"కూరిమి గల దినములలో" అన్న పద్యం భార్యా భర్తలకు కూడా వర్తిస్తుంది కదా..
పెళ్ళైన కొత్తల్లో ఏ తప్పైనా చిన్నగా,మురిపెంగా అనిపిస్తుంది .. అదే తప్పు కొంతకాలానికి
మహా అపరాధంగా అనిపిస్తుంది.
భార్యా భర్తల మధ్య గొడవలు గడప దాటకూడదు అనేది ఒకప్పటి మాట..
కానీ ఇప్పుడు అవి గడపలు,గేట్లు అన్నీ దాటి పోయి ... కేసులు, కౌన్సిలింగ్ సెంటర్ల దాకా
కూడా వెళ్లక తప్పని పరిస్థితులు వచ్చేసాయి..
ఇప్పుడు కౌన్సిలింగ్ సెంటర్లు చేస్తున్న పనిని ఒకప్పుడు మన పెద్దలే చేసేవారు.
ఎన్ని గొడవలు ఉన్నా బంధువులు,స్నేహితులు సర్దుబాటు చేసేవారు..
కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు కదా!!
చిన్న చిన్న కారణాలకే భార్యా భర్తలు శత్రువులుగా మారిపోతున్నారు.
వాళ్ళని సరిచేయకపోగా,ఇంకా రెచ్చ గొట్టే వాళ్ళు కూడా ఎక్కువయ్యారు..
ఏది ఏమైనా భార్యా భర్తల మధ్య చిన్న చిన్న గొడవలు,అలకలు,మౌనాలు సహజం..
కానీ ఒక్కోసారి అవి శ్రుతి మించితే మళ్ళీ సరి చేసుకోవటం చాలా కష్టం.
శ్రీమతికి,శ్రీవారికి ఎన్ని గొడవలు వచ్చినా మౌన వ్రతాలు ,కక్ష సాధింపులు
ఎన్ని చేసినా ...ఆయనే నన్ను పలకరిస్తే బాగుంటుంది కదా అని శ్రీమతికి,
తనే నాతో మాట్లాడొచ్చు కదా అని శ్రీవారికి ఇద్దరికీ అనిపిస్తుంది.
అన్యోన్యంగా వుండే భార్యా భర్తల మధ్య వచ్చిన మనస్పర్ధలతో.. బాధపడుతున్న
ఇద్దరూ ఒకరి గురించి ఒకరు ఆలోచిస్తూ, నా మనసులోని భావాలను నా కళ్ళ ద్వారా
తెలుసుకోలేవా ?? అంటూ మనసులోనే ఒకరినొకరు ప్రశ్నిస్తూ పాడుకునే...
"కావ్యాస్ డైరీ"లో "తెలుసుకో నువ్వే" పాట చాలా బాగుంటుంది..
తెలుసుకో నువ్వే ...నా కళ్ళనే చూసి
తెలుసుకో నువ్వే నా కళ్ళనే చూసి
తెలుసుకో నన్నే నీ గుండెనే తెరిచి
తెలపాలి నువ్వైనా తెలపాలి నువ్వైనా
నేనే తెలుపలేకున్నా
తెలుసుకో నువ్వే నా కళ్ళనే చూసీ
నీ చేరువై నేనుండగా
ఈ దూరమేమిటో ఇంతగా
అనుకొనే నా మనసునే వినవా
నీ శ్వాస సోకితే చాలనే
ఆ ఆశ ఇంకిపోలేదనే
నిజమునే నీ పెదవితో అనవా
తలుచుకుంటాను నువ్వు నను
తలిచేవని ఈ క్షణం
నిదురలేస్తాను ఎదురుగా
కదలేవనీ ఈ దినం
నేనే...
అపుడేమో పెదవిపై నవ్వులే
ఇపుడేమో నవ్వులో నలుపులే
ఎందుకా చిరునవ్వులో మసకా
అపుడెంత కసిరినా మామూలే
ఇప్పుడేమి జరిగినా మౌనమే
ఎందుకే నీ మాటలో విసుగా
కలిసి రావాలి వెంటనే కాలాలు మనకోసమై
దరికి చేరాలి అంతలో భారాలు మమకారమై
నేనే ... తెలుపలేకున్నా
నీతో నేనే తెలుపలేకున్నా
12 కామెంట్లు:
nice poat. Raajee gaaru. chaalaa baagundi.
మీ పాట పరిచయం బావుంది రాజి గారూ...
Good song...thanks for sharing!
నేనసలు ఈ పాట ఎప్పుడూ వినలేదు రాజీ గారూ. ఇదే వినటం ధన్యవాదాలు!
పాట బాగుంది, భార్య భర్తల గురించి మీరు రాసినది ఇంకా బాగుంది రాజి గారు.
వనజవనమాలి గారూ..
పోస్ట్ నచ్చినందుకు థాంక్సండీ..
జ్యోతిర్మయి గారూ.. థాంక్సండీ..
ThankYou "Padmarpita" గారూ...
రసజ్ఞ గారూ..
నిజమేనండీ ఈ పాట ఎక్కువగా ఎక్కడా వినపడదు,
కానీ నాకు ఇష్టమైన పాట..
మీకు నచ్చినందుకు ధన్యవాదాలు!
జలతారు వెన్నెల గారూ...
పాట,అలాగే నేను రాసిన విషయం మీకు నచ్చినందుకు థాంక్సండీ!
యెంత చక్కటి పాట...దంపతులలోని ప్రేమని మళ్ళి జీవిమ్పచేస్తూ....ఉంటె ..ఏ అహాలు అడుగిడవు..
మంచి ఆలోచన పంచుకున్నారు...రాజి
"దంపతులలోని ప్రేమని మళ్ళి జీవిమ్పచేస్తూ....
ఉంటె ..ఏ అహాలు అడుగిడవు.."
"శశి కళ" గారూ..
మీరు చెప్పిన మంచి మాటకు,
పాట నచ్చినందుకు థాంక్సండీ...
కామెంట్‌ను పోస్ట్ చేయండి