మానవ సంబంధాలు స్వార్ధపూరితమే అయినా కొన్ని బంధాలు జీవితాంతం తోడూ,నీడగా జీవితాన్ని నందనవనం చేస్తాయి జీవితమనే పూలతోటలో కొందరి ఆగమనం వసంతమైతే మరికొందరి ఆగమనం గ్రీష్మం.మనసును బాధించే కష్టమైనా, ఆహ్లాదపరిచే సంతోషమైనా పంచుకునే ఆత్మీయ నేస్తం ఒకరు తమకంటూ ఉండాలని ప్రతి మనిషీ కోరుకుంటారు ...అలాంటి ఆత్మీయనేస్తమే
ఈ "నా ప్రియనేస్తం"
ఈ "నా ప్రియనేస్తం"
నా ప్రియ నేస్తం....
ప్రపంచం అంతా దూరం అయినా...,
నీకు ‘నేను’ ఉన్నా అని చెప్పేదే
నీకు ‘నేను’ ఉన్నా అని చెప్పేదే
నిజమైన స్నేహం...
ఆ స్ధానంలో “నాకు నువ్వు” “నీకు నేను”
ఒకరికొకరం...,
మన స్నేహమే మన ప్రపంచం
“నువ్వు” అనే ఈ రెండక్షరాలే
మన స్నేహమే మన ప్రపంచం
“నువ్వు” అనే ఈ రెండక్షరాలే
నా చేయి పట్టి నడిపిస్తుంటే
" నువ్వు" అనే ఈ రెండక్షరాలే
" నువ్వు" అనే ఈ రెండక్షరాలే
నా జీవితానికో మార్గాన్ని వేస్తుంటే
" నువ్వు"అనే ఈ రెండక్షరాలే
నన్ను ఇంతగా ప్రభావితం చేస్తుంటే
ఇంతకు ముందెపుడూ నేనెరుగని
మమతానుబంధమేదో
నువ్వు నా చుట్టూ పెనవేస్తుంటే.....
నా ప్రతి అడుగులో
నువ్వు తోడు వున్నావనే భావన
ఇంతకు ముందెపుడూ నేనెరుగని
మమతానుబంధమేదో
నువ్వు నా చుట్టూ పెనవేస్తుంటే.....
నా ప్రతి అడుగులో
నువ్వు తోడు వున్నావనే భావన
ఎంతో ఊరటనిస్తుంటే
సృష్టిలోనే తీయనైన నీ స్నేహ మాధుర్యాన్ని
సృష్టిలోనే తీయనైన నీ స్నేహ మాధుర్యాన్ని
నాకు చవిచూపిస్తుంటే
నిన్నటిదాకా కదలనని మొరాయించిన కాలం
నీ ఆగమనంతో వేగంగా
యుగాలు కూడా క్షణాల్లా కరిగి పోతుంటే ...
నిలువెత్తు నీ రూపాన్ని భద్రంగా
నా గుండెల్లో దాచుకొని....,
ఏవేవో అంతులేని ఆలోచనలతో
సతమతమవుతున్న నా మనసుకి చెప్తున్నా...
ఇదిగో "నీ ప్రియ నేస్తం" అని
నీ నవ్వు చెప్పింది నాకు నేనెవ్వరో ఏమిటో..
నీ నీడ చూపింది నాలో ఇన్నాళ్ళ లోటేమిటో
సినిమా - అంతం
సంగీతం - కీరవాణి
లిరిక్స్ - సిరివెన్నెల
సింగర్ - S.P.బాలు
21 కామెంట్‌లు:
bhale chepparu paata kuda sariga sari poyindi
@ "చెప్పాలంటే......"
మంజు గారూ.. పోస్ట్ నచ్చినందుకు థాంక్సండీ!
"ప్రియ నేస్తం" పై మనసు పలికే భావాలు చక్కగా రాయగలిగారు. అద్భుతమైన అనిర్వచనీయ భావన...మనసులో మెదిలేలా రాయటం కష్టం...
చాలా చక్కగా రాశారు, అభినందనలు!
"చిన్ని ఆశ" గారూ..
ఎక్కడో చదివింది కొంత,నా మనసులోని ఫీలింగ్స్ కొంత కలిపి ఈ "ప్రియ నేస్తం" కవిత..
నేను రాసింది మీకు నచ్చినందుకు,మీ స్పందనకు థాంక్సండీ..
bhagundandi
chaalaa baagaa Express chesaaru.
wonder full song and music composition In Lakshmi kanth -pyarelal
రాజీ గారు "అంతం" చిత్రం కి RD బర్మన్ సంగీతం వహించారు.అని కొందరు..లక్ష్మి కణత్ ప్యారేలాల్ అని కొందరు అంటారు కానీ ఈ పాటకి సంగీతం అందించింది.ఏం.ఏం. కీరవాణి.అన్నది నిజం అంట. ఈ పాట సాహిత్యం మాత్రం ..సిరివెన్నెల గారు.
"the tree" గారూ..
నా చిన్నిప్రపంచానికి స్వాగతం..
పోస్ట్ నచ్చినందుకు థాంక్సండీ!
వనజవనమాలి గారూ..
నేను రాసింది మీకు నచ్చినందుకు,అలాగే ఈ పాట గురించి వివరాలు తెలియచేసినందుకు థాంక్సండీ..
ఇప్పుడే పోస్ట్ లొ అప్ డేట్ చేస్తాను..
ThankYou!
వావ్ రాజి గారూ భలే వ్రాసేస్తున్నారే! అభినందనలు!
రాజి గారు ఆ ప్రియ నేస్తం మీరై ఉంటె బాగుంటుంది . కవిత హ్రిదయానికి హత్తుకుంది .
"రసజ్ఞ" గారూ..
పోస్ట్ నచ్చినందుకు,మీ అభినందనలు తెలియచేసినందుకు థాంక్సండీ..
"Meraj Fathima" గారూ..
ప్రతి మనిషీ వాళ్ళకు కూడా ఇలాంటి ప్రియనేస్తం ఒకరు వుండాలని,అలాగే ఇలాంటి ప్రియనేస్తం మనమే మరొకరికి అయ్యుండాలని కోరుకుంటారేమో..
కానీ మనం ప్రియనేస్తంగా వుంటామా, అప్రియంగానే మిగిలిపోతామా అనేది కాలమే నిర్ణయిస్తుందేమో..
కవిత నచ్చినందుకు థాంక్సండీ..
పెనవేసిన స్నేహబంధం చిరకాలపు అనుబంధం! స్నేహకుసుమం నిత్యపరిమళం.స్నేహానికన్నా ఏముంది మిన్న?
C.ఉమాదేవి గారూ.. థాంక్సండీ ..
స్నేహబంధం గురించి మీ మాటల్లో చక్కగా చెప్పారు
చాలా బాగుంది రాజి గారూ!
ఈ పోస్ట్ నా కంటి నుంచి మిస్ అయింది ఇప్పటివరకూ...
@శ్రీ
"శ్రీ" గారూ...
ఆలస్యంగా చూసినా పోస్ట్ మీకు నచ్చిందన్న
మీ స్పందన తెలిపినందుకు థాంక్సండీ..
అలాగే లేట్ గా రిప్లై ఇస్తున్నందుకు సారీ కూడా :)
ప్రియ నేస్తం గురించి మీ కవిత చదువుతుంటే ఎవరి ప్రియనేస్తాలు వారికి గుర్తు కొస్తారు.చక్కని కవిత.
oddula ravisekhar గారూ...
ఇలాంటి "ప్రియనేస్తాన్ని" ప్రతిఒక్కరు తప్పకుండా కోరుకుంటారేమో!!!
కవిత నచ్చినందుకు,మీ స్పందన తెలిపినందుకు థాంక్సండీ..
రాజి గారు, ఈ టపా నేను మిస్స్ అయ్యాను.
నీ నవ్వు చెప్పింది నాతో....ఈ పాట ఎన్నిసార్లు విన్నా, నాకు అదే ఫీలింగ్...
ఎక్కడికో వెళ్ళిపోతాను.
"జలతారువెన్నెల" గారూ..
ఆలస్యంగానైనా మీకు పోస్ట్ నచ్చిందని చెప్పినందుకు థాంక్సండీ..
నాకు కూడా చాలా ఇష్టమైనపాట ఇది!!
కామెంట్‌ను పోస్ట్ చేయండి