జగన్మాత,జగద్విజేత,శక్తి స్వరూపిణి అయిన ఆ విశ్వ జనని శరన్నవరాత్రులు నేటి నుండి ప్రారంభమయ్యాయి.ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి నవమి వరకు ‘శరన్నవ రాత్రులు’ అని పిలుస్తారు. ఈ తొమ్మిది రోజులూ దీక్షతో అమ్మవారిని పూజించటం సంప్రదాయం. అలా సాధ్యం కాని వారు తదియ నుండి గాని, పంచమి నుండి గాని, సప్తమి నుండి కాని ప్రారంభించి దేవిని పూజిస్తారు. ఈ నవరాత్రులలో పరాశక్తిని విధి విధానంగా పూజించి, దశమి రోజున ఏదైనా పనిని ప్రారంభిస్తే తప్పక విజయం లభిస్తుందనేది విశ్వాసం.ఆశ్వయుజ శుద్ధ దశమి విజయదశమిగా చెప్పబడుతుంది. దీనికే అపరాజిత దశమి, దసరా అని కూడా పేర్లు. ఈ రోజున ఏ పనిని ప్రారంభించినా అందులో తప్పక విజయం లభిస్తుంది. ఈ రోజు సాయంత్రం జమ్మిచెట్టును దర్శించి పూజించాలి. జమ్మిచెట్టును పూజిస్తే అన్నింటా విజయం లభిస్తుందని అంటారు.
శ్రీ బాలా త్రిపుర సుందరి - 16-10-2012
ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి
నవరాత్రులలో మొదటి రోజు అమ్మవారు బాలా త్రిపుర సుందరిగా దర్శనమిస్తుంది.త్రిపుర త్రయంలో ఈ దేవి మొదటిది.బాలా దేవి మహిమాన్వితమైనది.శ్రీ బాలా త్రిపుర సుందరి మంత్రం సమస్త దేవీ మంత్రాలలోకెల్లా గొప్పది.అందుకే శ్రీ విద్యోపాసకులకు మొట్ట మొదట ఈ బాలా మత్రాన్నే ఉపదేశిస్తారు.పవిత్ర శ్రీ చక్రంలో మొదటి అమ్నాయం లో వుండే మొదటి దేవత బాలాదేవి. అందుకే ముందుగా ఆ దేవిని పూజిస్తే మహా త్రిపురసుందరీ దేవి అనుగ్రహాన్ని పొందగలుగుతాము.
పేలానిర్మిత ధూమ్ర లోచన వధే, హేచండ ముండార్దిని |
నిశ్శేషీకృత రక్తబీజ దనుజే | నిత్యే | నిశుంభాపహే |
శుంభ ధ్వంసినీ సంహారాశు దురితం దుర్గే | నమస్తే అంబికే !
చండ ముండాది శుంభ నిశుంభులను
రాక్షసులను సంహరించిన దానవు!
రాక్షసులను సంహరించిన దానవు!
ధూమ్రలోచనుని వధించిన దానవు!
మహిషాసుర మర్ధన సమయంలో ఎర్రనైన కన్నులు కలదానవు!
నిత్యమైన దానవు! పాపాలను పోగెట్టేదానవు
అయిన ఓ తల్లీ ! నీకు నమస్కారం!
మహిషాసుర మర్ధన సమయంలో ఎర్రనైన కన్నులు కలదానవు!
నిత్యమైన దానవు! పాపాలను పోగెట్టేదానవు
అయిన ఓ తల్లీ ! నీకు నమస్కారం!
ఆ జగన్మాత సమస్త లోకాన్ని తన చల్లని చూపులతో.
ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో దీవించాలని ప్రార్ధిస్తూ...
అందరికీ శరన్నవరాత్రుల శుభాకాంక్షలు!
అందరికీ శరన్నవరాత్రుల శుభాకాంక్షలు!
శ్రీ బాలా త్రిపుర సుందరి స్తోత్రం
4 కామెంట్లు:
మనం దక్షిణాన తొమ్మిది రోజులు అమ్మవార్ల పేర్లు వేరేగా చెప్తాం...
(విజయవాడ కనక దుర్గ అలంకరణ కూడా అలాగే చేస్తారు)
కానీ దుర్గా స్తుతి ప్రకారం...
प्रथम शैलपुत्री · द्वितीयं ब्रह्मचारिणी · तृतीय चंद्रघंटा ·
चतुर्थ कूष्माण्डा · पंचम स्कन्दमाता · षष्टम कात्यायनी·
सप्तम कालरात्रि · अष्टम महागौरी · नवम सिध्दीदात्री
ఇలా ఉత్తరాదిన ఈ పద్ధతిలో స్తుతిస్తారు...
మహిషాసుర సంహారం కోసం అవతరించిన దుర్గ రూపాలు ఇవే...
మీరూ చదివే ఉంటారు...
కేవలం షేర్ చేస్తున్నాను...
మీకు కూడా శరన్నవరాత్రుల శుభాకాంక్షలు...@శ్రీ
రాజీ గారు!
చాల మంచి పోస్ట్ అండి.
శరన్నవరాత్రుల శుభాభినందనలు.
"శ్రీ" గారు..
నిత్యం చదివే దుర్గా స్తోత్రం ప్రకారం మీరు చెప్పిన దుర్గారూపాలే ఈ నవరాత్రుల్లో అమ్మవారు అవతరించినవైనా.. నేను విజయవాడ కనకదుర్గమ్మ అలంకారం ప్రకారం పోస్ట్ పెట్టానండీ..
ఉత్తరాది దసరా వేడుకల గురించి తెలిపినందుకు,
దుర్గా స్తుతిని వ్యాఖ్యలో అందించినందుకు ధన్యవాదములు..
మీకు కూడా శరన్నవరాత్రుల శుభాకాంక్షలు..
"భారతి" గారూ..
పోస్ట్ నచ్చినందుకు,మీ శుభాభినందనలకు ధన్యవాదములండీ..
మీకు కూడా శరన్నవరాత్రుల శుభాకాంక్షలు..
కామెంట్‌ను పోస్ట్ చేయండి