కళాతపస్వి k.విశ్వనాధ్ గారి ప్రతి సినిమా ఒక దృశ్య కావ్యం,కళాఖండం..
విశ్వనాధ్ గారి దర్శకత్వం ఒక ప్రత్యేక శైలిలో వుంటుంది.
మన సంస్కృతీ సాంప్రదాయాలు ప్రతిబింబించేలా వుంటాయి ఆయన సినిమాలు..
విశ్వనాథ్ గారి సినిమాల్లో సంగీతం,నాట్యం,నటీనటుల హావభావాలు ఎప్పటికీ చెరగని మధుర జ్ఞాపకాలు..
సిరిసిరిమువ్వ,సిరివెన్నెల,శుభలేఖ ,సూత్రధారులు,స్వాతికిరణం ,శంకరాభరణం,స్వయంకృషి,
సాగరసంగమం,స్వాతిముత్యం,సప్తపది,స్వర్ణకమలం,ఆపద్భాంధవుడు ..
k.విశ్వనాథ్ గారి దర్శకత్వంలో రూపుదిద్దుకున్నఈ సినిమాలన్నీ అపురూప సుందర దృశ్య కావ్యాలు..
k.విశ్వనాధ్ గారి ప్రతి సినిమాలో కథానాయిక పాత్ర ఎంతో అందంగా,తెలుగు సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ,
మంచి వ్యక్తిత్వం,కళ్ళతోనే మనసులోని భావాలను పలికించగల నైపుణ్యం విశ్వనాథ్ గారి కావ్యనాయికలకే సొంతం..
గుండె లోతుల భావాలు బయలు చేయు బాధ్యతల అలసి సొలసి
కంట ఇమడని సౌందర్యం పలుకనేరాని సంతోషం తేట పరిచి పరిచి
మనసు కన్నకలలు పంచుకొన పనిన మురిసిమురిసి
కనులు అలసి పోవా? గొంతు మూగ పోదా....
కంట ఇమడని సౌందర్యం పలుకనేరాని సంతోషం తేట పరిచి పరిచి
మనసు కన్నకలలు పంచుకొన పనిన మురిసిమురిసి
కనులు అలసి పోవా? గొంతు మూగ పోదా....
మౌనమేలనోయి ఈ మరపురాని రేయి
ఎదలో వెన్నెలా వెలిగే కన్నులా
సాగరసంగమం
సాగరసంగమం
ఘల్లు ఘల్లు ఘల్లుమంటూ మెరుపల్లే తుళ్లు
రేపల్లియ ఎద ఝల్లున పొంగిన మురళి
నవరస మురళిఆనందన మురళి
సప్తపది
నవరస మురళిఆనందన మురళి
సప్తపది
గంధము పూయరుగా పన్నీరు గంధము పూయరుగా
శుభోదయం
చిన్ని చిన్ని కోరికలడగా.... స్వయంకృషి
14 కామెంట్లు:
$రాజి గారు
బాగా రాసారు. మీరు విశ్వనాధ్ గారి సినిమాల్ని కావ్యాలుగా సంబోధించిన మీ శీర్షిక చూసినప్పుడే అర్థం అయింది. నిజంగానే అవి కావ్యాలు. వీరు కావ్యనాయికలు. వాటిని ప్రత్యక్షంగా పొందడం మనతరం అదృష్టం.
టపాలోకి వస్తే.. మీరు చెప్పిన కావ్యనాయికల్లో ఎవరి స్థానం ఏమిటి అని నన్ను అడిగితే ఇలా చెప్తా :)
౧)భానుప్రియ గారు
౨)జయప్రద గారు
౩)సుహాసిని గారు
ఇక్కడ లేకపోయినా ఎక్కువ చిత్రాలో నటించిన కధానాయిక కాకపోయినా "శంకరభరణం" రాజ్యలక్ష్మి గారు కూడా గొప్ప కావ్యనాయికే అన్నది నా అభిప్రాయ.
మీది మంచి అభిరుచి. ఇంకొద్దిగా వివరించి రాసి ఉంటే బావుండేది.. అంటే భానుప్రియ గారు "అర్థం చేసుకోరూ..." అనడాన్ని, జయప్రద గారు కళ్ళతో మాట్లాడ్డాన్ని అలా :)
ఏవైనా దృశ్యచిత్రాలతో సహా పంచినందులకు ధన్యవాదాలు :)
టపా బాగుందండి.
రాజేష్ జి గారు మీ విశ్లేషనాత్మక వ్యాఖ్యకు ధన్యవాదములండీ...
వీరి ముగ్గురిలో మీరు చెప్పిన స్థానాలు నిజమే కానీ,
నాకు సాగరసంగమం లో జయప్రద గారు చాలా ఇష్టం.
అందుకే ముందు జయప్రద గారి పాట పెట్టాను.
నా టపా నచ్చినందుకు Many Thanks...
శిశిర గారు టపా నచ్చినందుకు ధన్యవాదములండీ...
asalu mee taste chaala chaala bagundi.mammalni kooda aa alala pi kasepu thippinanduku thanks sasikala.
బావుందండి. చాలా బాగా రాసారు.
:-)
ఇంకో వీరఫాన్ అనమాట మీరు కూడా.
http://drbr1976.blogspot.com/search/label/%E0%B0%95%E0%B0%BE%E0%B0%B6%E0%B1%80%E0%B0%A8%E0%B0%BE%E0%B0%A7%E0%B1%81%E0%B0%A8%E0%B0%BF%20%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B1%80
సుజాత,మాధవి, జ్యోతిర్మయి, ఇందుల నా టపాలు ఇక్కడ చదవచ్చు.
కళా తపస్వి అనిపించుకున్న శ్రీ విశ్వనాధ్ గారు కూడా హీరోయిన్ల సౌందర్యాన్ని క్లోజప్ లో చూపించి కాష్ చేసుకోడం నాకు నచ్చలా.
ఉదా: సాగర సంగమం లో జయప్రద స్నానం సీన్ (అవసరమా) ? అర్ధ నగ్నంగా అందాలు చూపిన గీత మీద కమల్ హసన్ డ్యూయెట్..
స్వాతి ముత్యం లో దీప చెరువు గట్టుమీద స్నానం సీన్
ఇక సిరివెన్నెల్లో మున్ మున్ సేన్ బట్టలు ఇప్పక పోయినా అంగాంగం బట్టబయలు
సూత్రధరులు సినిమాలో రమ్య కృష్ణ బావా చొక్కా పట్టుకుని అన్ని అనుభవములు చక్కగా హావభావములతో ప్రదర్శించింది.. అందులోనే మంత్రపుష్పముని డ్యూయెట్ గా పెట్టడం ఎన్నో విమర్శల పాలైంది
గొప్ప కళాత్మక విలువులున్న ఈ సినిమాల్లో పై సీన్లు లేక పోయినా బాగా ఆడతాయి. సినిమా కధ కి లింకుపెట్టి పై సీన్ల ని అతికే అవసరం లేదని నా భావన.
Extra-ordinary..
థాంక్యూ శశికళ గారూ..
నా అభిరుచి మీకు మరీ మరీ నచ్చినందుకు
చాలా చాలా థాంక్స్...:)
థాంక్యూ ప్రసీద గారు
భావకుడన్ గారు అయితే నేను ఇంకో
వీరఫాన్ అనమాట :)
మీ కాశీనాథుని స్త్రీ చాలా బాగుంది...
చాలా వివరణాత్మకంగా చక్కగా రాశారు ..
నా కావ్యనాయికలు కూడా మీకు నచ్చినందుకు ధన్యవాదములండీ...
వోలేటి గారు మీ అభిప్రాయాలను తెలియచేసినందుకు థాంక్స్ అండీ...
Thanks for responding..
వనజవనమాలి garu thank you verymuch..:)
కామెంట్‌ను పోస్ట్ చేయండి