నాసిక్ నుండి త్రయంబకేశ్వర్ వెళ్ళే దారిలో ఉన్న ఈ మనీ మ్యూజియంలోనే ప్రఖ్యాత ఫోటోగ్రాఫర్ K.G. మహేశ్వరి గారి చిత్రప్రదర్శన కూడా ఉంది. మనీ మ్యూజియం విశేషాలు ఈ పోస్ట్ లో చూడొచ్చు
- Money Museum - Nashik
ఇప్పటిదాకా K.G. మహేశ్వరి ఎవరో కూడా తెలియని మాకు ఒక గొప్ప వ్యక్తిని గురించి తెలుసుకునే అవకాశం వచ్చింది అనిపించింది. నవంబర్ 2 1922 లో జన్మించిన K.G. Maheswari - కృష్ణగోపాల్. మహేశ్వరి గారికి చిన్నతనంలో తండ్రి సంగీతం నేర్పించాలని అనుకున్నారట.కానీ ఆడిషన్స్‌లో టీచర్ అతని గొంతు సంగీతానికి పనికిరాదని చెప్పటంతో ఆ నిరాశ నుండి బయటపడటానికి ఫోటోగ్రఫీ హాబీగా చేసుకుని, చిన్నతనం నుండే ఫోటోలు తీయటం సొంతగా నేర్చుకున్నారు.1938 లో ఆయన ఫోటోకి మొదటిసారి Beginners Section లో ప్రైజ్ గెలుచుకున్న తర్వాత ఫోటోగ్రఫీ మీద ఆసక్తి ఎక్కువయ్యింది .ఆయన తన జీవితంలో 70 సంవత్సరాలు ఫోటోగ్రఫీ లోనే జీవితం గడిపారట.
National and International Exhibitions లో ఎప్పుడూ పాల్గొంటూ ఉండేవారట.ఫోటో ప్రదర్శనలకు న్యాయనిర్ణేతగా కూడా వ్యవహరించేవారు. ఫొటోగ్రఫీలో K.G. మహేశ్వరిగారు గెలుపొందిన వందల సంఖ్యలో బంగారం, వెండి, కాంస్య పతకాలు, మెరిట్ సర్టిఫికేట్లు షీల్డ్స్ ఆయన తీసిన బ్లాక్ అండ్ వైట్ చిత్రాల ప్రదర్శన బాగుంది. అందమైన చిత్రాలతో పాటూ వాటి కింద దానికి తగిన టైటిల్,ఆ ఫోటో తీసిన సంవత్సరం అన్నీ వివరంగా ఉన్నాయి. ఇప్పటికీ ఆ ఫోటోలలో భావాలు (emotions) సజీవంగా మనకి కనపడతాయి.2014 డిసెంబర్ 5 వరకు జీవించిన ఫోటోగ్రఫీ గురు K.G. మహేశ్వరిగారు ఇప్పటికీ ఆయన చిత్రాల్లో సజీవంగా నిలిచే ఉన్నారు.
2 కామెంట్లు:
Thanks for sharing ..... Enjoyed your post andi.
Thank You so much "Murthy" Garu..
కామెంట్‌ను పోస్ట్ చేయండి