పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

25, ఏప్రిల్ 2011, సోమవారం

ఎవరేమి అనుకున్నా నువ్వుండే రాజ్యాన...



జీవితంలో ఎన్ని సార్లు ఓడిపోయినా తిరిగి గెలవటానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి ..
పోరాడి ఓడటంలో స్థైర్యం వుంటే కనీసం ప్రయత్నించకుండానే ఆగిపోవటం పిరికితనం అనిపించుకుంటుంది ..

ఎవరి రాజ్యానికి వారే రాజు,మంత్రి,సైన్యం,బంటు అంటూ బడ్జెట్ పద్మనాభం లో ఈ పాట నాకు చాలా ఇష్టం ..

నాకు నచ్చిన కొటేషన్స్ తో నేను అప్ లోడ్ చేసిన

ఎవరేమి అనుకున్నా నువ్వుండే రాజ్యాన
రాజు నువ్వే, బంటు నువ్వే.. 
మంత్రి నువ్వే.. సైన్యం నువ్వే




ఎవరేమి అనుకున్నా నువ్వుండే రాజ్యాన
రాజు నువ్వే, బంటు నువ్వే.. 
మంత్రి నువ్వే.. సైన్యం నువ్వే
 
ఏమైనా ఏదైనా నువ్వెళ్ళే బడిలోన
పలకా నువ్వే బలపం నువ్వే...
ప్రశ్ననువ్వే బదులు నువ్వే 
అన్నీ నువ్వే కావాలి అనునిత్యం పోరాడాలి 
 అనుకున్నది సాధించాలి
 
అవమానాలే ఆభరణాలు 
 అనుమానాలే అనుకూలాలు
సందేహాలే సందేశాలు  
 ఛీత్కారాలే సత్కారాలు
 
అనుకోవాలీ అడుగేయాలీ  
 ముళ్ల మార్గాన్ని అన్వేషించాలి
అలుపొస్తున్నా కలలేకన్నా 
పూల స్వర్గాన్ని అధిరోహించాలి
 
ఎవరికి వారే లోకంలో ఎవరికి పట్టని శోకంలో  
నీతో నువ్వేసాగాలి
 
ఎవరేమి అనుకున్నా నువ్వుండే రాజ్యాన
రాజు నువ్వే బంటు నువ్వే 
మంత్రి నువ్వే సైన్యం నువ్వే
 
బలము నువ్వే బలగం నువ్వే 
ఆటా నీదే గెలుపూ నీదే
నారు నువ్వే, నీరు నువ్వే
  కోతా నీకే, పైరూ నీకే
 
నింగిలోన తెల్లమేఘంనల్లబడితేనే  
జల్లులు కురిసేను
చెట్టుపైనా పూలు మొత్తం 
రాలిపోతేనే పిందెలు కాసేను
 
ఒక ఉదయం ముందర చీకట్లు 
విజయం ముందర ఇక్కట్లు
రావడమన్నది మామూలు
 
ఎవరేమి అనుకున్నా నువ్వుండే రాజ్యాన
రాజు నువ్వే బంటు నువ్వే 
మంత్రీ నువ్వే సైన్యం నువ్వే

 
సినిమా  - బడ్జెట్ పద్మనాధం 
సంగీతం - S.V. కృష్ణారెడ్డి 












4 కామెంట్‌లు:

ప్రవీణ చెప్పారు...

wonderful..chala baga rasaru..

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

Thankyou ప్రవీణ garu..

David చెప్పారు...

రాజి గారు మంచి పాటను పరిచయం చేశారు ఏ చినిమాలోనిది ఈ పాట.

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

"డేవిడ్" గారూ..
ఈ పాట "బడ్జెట్ పద్మనాధం" సినిమాలోదండీ..

ThankYou..!

Related Posts Plugin for WordPress, Blogger...