అన్నమయ్య మనుమడు "తాళ్ళపాక చిన్నన్న" "అన్నమాచార్య చరితము" అన్న ద్విపద కావ్యములో అన్నమయ్య జీవిత విశేషాలను పొందుపరచాడు..అన్నమయ్య జీవితం గురించి మనకు తెలిసిన వివరాలకు
ఈ రచనే ఆధారం.
"తెలుగు పదానికి జన్మదినం - అన్నమయ్య జననం"
సంతానం లేని అన్నమయ్య తల్లిదండ్రులు వెంకటేశ్వరస్వామికి మొక్కుకుని,తిరుమల తిరుపతిని దర్శించుకొని, ధ్వజస్తంభం ఎదురుగా సాష్టాంగ
ప్రమాణం ఆచరించినపుడు ఒక దివ్యమైన కాంతి లక్కమాంబ గర్భంలో ప్రవేశించిందని
అన్నమయ్య జన్మగాధ..
తన 8వ ఏట ఎవరికీ చెప్పకుండా అన్నమయ్య కాలినడకన తిరుపతి బయలుదేరాడు. సంప్రదాయం తెలియక తిరుమల కొండను చెప్పులతో కొండనెక్కుతుండగా అలసిపోయి ఒక వెదురు పొదలో నిద్రపోతున్న ఆయనకు కలలో అలివేలు మంగమ్మ దర్శనమిచ్చి పరమాన్నాన్ని ప్రసాదించి, పాదరక్షలు లేకుండా కొండనెక్కమని బోధించింది.
"వేడుకుందామా వేంకటగిరి వేంకటేశ్వరుని
అని కీర్తిస్తూ యాత్రికులతో కలిసి తిరుపతి చేరుతాడు అన్నమయ్య..తిరుమల కొండను సందర్శించి పరవశం తో
అంటూ తిరుమల గిరులను స్తుతించి,గురువుల వద్ద వైష్ణవ తత్వాలను తెలుసుకొంటూ, ఆళ్వారుల దివ్య ప్రబంధాలను అధ్యయనం చేస్తూ,
"అలర చంచలమైన ఆత్మలందుండ నీ యలవాటు చేసె నీవుయ్యాల"
అని వేంకటేశ్వరుని కీర్తిస్తూ తిరుమలలోనే జీవితం గడపసాగాడు అన్నమయ్య.. అన్నమయ్య చెప్పిన కీర్తనలను ఆయన శిష్యులు గానం చేస్తూ తాళపత్రాలలో భద్రపరచేవారట ..
"పలుకు తేనెల తల్లి పవళించెను" అంటూ పద్మావతీదేవిని
కీర్తించే అన్నమయ్య కీర్తనలను వినటం అమ్మవారికి కూడా చాలా ఇష్టమట.
అంటూ స్వామివారి బ్రహ్మోత్సవాలలో స్వామిని కీర్తించాడు అన్నమయ్య.ఇప్పటికీ బ్రహ్మోత్సవం అంటే అందరికీ గుర్తొచ్చే పాట ఇది.
అంటూ మనుషులందరూ పరబ్రహ్మ స్వరూపమే అని, కులమతాల వివక్షను తొలగించే ప్రయత్నం చేశాడు.
విజయగర రాజ ప్రతినిధి, దండనాధుడు అయిన సాళ్వ నరసింగరాయలు. అన్నమయ్యను తన ఆస్థానానికి ఆహ్వానించాడు. రాజ
ప్రాపకం వలన అన్నమయ్య సంగీత ప్రభావం కన్నడదేశంలో ప్రసిద్ధమయ్యింది.
"ఏమొకో చిగురుటధరమున ఎడనెడ కస్తూరి నిండెను"
అంటూ అన్నమయ్య స్వామివారి శృంగారాన్ని గురించి పాడిన పాటను విన్న
నరసింగరాయలు తరువాతి కాలంలో అన్నమయ్యను తనపై కూడా ఒక్కపదాన్ని
వినిపించమని కోరాడట. హరిని కీర్తించే నోట నరుని కీర్తించనని అన్నమయ్య
నిరాకరించినందున, కోపించి రాజు అతనిని చెరసాలలో సంకెళ్ళలో
ఉంచాడట..రాజాస్థానం తనకు తగినది కాదని తెలుసుకొని అన్నమయ్య తిరుమల చేరాడు.
తన
శేషజీవితాన్ని స్వామి సన్నిధిలో నిత్యారాధనలో, సంకీర్తనా దీక్షలో గడిపాడు.
"దాచుకో నీ పాదాలకు తగ నే చేసిన పూజలివే"
"అంతర్యామి అలసితి సొలసితి ఇంతట నీ శరణిదే చొచ్చితినీ"
అని స్వామివారిలో ఐక్యం అయ్యాడు అన్నమయ్య..
అన్నమయ్య శ్రీమహావిష్ణువు యొక్క ఖడ్గం అయిన నందకాంశ
సంభూతుడు అని భావన ఉంది. "పదకవితా పితామహుడు", "సంకీర్తనా చార్యుడు",
"పంచమాగమ సార్వభౌముడు", "ద్రవిడాగమ సార్వభౌముడు" - ఇవి అన్నమయ్యకు
సమకాలీనులు సాదరంగా ఇచ్చిన బిరుద నామాలు
అలమేలుమంగ,
శ్రీనివాసుల కీర్తనలకు తన జీవితాన్ని అంకితం చేసిన పరమభక్తుడు అన్నమయ్య.
అన్నమయ్య కీర్తనలు ఆ దేవ దేవునికే కాదు ఆబాల గోపాలానికి అన్నమయ్య పాటలు
ప్రియమైనవే ...అందుకే కదా ప్రతి తెలుగుతల్లి తన బిడ్డకు
చందమామను చూపిస్తూ,గోరుముద్దలు తినిపిస్తూ...
"చందమామ రావో జాబిల్లి రావో"
అంటూ పాడుతూంది..
అంటూ జోలపాడి నిద్రపుచ్చుతుంది.
ఇప్పటికీ
తిరుమల గిరివాసుడు అన్నమయ్య మేలుకొలుపు వింటూ నిదురలేచి,జోలపాట వింటూ
నిద్రపోతాడట.అన్నమయ్య పాట స్వామి దైనందిన చర్యలో ఒక భాగమై నిలిచింది.నిధి
కాదు హరిపద సన్నిధి చాలా సుఖమని నమ్మి నడచిన పరమభాగవతుడు
అన్నమయ్య...అన్నమయ్య పదములు వినగలిగిన మనమూ ధన్యులమే
ఇందరికి అభయమ్ము లిచ్చు చేయి..
ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా తెలుగంటే అన్నమయ్య పాట అనిపించుకున్నతెలుగు పదకవితా పితామహుడు
శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యులకు వందనములతో.
2 కామెంట్‌లు:
అద్భుతం రాజి గారూ!...
అన్నమయ్య గురించి చాలా చాలా బాగా చెప్పారు...అభినందనలు...
@శ్రీ...
మీకు నచ్చినందుకు ధన్యవాదములు "శ్రీ" గారూ..
కామెంట్‌ను పోస్ట్ చేయండి