శ్వేత వస్త్రాలతో అలంకృతమై,హంసవాహినిగా, తెల్లని తామర పుష్పంపై కొలువుతీరిన వీణాపాణి జ్ఞానానంద పరాశక్తి. శ్రద్ధ , ధారణా, మేధా, విధి, వల్లభా, భక్తజిహ్వాగ్రసదన, శమాది గుణదాయిని అనే సప్త నామధేయాలతో విరాజిల్లే విద్యా స్వరూపిణి. బుద్ధి, స్మృతి,వాక్కు,విద్య ఆ దివ్య జనని అనుగ్రహ ఫలాలు
అమ్మ చెంతనే వుండే అమ్మ వాహనం హంస - పాలను, నీటిని వేరు చేస్తుంది. అలాగే మానవులు కూడా మంచి,చెడుల విచక్షణాజ్ఞానంతో మసలుకోవాలని సరస్వతిమాత తన హంసవాహనం ద్వారా సందేశం ఇస్తుంది .
అజ్ఞాన తీరాలనుండి విజ్ఞానపు వెలుగు వైపుకి నడిపించి,జీవితంలో అవసరమైన జ్ఞాన సంపదను, కరుణాకటాక్షాలను అనుగ్రహించమని ఆ వాగ్దేవిని శ్రీ పంచమి సందర్భంగా ప్రార్ధిస్తూ అందరికీ శ్రీ పంచమి శుభాకాంక్షలు.
నాకు ఇష్టమైన మరొక ఇన్స్పిరేషన్ సాంగ్ "కలకానిది విలువైనదీ" "వెలుగు నీడలు" సినిమాలోని ఈ పాటకు "శ్రీ శ్రీ" గారు రచించిన అద్భుతమైన సాహిత్యం ఈ పాటను చిరస్థాయిగా మనస్సులో నిలిచేలా చేసింది. సినిమాలో సావిత్రి భర్త జగ్గయ్య అనుకోని ప్రమాదంలో చనిపోతాడు.అప్పుడు ఆ దిగులుతో బాధపడుతున్న సావిత్రిని ఓదారుస్తూ జీవితంలో కష్టాలు వస్తే వాటి గురించే బాధపడుతూ.. ఎంతో విలువైన జీవితాన్ని వ్యర్ధం చేసుకోకూడదని చెప్తూ, నాగేశ్వరరావు పాడే ఈ పాట అప్పడు... ఇప్పుడు ఒక ఆణిముత్యం.
ఈపాటలోనాకునచ్చేమహాకవిశ్రీశ్రీగారిinspirational words ...
మా చెల్లి వాళ్ళ ఫామిలీతో ఈ వీకెండ్ కి మేము వెళ్ళిన ట్రిప్ యాదగిరిగుట్ట.ఇంతవరకు మేము చూడని ప్లేస్ ఇది.మిర్యాలగూడెం నుండి భువనగిరి వెళ్లి,అక్కడి నుండి యాదగిరి గుట్ట వెళ్ళాము.
నల్గొండ జిల్లాలోని భువనగిరి లో ఎంటర్ అవ్వగానే కనపడే గుండ్రాయి లాంటినున్నటి కొండ మీద వున్న భువనగిరి కోట చాలా బాగుంది.భువనగిరిలో ఉన్న ఈ కోట కాకతీయుల కాలంలో ప్రసిద్ధి చెందినది.ఈ కోట పశ్చిమ చాళుక్య వంశానికి చెందిన పాలకుడైన త్రిభువన మల్ల విక్రమదిత్య (ఆరవ) చేఏకశిలారాతి గుట్టపై నిర్మించబడింది. అతని పేరు మీదుగా దీనికి త్రిభువనగిరి అని పేరు వచ్చింది.ఈ పేరు క్రమంగా భువనగిరి అయ్యింది.
అద్భుతమైన ఆనాటి కట్టడం చూడటం ఒక గొప్ప అనుభూతి.. ఆధునిక కట్టడాలకి ఉపయోగించేభారీ పరికరాలేమీ లేకుండా ఆ రోజుల్లో నిర్మించిన ఈ కట్టడాలు ఇప్పటికీ కాలం తో పోటీ పడుతూ..
నిలిచి వున్న పూర్వ వైభవానికి,రాజసానికి ప్రతీక అనిపిస్తుంది.
ఇక్కడినుండియాదగిరిగుట్టలోని"కుందాసత్యనారాయణకళాధామం,సురేంద్రపురి" వెళ్ళాము.టీవీలో ఎప్పటి నుండో చూపిస్తున్న యాడ్ చూసి యాదగిరి గుట్ట వెళ్ళినప్పుడు ఇది కూడా తప్పకుండా చూడాలనుకున్నాము.
ప్రధాన ద్వారంలోనే ఇంద్రుడు తన ఐరావతం సమేతంగా ఆసీనుడై వచ్చిన వాళ్ళనుస్వాగతిస్తున్నట్లు వుంటుంది.లోపలి వెళ్ళగానే 60 అడుగుల పంచముఖ హనుమంతుడు ఒకవైపు, పరమేశ్వరుడు మరొకవైపు ఒకే శిల్పంలో వున్న విగ్రహం కనపడుతుంది. ఇక్కడి నుండి పెద్దలకు 250,పిల్లలకు 200 టికెట్ తీసుకుని గాయత్రి మాత విగ్రహం ముందు నుండి లోపలికి వెళ్ళాలి.ఇంక అప్పుడు మొదలవుతుంది పౌరాణిక పాత్రల పరిచయం.. భారతం, రామాయణం,కాళీయ మర్దనం,శక్తి పీఠాలు,దక్షిణ,ఉత్తర భారతదేశాల్లోని అనేక పుణ్యక్షేత్రాలు, కైలాసం,వైకుంఠం,విశ్వరూపం,యమలోకం,పాతాళ లోకం,మయసభ చివరిగా పద్మవ్యూహంఇలా ఏదేదో వింత లోకాల్లో తిరిగి తిరిగి బయటికి వస్తాము.లోపల ఫోటోలు తీయకూడదు ముందు ఇవన్నీ చూస్తూ నడవటం సరదాగానే అనిపించినా ఇంతదూరం నడిచి,మెట్లెక్కి అందరికీ నీరసం వచ్చేసింది .ఇక్కడ నడవటం కొంచెం కష్టమే అనిపించింది.
టీవీ యాడ్ లో నారదుల వారు హనుమంతుడు లడ్డూ ప్రసాదం ఇస్తారు అని చెప్తారు.నిజంగానే చివరిలో హనుమంతుడి చేతిలోనుండి లడ్డు ప్రసాదం ఇస్తారు కానీ ఉచితంగా కాదు 20 రూపాయలు తీసుకుని.మేము కూడా తీసుకున్నాము. ఒక ప్లాస్టిక్ బంతి లో వున్న రవ్వలడ్డు ను ప్రసాదంగా ఇచ్చారు.
తర్వాత లక్ష్మీ నరసింహ స్వామి దర్శనంచేసుకున్నాము. సాయంత్రం కొండ మీద చల్లటి గాలులతో వాతావరణం కొంచెం చలిగానే వున్నాఇబ్బంది అనిపించలేదు. గర్భగుడి విద్యుత్ దీపాల కాంతులతో వెలిగిపోతూ,ఆలయం లోపల వున్న చిత్రపటాలు, అలంకరణ చాలా బాగుంది.లక్ష్మీ సమేతుడై కొండపై గల గుహలో వెలసిననరసింహస్వామినిదర్శనం చేసుకుని,తీర్ధ,ప్రసాదాలు తీసుకుని, వెరైటీగా అట్టపెట్టెల్లో పెట్టి అమ్ముతున్న లడ్డుప్రసాదం కొనుక్కుని, బయటికి వచ్చాము.ఇక్కడ కోతులు గుంపులు గుంపులుగా వున్నాయి... కానీ ఎవరినీ ఏమీ అనకుండా తిరుగుతున్నాయి. ఇవీ మేము మొదటిసారి వెళ్ళిన మా యాదగిరిగుట్ట యాత్రా విశేషాలు.. మా చెల్లి,మరిది గారు సర్ప్రైజింగ్ గా అప్పటికప్పుడు చెప్పి మమ్మల్ని తీసుకు వెళ్ళిన ఈ ట్రిప్ ఒక మంచి జ్ఞాపకం..
బిజినెస్ మాన్ కి సద్గురుకి సంబంధం ఏమిటి అనుకుంటున్నారా హైదరాబాద్ లో బిజినెస్ మాన్ సినిమా చూడటానికి వెళ్ళిన వాళ్లకి "ISHA FOUNDATION"వాళ్ళు ఒక సి.డి ఇచ్చారు ఉచితంగా ..
ఆ సి.డి పేరు "TechnologiesforWellbeing""సద్గురుజగ్గివాసుదేవ్" అనే ఒక spiritual Guru ఆధ్వర్యంలోని Isha Yoga Center గురించి, యోగా ప్రాధాన్యతను గురించి ఈ సి.డి లో చెప్పారు.సి.డి చూసిన తర్వాత నెట్ లో "Isha Foundation" గురించి సెర్చ్ చేశాను.
ఈ సద్గురు కూడా ఈ మధ్య కాలంలోని కొంతమంది యోగా గురువుల్లాగానే యోగా తో పాటు,Health,Education,Environment లాంటి కొన్ని సమాజహిత కార్య క్రమాలు కూడా నిర్వహిస్తున్నారు.
యోగా,సోషల్ సర్వీస్ ఇలాంటివన్నీ అందరూ చేసేవే అయినా ఈ సద్గురు ఆశ్రమం లో నాకు చాలా నచ్చింది ఆశ్రమంలోని ధ్యాన లింగం,లింగభైరవి ఆలయాలు . శివాలయం,అమ్మవారి ఆలయాలు ఒక మంచి ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించేలాగా, తప్పకుండా చూడాలి అనిపించేలా వున్నాయి.
Dhyanalinga Yogic Temple
లింగ భైరవి ఆలయం
“One who earns the Grace of Bhairavi neither has to live in concern or fear of life or death, of poverty, or of failure. All that a human being considers as wellbeing will be his, if only he earns the Grace of Bhairavi.”
నా చిన్నిప్రపంచానికి మహారాణిని...
☺♥♥☺♥♥☺
నా ఆలోచనలు,జ్ఞాపకాలు,నమ్మకాలు, అభిరుచులు, నాకుటుంబం, స్నేహితులు, నా చుట్టూ ఉన్న ప్రపంచం ఏదో ఒక బంధం వున్న అన్ని విషయాల
♥ నా చిన్నిప్రపంచం ♥
♥ నా అంతరంగానికి అక్షరరూపం ♥
"Life is not a problem to be solved, but a reality to be experience" -- Videos By Raaji - It's Me :)
ఎప్పుడు ఒప్పుకోవద్దురా ఓటమి Guntur To KanyaKumari Road Trip My School Memories - St Ann's Girls high School Hamsala deevi - Mopidevi (Krishna Dist) Tour With My Family