంతో సరదాగా వుండేది.10th తర్వాత నేను మా వూర్లో,తను తెనాలిలో ఇంటర్ జాయిన్ అయ్యాము అయినా కొన్నాళ్ళు మా friendship కంటిన్యూ అయ్యింది.వాళ్ళ ఫామిలీ గుంటూరు షిఫ్ట్ అవ్వటం,తనకి పెళ్లి కావటం,నేను లా లో జాయిన్ అవ్వటం వీటన్నిటి తర్వాత మా స్నేహానికి పూర్తిగా బ్రేక్ పడినట్లే అయింది.

మళ్ళీ ఇన్నాళ్ళకి మా అమ్మావాళ్ళింటికి నాకోసం వచ్చిన తనని చూసి నాకు చాలా సంతోషంగా,ఆశ్చర్యంగా కూడా అనిపించింది.తను మలేషియాలో ఉంటున్నానని ,ఒక పాప అని ప్రస్తుతం వాళ్ళ అమ్మ వాళ్ళింటికి గుంటూరు వచ్చానని,ఇంకా 3,4 నెలలు ఇండియాలోనే ఉంటానని చెప్పింది.కనీసం 10 సంవత్సరాలుగా ఫోనులో కూడా మాట్లాడుకోని మేమిద్దరం మాట్లాడుకోవటానికి చాలా విషయాలు వున్నా,తను వాళ్ళ బంధువుల ఇంట్లో ఫంక్షన్ కి వెళ్ళే పని ఉండటంతో మళ్ళీ కలుద్దామని అనుకున్నాము.సృష్టిలోమధురమైనది,జీవితంలో మరువలేనిది స్నేహం అని ఇలాంటి సందర్భాల్లోనే అనిపిస్తుందేమో...



Related Posts Plugin for WordPress, Blogger...