29, ఫిబ్రవరి 2012, బుధవారం
22, ఫిబ్రవరి 2012, బుధవారం
దేవత నీవే ... నా దేవత నీవే...!
ప్రేమ... ఒకరి గురించి మరొకరి మనసులో ఏర్పడే ఒక అద్భుతమైన భావన.
ప్రేమించిన వాళ్ళకోసం ఏమైనా సరే చేయాలనుకోవటం, వాళ్ళ కోసమే బతకాలనుకోవటం
జీవితాంతం ఒకరికొకరుగా జీవించాలనుకోవటం ఇదేనేమో ప్రేమంటే..
దేవత నీవే ... నా దేవత నీవే...,నిన్నుకంటికి రెప్పలా కాపడుతాను అంటూ
ఒక ప్రేమికుడు ప్రియురాలికి తన మనసులోని ప్రేమను వ్యక్తం చేస్తూ పాడే ఈపాట
విశాల్, ప్రియమణి హీరో హీరోయిన్స్ గా నటించిన "భయ్యా" సినిమాలోది.
మంచి సాహిత్యం,సంగీతం ఈ పాట లో ప్రత్యేకత.
అందుకే ఈ పాట నాకు నచ్చిన పాట.

దేవత నీవే ... నా దేవత నీవే...
దేవత నీవే ... నాదేవత నీవే
కనుపాపగా కాస్తా నిన్నే రెప్పనై
నాజత నీవే ఇక నాజత నీవే
ఎడబాయక ఉంటా తోడూ నీడనై
నీలో నేను సగములే నీవే నాకు జగములే
నీతో యుగమే క్షణములే
ఇది మన మనసుల కలయిక కదా
దేవత నీవే ... నాదేవత నీవే
కనుపాపగా కాస్తా నిన్నే రెప్పనై
చినుకై వచ్చి ... నీకోసం పుడమై పోతాను
నదిలా వచ్చి ... నీకోసం కడవై పోతాను
కలలా వచ్చి ... నీకోసం కన్నై పోతాను
ఉలిలా నన్ను తాకావో ... శిల్పాన్నవుతాను
నీఊపిరి తో ఈవెదురైన వేణువు కాదా
నీ చూపులతో ఈ వేసవిలో వెన్నెల రాదా
సూర్యుని చుట్టూ భూమిలా నీ చుట్టూ నే తిరగనా
నీవే నేనై బ్రతకనా ... తలపుల తలుపులు తెరిచిన చెలి
జోరున కురిసే వానల్లో ఎండే నువ్వంటా
నిప్పులు చెరిగే ఎండల్లో వానే నువ్వంటా
ఏకాంతాన్ని వెలివేసే తోడే నువ్వంటా
శో కాలన్నీ తరిమేసే జాడే నువ్వంటా
నీ నవ్వుల్లో పూచేటీ పువ్వైపోనా
నీ నడకల్లో మోగేటీ మువ్వైపోనా
గుడిలో వెలసిన రూపమో గుండెలో వెలిగే దీపమో
పంచే తీయని తాపము
వలపుల పిలుపులు తెలిపిన మది
దేవత నీవే ... నాదేవత నీవే
కనుపాపగా కాస్తా నిన్నే రెప్పనై
నాజత నీవే ఇక నాజత నీవే
ఎడబాయక ఉంటా తోడూ నీడనై
నీలో నేను సగములే నీవే నాకు జగములే
నీతో యుగమే క్షణములే
ఇది మన మనసుల కలయిక కదా
లేబుళ్లు:
నాకు నచ్చిన పాటలు,
ప్రేమ
21, ఫిబ్రవరి 2012, మంగళవారం
"వనజ వనమాలి" గారికి అభినందనలు...
కథాజగత్ కథా విశ్లేషణ పోటీలో "సామాన్య" గారి కధ "కల్పన" పై విశ్లేషణకు
మొదటి బహుమతి పొందిన "వనజవనమాలి" గారికి హృదయపూర్వక అభినందనలు.
వనజ వనమాలి గారూ మీదైన శైలిలో మీరు రాసే కధలు,పరిచయం చేసే పాటలు,
చెప్పే కబుర్లు అన్నీ నాకు నచ్చుతాయి.
అలాగే నా చిన్నిప్రపంచంలో మీరు ఎప్పటికీ ఒక మంచి ఫ్రెండ్ గా ఉండాలని,
మీరిలాగే మంచి మంచి విజయాలను సొంతం చేసుకోవాలని కోరుకుంటూ అభినందనలు..

Something Special,
Special Days And Events
20, ఫిబ్రవరి 2012, సోమవారం
సత్రశాల - గుంటూరు జిల్లా
మొక్కులు తీర్చే సత్రశాల మల్లన్న
గుంటూరు జిల్లా మాచెర్ల కి సుమారు 25 కిలోమీటర్ల దూరంలో రెంటచింతల మండలంలో
వుంది సత్రశాల పుణ్య క్షేత్రం. శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లిఖార్జున స్వామి దేవస్థానం...
గుంటూరు జిల్లాలో ప్రసిద్ధి చెందిన క్షేత్రం ఈ సత్రశాల.
ఈ రోజు మహా శివరాత్రి కి ఆ స్వామిని దర్శించుకునే అవకాశం కలిగింది.
జనాలు ఎక్కువగా,రద్దీగా వుండే రోజుల్లో ఆలయాలకు వెళ్ళటం నాకు ఇష్టం లేకపోయినా
ఈ రోజు అమ్మ వెళ్దామని అడగటంతో మా వదిన,అక్క వాళ్ళతో వెళ్ళాము.
సత్రశాల ఆలయ ఆవరణ
ఆలయం ఆవరణలో భక్తులు స్వయంగా పూజించే
వినాయకుడు,శివలింగం.
క్యూ లైన్లలో దర్శనం సులభంగానే జరిగింది.వెళ్ళేటప్పుడు ఇబ్బంది అవుతుందేమో అని కొంచెం
భయం అనిపించినా అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ మహా శివరాత్రి రోజున శివయ్య దర్శనం
చేసుకోవటం మనసుకు చాలా సంతోషంగా అనిపించింది .
కృష్ణా నదిని దాటి అవతలి ఒడ్డుకి వెళితే అక్కడ కూడా ఆలయాలు వుంటాయి.
ఈ ఫోటో ఇవతలి ఒడ్దు నుంచి తీసింది.
సత్రశాల అవతలి ఒడ్దు.
చల్లగా,ప్రశాంతంగా ప్రవహిస్తున్న కృష్ణానది..
ఇక్కడ కృష్ణానది ప్రవహిస్తూ వుంటుంది.ఈ నదిలో స్నానం చేసి స్వామి వారి దర్శనం చేసుకుంటారు.
నది దగ్గరికి వెళ్ళాలంటే చాలా మెట్లు దిగి కిందికి వెళ్ళాలి అది మాత్రం చాలా కష్టం.
పండుగల రోజుల్లో కాకుండా విడి రోజుల్లో వెళ్తే గుడి ఆవరణ,పరిసరాలు చాలా ప్రశాంతంగా ఉంటాయి.
కానీ ఈరోజు మాత్రం అక్కడంతా భక్తుల సందడి. ఆర్టీసీ వాళ్ళ స్పెషల్ బస్సులు,ఆటోలు,ట్రాక్టర్ లు
ఇలా ఒక్కటి కాదు ఎక్కడ చూసినా జనప్రవహమే.
సత్రశాల లో ఈ రోజు తిరణాల జరుగుతుంది.దీన్ని తిరణాల లేదా జాతర అని కూడా అంటారు.
మొత్తానికి ఈ రోజు అనుకోకుండా "మొక్కులు తీర్చే సత్రశాల మల్లన్న" దర్శనం తో పాటూ
తిరణాల సందడిని కూడా చూసే అవకాశం కలిగింది.
తిరణాల సందడి
లేబుళ్లు:
నాకు నచ్చిన ప్రదేశాలు,
మావూరు
17, ఫిబ్రవరి 2012, శుక్రవారం
ఇడ్లీ - ఆర్కిడ్ - ఆకాశం
"మనిషి దీపమైనా కావాలి,అద్దమైనా కావాలి.
ఒకటి వెలుగు నిస్తుంది,మరొకటి దాన్ని ప్రతిబింబిస్తుంది..
ప్రతివారూ దీపం కాలేకపోవచ్చు,కానీ అద్దం కాగలరు.
తనకు తెలిసిన జ్ఞానాన్ని మరొకరికి పంచటమే జీవితం."
ఒకటి వెలుగు నిస్తుంది,మరొకటి దాన్ని ప్రతిబింబిస్తుంది..
ప్రతివారూ దీపం కాలేకపోవచ్చు,కానీ అద్దం కాగలరు.
తనకు తెలిసిన జ్ఞానాన్ని మరొకరికి పంచటమే జీవితం."
-అరిస్టాటిల్.
నిద్రపుచ్చే బెడ్ లాంప్ కన్నా,చదివించే పుస్తకం ( బహుమతిగా ) మిన్న.. అన్న ఉద్దేశ్యముతో...
అంటూ మొదటి పేజ్ లోనే ఒక మంచి కొటేషన్ తో మొదలయ్యే "ఇడ్లీ - ఆర్కిడ్ - ఆకాశం"
అంతకు ముందు ఇడ్లీ - వడ - ఆకాశం అనే టైటిల్ తో యండమూరి వీరేంద్రనాథ్
తెలుగులోకి అనువదించిన ఈ పుస్తకం నాకు నచ్చిన పుస్తకం.
అతి సామాన్య కుటుంబంలో పుట్టి, హార్డ్ వర్క్ తో పాటూ స్మార్ట్ వర్క్ కూడా చేసి జీవితంలో
అంచెలంచెలుగా ఎదిగిన "విఠల్ వెంకటేష్ కామత్" ఆత్మకధ IDLI, ORCHID AND WILL-POWER
పుస్తకానికి స్వేచ్చానువాదం ఈ "ఇడ్లీ - ఆర్కిడ్ - ఆకాశం" .
జీవితంలో ఒక సమయంలో ఓటమి నిరాశ,ఒంటరితనం,నిస్పృహలో మునిగిపోయినవెంకటేష్ కామత్ ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుని, అతని స్నేహితుడి26 వ అంతస్తులోని ఆఫీస్ కి వెళ్తాడు.స్నేహితుడు రూం లో నుండి బయటికి వెళ్ళగానే తన ఆలోచన అమలు చేయాలని కిటికీ అద్దం పక్కకి జరిపిన కామత్ కి అక్కడ ఒక దృశ్యం కనిపిస్తుంది.
రోడ్డుకు అటువైపు ఉన్న యూకోబ్యాంక్ ఇరవై మూడో అంతస్తు బయటవైపు ఒకతను రంగులు వేస్తున్నాడు.పై నుంచి వెదురు బొంగులతో తాత్కాలిక ప్లాట్ ఫాం నిర్మించి,దాని మీద నిలబడి అతడు పెయింటింగ్ వేస్తున్నాడు. అతడు ఎంత నిర్లక్ష్యంగా, ధీమాగా ఉన్నాడంటే కనీసం నడుముకి తాడు కూడా కట్టుకోలేదు.అతడి దృష్టంతా చేస్తున్న పని మీదే ఉంది.అతను కదిలినప్పుడల్లా కాళ్ళ క్రింద ఉన్నప్లాట్ ఫాం కూడా కదులుతుంది.అది ఏ క్షణమైనా పడిపోవచ్చు. కానీ అతనిలో ఏ భయమూ కనబడటం లేదు.మరణం అంచున నిలబడి అతడు అంత శ్రద్ధతో పని చేయటం ఏదో పాఠం చెప్తున్నట్లు అనిపించింది.
అతడు ఎందుకు ఇంత రిస్క్ తెసుకుని పని చేస్తున్నాడు? దినసరి కూలీ కోసం!ఆ కూలి తో తన కుటుంబాన్ని పోషించటం కోసం..
అతనితో పోల్చుకుంటే నా రిస్కు ఏ పాటిది అని ఆలోచించిన కామత్ ..దేశపు మొట్టమొదటిఅత్యంత అధునాతన వాతావరణ స్నేహపూర్వకమైన (ENVIRONMENTAL FRIENDLY)హోటల్ కి యజమాని అయ్యారు.జనారణ్యంలో ఎక్కడో ఒక మారు మూల... ఒక చిన్న రెస్టారెంట్ లో పని చేసిన కామత్ ప్రస్తుతం ప్రపంచపు ప్రతిష్టాకరమైన ఒక హోటల్ కి అధిపతి అయ్యారు.
ఈ పుస్తకం గురించి "విఠల్ వెంకటేష్ కామత్" మాటల్లో...
"అన్నీ అనుభవిస్తూ,భార్యా పిల్లలతో సుఖంగా ఉంటూ "జీవితం ఇంత సంతోషకరంగా ఉంటుందా"అన్న స్థితిలో ఉన్నప్పుడు అకస్మాత్తుగా కారు మేఘాలు కమ్మి,ఊహించని రీతిలో తుఫాను వస్తేఆ పరిస్థ్తిని తట్టుకోవటం కష్టం!నా జీవితం లో అలాగే జరిగింది..!కొన్ని రోజుల పాటు నిరాశా నిస్పృహలతోమనసు కొట్టుమిట్టాడింది.అయితే నాలోని ఆశావాదం నన్ను రక్షించింది.నా వాళ్ళు అనుకునే వాళ్ళునాకు అందించిన స్నేహ హస్తం... నా ప్రయాణాన్ని మళ్ళీ ముందుకు కొనసాగేలా చేసింది. దాని గురించి అందరికీ చెప్పాలన్న తపనే ఈ పుస్తకం."
ఆరువందల కోట్ల విలువ చేసే ఆ ఆర్కిడ్ హోటల్ కి పునాది ఇడ్లీ అందుకే ఈ కధకి ఇడ్లి - వడ - ఆకాశం అని అర్ధం వచ్చేలా పేరు పెట్టాను.మీ జీవితాశయం ఏమిటి అని ఒబెరాయ్ నన్ను అడిగిన ప్రశ్నకి -"మీ హోటల్ కన్నా పెద్దది కట్టటం" అన్నాను.
పన్నెండేళ్ళ వయసులో అది నా అహంభావం కాదు - కల!
నా అనుభవాన్ని పుస్తకం రూపంలో బయటికి తీసుకువచ్చి తద్వారా భవిష్యత్తు గురించి కలలు కనే వాళ్ళు! ఏమి చెయ్యాలా అని సందిగ్ధం లో కొట్టు మిట్టాడే వాళ్ళు ! దారి తోచని వాళ్ళు ! తమ మీద తమకు నమ్మకం లేని వాళ్ళు ! అలాంటి వాళ్లకు ఈ పుస్తకం ప్రేరణ ఇస్తే అంత కంటే కావాల్సింది ఏముంది? పూర్తిగా నిరాశా నిస్పృహలతో కొట్టుమిట్టాడుతూ ఒక బలహీన క్షణంలో ఆత్మహత్య చేసుకోవాలనిపించి కూడా,శూన్య స్థితి నుంచి మళ్ళీ పునర్నిర్మించుకున్న నా జీవితం ఒక పాఠకుడికైనా ప్రేరణ కలిగిస్తే అంతకంటే కావాల్సింది ఏముంది?
అంటూ మొదటి పేజ్ లోనే ఒక మంచి కొటేషన్ తో మొదలయ్యే "ఇడ్లీ - ఆర్కిడ్ - ఆకాశం"
అంతకు ముందు ఇడ్లీ - వడ - ఆకాశం అనే టైటిల్ తో యండమూరి వీరేంద్రనాథ్
తెలుగులోకి అనువదించిన ఈ పుస్తకం నాకు నచ్చిన పుస్తకం.
అతి సామాన్య కుటుంబంలో పుట్టి, హార్డ్ వర్క్ తో పాటూ స్మార్ట్ వర్క్ కూడా చేసి జీవితంలో
అంచెలంచెలుగా ఎదిగిన "విఠల్ వెంకటేష్ కామత్" ఆత్మకధ IDLI, ORCHID AND WILL-POWER
పుస్తకానికి స్వేచ్చానువాదం ఈ "ఇడ్లీ - ఆర్కిడ్ - ఆకాశం" .
"నీ మంచితనమే నీ విజయానికి తొలిమెట్టు" అనే పాజిటివ్ థింకింగ్ తో పాటూ ..పట్టుదల,కొత్తగా ఆలోచించాలన్న తపన,కృషి ఈ కధలో హీరోలో కనపడతాయి."కెరటం నాకు స్ఫూర్తి...లేచి పడినందుకు కాదు..పడినా లేస్తున్నందుకు" అన్న సూక్తి
ఇతని విషయంలో నిజమనిపిస్తుంది..జీవితంలో ఒక సమయంలో ఓటమి నిరాశ,ఒంటరితనం,నిస్పృహలో మునిగిపోయినవెంకటేష్ కామత్ ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుని, అతని స్నేహితుడి26 వ అంతస్తులోని ఆఫీస్ కి వెళ్తాడు.స్నేహితుడు రూం లో నుండి బయటికి వెళ్ళగానే తన ఆలోచన అమలు చేయాలని కిటికీ అద్దం పక్కకి జరిపిన కామత్ కి అక్కడ ఒక దృశ్యం కనిపిస్తుంది.
రోడ్డుకు అటువైపు ఉన్న యూకోబ్యాంక్ ఇరవై మూడో అంతస్తు బయటవైపు ఒకతను రంగులు వేస్తున్నాడు.పై నుంచి వెదురు బొంగులతో తాత్కాలిక ప్లాట్ ఫాం నిర్మించి,దాని మీద నిలబడి అతడు పెయింటింగ్ వేస్తున్నాడు. అతడు ఎంత నిర్లక్ష్యంగా, ధీమాగా ఉన్నాడంటే కనీసం నడుముకి తాడు కూడా కట్టుకోలేదు.అతడి దృష్టంతా చేస్తున్న పని మీదే ఉంది.అతను కదిలినప్పుడల్లా కాళ్ళ క్రింద ఉన్నప్లాట్ ఫాం కూడా కదులుతుంది.అది ఏ క్షణమైనా పడిపోవచ్చు. కానీ అతనిలో ఏ భయమూ కనబడటం లేదు.మరణం అంచున నిలబడి అతడు అంత శ్రద్ధతో పని చేయటం ఏదో పాఠం చెప్తున్నట్లు అనిపించింది.
అతడు ఎందుకు ఇంత రిస్క్ తెసుకుని పని చేస్తున్నాడు? దినసరి కూలీ కోసం!ఆ కూలి తో తన కుటుంబాన్ని పోషించటం కోసం..
అతనితో పోల్చుకుంటే నా రిస్కు ఏ పాటిది అని ఆలోచించిన కామత్ ..దేశపు మొట్టమొదటిఅత్యంత అధునాతన వాతావరణ స్నేహపూర్వకమైన (ENVIRONMENTAL FRIENDLY)హోటల్ కి యజమాని అయ్యారు.జనారణ్యంలో ఎక్కడో ఒక మారు మూల... ఒక చిన్న రెస్టారెంట్ లో పని చేసిన కామత్ ప్రస్తుతం ప్రపంచపు ప్రతిష్టాకరమైన ఒక హోటల్ కి అధిపతి అయ్యారు.
ఈ పుస్తకం గురించి "విఠల్ వెంకటేష్ కామత్" మాటల్లో...
"అన్నీ అనుభవిస్తూ,భార్యా పిల్లలతో సుఖంగా ఉంటూ "జీవితం ఇంత సంతోషకరంగా ఉంటుందా"అన్న స్థితిలో ఉన్నప్పుడు అకస్మాత్తుగా కారు మేఘాలు కమ్మి,ఊహించని రీతిలో తుఫాను వస్తేఆ పరిస్థ్తిని తట్టుకోవటం కష్టం!నా జీవితం లో అలాగే జరిగింది..!కొన్ని రోజుల పాటు నిరాశా నిస్పృహలతోమనసు కొట్టుమిట్టాడింది.అయితే నాలోని ఆశావాదం నన్ను రక్షించింది.నా వాళ్ళు అనుకునే వాళ్ళునాకు అందించిన స్నేహ హస్తం... నా ప్రయాణాన్ని మళ్ళీ ముందుకు కొనసాగేలా చేసింది. దాని గురించి అందరికీ చెప్పాలన్న తపనే ఈ పుస్తకం."
ఆరువందల కోట్ల విలువ చేసే ఆ ఆర్కిడ్ హోటల్ కి పునాది ఇడ్లీ అందుకే ఈ కధకి ఇడ్లి - వడ - ఆకాశం అని అర్ధం వచ్చేలా పేరు పెట్టాను.మీ జీవితాశయం ఏమిటి అని ఒబెరాయ్ నన్ను అడిగిన ప్రశ్నకి -"మీ హోటల్ కన్నా పెద్దది కట్టటం" అన్నాను.
పన్నెండేళ్ళ వయసులో అది నా అహంభావం కాదు - కల!
నా అనుభవాన్ని పుస్తకం రూపంలో బయటికి తీసుకువచ్చి తద్వారా భవిష్యత్తు గురించి కలలు కనే వాళ్ళు! ఏమి చెయ్యాలా అని సందిగ్ధం లో కొట్టు మిట్టాడే వాళ్ళు ! దారి తోచని వాళ్ళు ! తమ మీద తమకు నమ్మకం లేని వాళ్ళు ! అలాంటి వాళ్లకు ఈ పుస్తకం ప్రేరణ ఇస్తే అంత కంటే కావాల్సింది ఏముంది? పూర్తిగా నిరాశా నిస్పృహలతో కొట్టుమిట్టాడుతూ ఒక బలహీన క్షణంలో ఆత్మహత్య చేసుకోవాలనిపించి కూడా,శూన్య స్థితి నుంచి మళ్ళీ పునర్నిర్మించుకున్న నా జీవితం ఒక పాఠకుడికైనా ప్రేరణ కలిగిస్తే అంతకంటే కావాల్సింది ఏముంది?
- విఠల్ వెంకటేష్ కామత్
ఈ పుస్తకం లో మంచి కొటేషన్స్ ఉన్నాయి.వాటిలో కొన్ని నాకు చాలా నచ్చుతాయి.
1 - సరస్సులో బాతులు ఈదటం చూస్తుంటే ఎంతో అందంగా వుంటుంది.
అయితే-ఈ ఈదటం కోసం, అవి నీటి అంతర్భాగాన నిర్విరామంగా,
ఎంతో బలంగా కాళ్ళు కదుపుతూనే వుండాలి.
అందమైన జీవితం కోసం కూడా అంతే.
2 - కోరికలనేవి గుర్రాల్లాంటివనీ,వాటికి కళ్ళెం వేయాలని అంటారు.కానీ...
అసలు కోరికే లేని మనిషిగుర్రంతో సమానం! కోరిక ఉండాలి కానీ కేవలం
మితిమీరిన కోరికలకు మాత్రమే కళ్ళెం వేయాలి...అదే స్థితప్రజ్ఞత!
3 - అంతా కోల్పోయినా సరే,జీరో బేస్డ్ స్థాయి నుండి జీవితాన్ని
పునః ప్రారంభించే శక్తి,భగవంతుడు మనిషికి మాత్రమే ఇచ్చాడు.
కావాల్సిందల్లా కాస్త పట్టుదల,దీక్ష,శ్రమ మాత్రమే.
4 - మనుషులను ప్రేమిస్తే వాళ్లనుండి ప్రేమ తిరిగి కావాలనిపిస్తుంది...
వృత్తిని-ప్రవృత్తిని ప్రేమిస్తే అది నిరంతరమైన ఆనందాన్ని ఇస్తుంది...!
ప్రేమ గొప్పదే కావచ్చు కానీ మనల్ని మనం పోగొట్టుకునేంత గొప్పది ఏమికాదు..!
5 - మన జీవిత పుస్తకంలో ముఖ్య కధాంశం 'సంతృప్తి'. అది సాధించటం కోసం
మెట్లు నిర్మించుకోవాలి. ప్రతి ఛాప్టరూ ఒక గోలు.
చదువు,ఆరోగ్యం,సంసారం,డబ్బు - అన్నీ ఛాప్టర్లె.
6 - విజయ శిఖరం ఎక్కటానికి సరి అయిన నిచ్చెన వేసుకోవాలంటారు పెద్దలు.
దానికన్నా ముఖ్యం - నిచ్చెన నిలబెట్టే నేల గట్టిగా ఉందో లేదో చూసుకోవటం.
7 - ఎక్కడ 'కోరిక' ఉంటుందో అక్కడొక 'ఆలోచన' వుంటుంది.
ఎక్కడ సంకల్పం వుంటుందో,అక్కడ ఆ ఆలోచన ఒక
'విజయం' గా మారుతుంది.కోరిక లేని మనిషికి విజయం లేదు.
8 - సమస్య అనేది పూలమాల పట్టుకుని పెళ్లి కూతురిలా ఒంటరిగా రాదు.
మిగతా సమస్యలన్నిటినీ సైన్యంలా కూడగట్టుకుని ఒక్కసారిగా అన్ని వైపులనుండి ముట్టడిస్తుంది.

"ఇప్పటి నీకన్నా
రేపటి నీవు మిన్న
అవటంకోసం ప్రయత్నించటం కన్నా
గెలుపేముందన్న
విషయం తెలుసుకున్న"
ప్రతి ఒక్కరికీ ఈపుస్తకం అంకితం.
అవటంకోసం ప్రయత్నించటం కన్నా
గెలుపేముందన్న
విషయం తెలుసుకున్న"
ప్రతి ఒక్కరికీ ఈపుస్తకం అంకితం.
తనకు తెలియనిదేదీ లేదని అజ్ఞాని అనుకుంటాడు!
తనకు తెలియనిదంతా పాఠమని జ్ఞాని అనుకుంటాడు...
తనకు తెలియనిదంతా పాఠమని జ్ఞాని అనుకుంటాడు...
లేబుళ్లు:
నాకు నచ్చిన పుస్తకం.,
Inspiring Quotes Collection
14, ఫిబ్రవరి 2012, మంగళవారం
13, ఫిబ్రవరి 2012, సోమవారం
నీ పిలుపే ప్రేమగీతం...!
ఇద్దరూ ఒకరిని ఒకరు చూసుకోకుండా కేవలం ఉత్తరాల పరిచయం తో
ప్రేమించుకుని,ఎన్నో ఇబ్బందుల తర్వాత చివరికి కలిసే జంట కధే 1996 లో
అజిత్, దేవయాని హీరో హీరోయిన్లుగా వచ్చిన "ప్రేమలేఖ" సినిమా ..
ఈ సినిమాలో పాటలన్నీ బాగుంటాయి.ఆ పాటల్లో నీ పిలుపే ప్రేమ గీతం అన్న పాట...
ఈపాట సాహిత్యం,సంగీతం చాలా బాగుంటాయి.
నీ పిలుపే ప్రేమ గీతం
నీ పిలుపే ప్రేమగీతం...నీ పలుకే ప్రేమవేదం
ఆశలే బాసలై ... కలలు గనే పసిమనసులై
కవితలు పాడీ ... కవ్వించనీ
కవ్వించనీ ... కవ్వించనీ
కళ్ళు...కళ్ళు ... మూసుకున్నా
హృదయంతో మాటాడునమ్మా ప్రేమా
నిద్దుర చెదిరిపోయేనమ్మా నేస్తం కోసం
వెతికేనమ్మా ప్రేమా..
ఆడించీ ...పాడించీ ... అనురాగంకురిపించీ
అలరించేదే ప్రేమా
రమ్మంటే పొమ్మంటూ ... పొమ్మంటే రమ్మంటూ
కవ్వించేదేప్రేమా
ప్రేమలకు హద్దుల్లేవులే ... దాన్నిఎవ్వరైనా ఆపలేరులేనీ పిలుపే ప్రేమగీతం...
జాతీ లేదూ...మతమూ లేదూ
కట్నాలేవి కోరుకోదూ ప్రేమా
ఆదీ లేదూ అంతం లేదూ
లోకం అంతా తానై ఉండును ప్రేమా
ఊరేదో...పేరేదో...కన్నోళ్ళ వూసేదో
అడగదు నిన్ను ప్రేమా..
నాలోనా నీవుండీ నీలోనా నేనుండీ
జీవించేదేప్రేమా..
జాతకాలు చూడబోదులే ...ఎన్నిజన్మలైన వీడిపోదులే..
నీ పిలుపే ప్రేమగీతం...నీ పలుకే ప్రేమవేదం
ఆశలే బాసలై ... కలలుగనే పసిమనసులై

నువ్వు-నేను,
ప్రేమ