పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

7, మే 2011, శనివారం

పల్నాటి పౌరుషంచిన్నప్పటినుండి ఎన్ని గొడవలు పడినా,ఎంత అల్లరి చేసి,అలిగినా ఒక్క క్షణం కంటే ఎక్కువ మాట్లాడకుండా ఉండలేని బంధం అన్నా,చెల్లెలు,అక్క తమ్ముళ్ళ బంధం.
కష్టంలో,సుఖంలో,బాధలో,భయంలో అనుక్షణం తోడుండే బంధం రక్తసంబంధం.
ఆడవాళ్ళకి భర్తే లోకం అయినా పుట్టింటి బంధాలకు వుండే స్థానం ఎప్పటికీ చెదిరిపోదు...

ప్రతి ఒక్కరి జీవితంలో ఏ బంధానికి ఉండాల్సిన స్థానం దానికి వుండాలి ...
అభిప్రాయాలు,ఆలోచనలు, బంధాలు,బంధుత్వాలు,స్నేహాలు ఇలా ప్రతి మనిషికీ ఒక సొంత ప్రపంచం వుండాలి.
ఆ ప్రపంచంలో హాయిగా విహరించగలిగే స్వేచ్ఛ వుండాలి.
అప్పుడే మనిషికి మనిషికి మధ్య సంబంధాలు బంధాలుగా వుంటాయి లేకపోతే బంధనాలు అవుతాయి..

అన్నాచెల్లెళ్ళ అనుబంధాన్ని చాలా చక్కగా చూపించిన సినిమా ,నాకు చాలా ఇష్టమైన సినిమా పల్నాటి పౌరుషం.
ఒకరంటే ఒకరు ప్రాణమైన అన్నా చెల్లెళ్ళు రాధికా ,కృష్ణంరాజు.
కుటుంబంలో వచ్చిన గొడవల కారణంగా ఒకరిని ఒకరు వదులుకుని వేదన పడే
అన్నాచెల్లెళ్లుగా రాధికా ,కృష్ణంరాజుల నటన చాలా బాగుంటుంది.

బండెనక బండి కట్టి పదహారు బండ్లు కట్టి
మాగాణి గట్టుమీద రాగాల పాల పిట్టరో..4 వ్యాఖ్యలు:

వనజవనమాలి చెప్పారు...

చిన్నిప్రపంచం..బ్లాగ్ బాగుంది...పల్నాటి పౌరుషం ..చిత్రం.. అపురూపం.అన్నాచెల్లెళ్ళ అనురాగానికి.. అర్ధం చెప్పిన చిత్రం. మీ ద్వారా గుర్తుతెచ్చుకున్నాను. పరిచయం కి. .ధన్యవాదములు..

రాజి చెప్పారు...

నా చిన్నిప్రపంచం నచ్చినందుకు ధన్యవాదములు వనజవనమాలి గారు...
అవునండీ పల్నాటిపౌరుషం సినిమా నాకు కూడా చాలా నచ్చుతుంది..

yadavali చెప్పారు...

mee Blog Chaalaa baagundandi

రాజి చెప్పారు...

Thankyou yadavali garu.

Related Posts Plugin for WordPress, Blogger...