పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

31, అక్టోబర్ 2011, సోమవారం

ఈ ప్రేమలేంటో ఈ ప్రేమించడం ఏంటో....


ప్రేమ...
తల్లి కొకటి.....తండ్రికొకటి
చెల్లి
కొకటి.....అక్కకొకటి
తమ్ముడి
కొకటి.....అన్నకొకటి
మిత్రుని
కొకటి.....ప్రేయసికొకటి
పేదవాని
కొకటి....డబ్బున్న వాడికొకటి

ఎన్ని ప్రేమలు.. ఎన్నెన్ని రకాల ప్రేమలు
ఎక్కడెక్కడి
ప్రేమలు
క్షణానికి
వంద సార్లైనా వీటన్నిటితో అవధానం చేస్తుండాలేమో...

అసలెవరు కనిపెట్టారీ ప్రేమల్ని
అనుక్షణమూ
బంధించే గొలుసుల్ని
ఎవరు
కనిపెట్టారీ ప్రేమల్ని
ప్రతి
క్షణమూ గుండె ని గుచ్చేసే ముళ్ళని
ఎవరు
కనిపెట్టారీ ప్రేమల్ని
ఎవరు
కొనిపెట్టారీ ప్రేమల్ని

ప్రేమలేంటో ప్రేమించడం ఏంటో
చక్కగా
రాళ్ళమధ్యలోనో గడిపేసి
రాళ్ళ లాగానే స్పందనా లేకుండా ఉండగలిగితే???
ఇది సాధ్యమేనా???

ఇది నేను రాసింది కాదు..నెట్ లో దొరికింది నాకు నచ్చింది..
నిజమే
కదా అనిపించింది...
రచయిత
కు ధన్యవాదములు..


8 వ్యాఖ్యలు:

ఎందుకో ? ఏమో ! చెప్పారు...

" ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి "
మనం మనకోసమే దేనినైనా ప్రేమిస్తాం కాని, ఇతరం కోసం కాదు అని భావం.
ప్రతి ఒక్కరు కూడా తమను తాము ప్రేమించుకోనుచున్నారు కనుకనే ఇతరమైన వాటిని ప్రేమిస్తున్నారు
మొత్తానికి ప్రేమే జగతిని నడుపుచున్నది ....

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

స్పందించినందుకు ధన్యవాదములు శ్రీ గారు...

మీరు చెప్పింది నిజమేనండీ ప్రేమే జగతిని నడుపుతున్న మాట నిజమే ఐనా
మనకోసమే ఇతరుల్ని ప్రేమించటంలో స్వార్ధం వుంది కదా..
అప్పుడు ఆ ప్రేమకి మూలం స్వార్ధమే కదా
అంటే అప్పుడు లోకాన్ని నడిపే ప్రేమను కూడా ప్రభావితం చేయగలిగేది స్వార్ధమని,
ఆ స్వార్ధమే లోకాన్ని నడుపుతుందని అర్ధం కాదా..

సుభ/subha చెప్పారు...

బాగుంది అండీ.. స్వార్థం,ప్రేమ రెండిటినీ విడదీయలేమండీ నిజానికి. ఇది ప్రేమికులు అనే కాదు..అమ్మ,నాన్న,అక్క,చెల్లి,అన్న,తమ్ముడు ఇలా ఎవరి విషయమైనా కావచ్చు. ఏ స్వార్థమూ లేకుండా ప్రేమించడం అంటే అది లోకానికి అతీతమైనది అయ్యుండాలి. మంచి కవితను పరిచయం చేసినందుకు ధన్యవాదాలు రాజీ గారు.

ఎందుకో ? ఏమో ! చెప్పారు...

అమ్మా!! రాజీ !!

చక్కని ప్రశ్న అడిగావ్, ఎంత ముచ్చటగా అనిపించింది చదవిన వెంటనే !!

చిత్రం ఏమంటే ప్రేమ అనేది పారమార్ధిక అంశం, మనమేమో దానిని లౌకిక దృష్ట్యా చూస్తున్నాం మాట్లాడుతున్నాం !!

అసలు పరిపూర్ణ స్థితిలో అంటే అన్ని దాటిన పిదప highest state లో స్వార్థ - నిస్వార్థాలనే ద్వంద్వం ఉండదు అది ఏకమే!!

ఒకతను తన ఒక్క పొట్టనిన్డితే చాలు ఇంట్లో వాళ్ళ సంగతి నాకనవసరం అబుకుంటే అది మహా మహా మహా స్వార్థం
అదే తనతో పాటు తన కుటుంబం హాయిగా ఉండాలి అనుకుంటే మహా మహా స్వార్థం
తన తన కుటుంబం తన ఊరు బాగుందాలనుకుంటే మహా స్వార్థం
తన తన కుటుంబం తన ఊరు తన దేశం బాగుందాలనుకుంటే అది స్వార్థం
సర్వే జనః సుఖినో భవంతు అనుకుంటే నిస్వార్థం
(ఇక్కడ అనుకోవటం అంటే త్రికరణ శుద్ధిగా ఆచరించటం)

సో తన boundry వ్యాప్తం అయ్యేకొద్ది తన స్వార్ధం తగ్గుచున్నది, నిస్వార్దానికి దగ్గరవుతున్నది ఒక నాటికి నిస్వార్ధమే అవుతున్నది
ఆ నిస్వార్ధమే ప్రేమ

అయితే అదే నిస్వార్ధమే ఒక వ్యక్తి పైననో ఒక వస్తువు పైననో కుమ్మరిస్తే అదే ప్రేమ.

సో స్వార్ధానికి ప్రేమకి తేడా వివేకం వల్ల ఏర్పడినది

బుద్ధి వికసిస్తున్న కొద్ది స్వార్ధం ప్రేమగా పరిణమిస్తుంది.

ఇలా ! సృష్టి మనుగడకు ప్రేమయే కారణం అయినది !!

ఎవరికీ వారు తమ ఉనికిని కాపడుకోనవలేననే ప్రయత్నం చేస్తారు అందుకోసమే ఏమి చేసినా

అద్దానినే ప్రేమ అంటారు !!

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

ధన్యవాదాలు subha గారు.
ఈ కవిత నాకు నచ్చిందండీ..
అందుకే మీ అందరితో పంచుకుందామని పోస్ట్ చేశాను.

"ఏ స్వార్ధమూ లేకుండా ప్రేమించడం అంటే అది లోకానికి అతీతమైనది అయ్యుండాలి"

నిజమేనండీ చాలాబాగా చెప్పారు.
ప్రేమ విషయంలో నా అభిప్రాయం కూడా అదే...

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

ఎందుకో ఏమో ? గారు...
నా ప్రశ్న మీకు నచ్చినందుకు,
స్పందించి సమాధానం తెలియచేసినందుకు ధన్యవాదాలండీ..

"సర్వే జనః సుఖినో భవంతు అనుకుంటే నిస్వార్థం"

అలాంటి ప్రేమ ప్రతి ఒక్కరిలో వుంటే...
అది చాలా మంచిదే కదా..
థ్రిల్లర్ నవలలో యండమూరి గారు రాశారు..
మనిషిలో ప్రేమను పుట్టించగలిగె శక్తి దేవుడికి వుంటే ఇన్ని ప్రపంచయుద్ధాలు జరిగేవి కాదని
దాని మీద మీ అభిప్రాయం ఏమిటి?

రసజ్ఞ చెప్పారు...

ఈ కవిత, ఇక్కడ జరుగుతున్న చర్చ రెండూ చాలా బాగున్నాయి! కానివ్వండి!

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

థాంక్యూ రసజ్ఞ గారు..

Related Posts Plugin for WordPress, Blogger...