పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

28, అక్టోబర్ 2011, శుక్రవారం

కాణిపాకం To విష్ణుకంచి - 4 ( రమణమహర్షి ఆశ్రమం ) తిరువన్నామలై

కాణిపాకం నుండి తిరువన్నామలై (అరుణాచలం) బయలుదేరాము.
ఆంధ్రాబోర్డర్ దాటి తమిళనాడులో ఎంటర్ అవ్వగానే
welcome to tamilnadu అంటూ airtel మాకు స్వాగతం చెప్పింది.
అక్కడి నుండి వెల్లూరు వెళ్లి తమిళ ,ఆంధ్ర సరిహద్దుల్లో వున్న అరుణాచలం క్షేత్రానికి బయలుదేరాము..


అరుణాచలం
వెళ్లి,అక్కడ మేము ఎప్పటినుండో చూడాలనుకుంటున్న,తప్పకుండా వెళ్ళాలి అనుకున్న
రమణ మహర్షి ఆశ్రమం అతిథి ఆశ్రమ్ కి వెళ్ళాము.
రమణ మహర్షి ఆశ్రమం-అతిధి ఆశ్రమ్

అక్కడే
మాకు ఆశ్రమం వాళ్ళు ఇచ్చిన రూమ్స్ తీసుకుని..
మేము వెళ్ళింది మధ్యాహ్నం భోజనం టైం కావటంతో ముందుగా భోజనం చేసి కాసేపు రెస్ట్ తీసుకున్నాము.
భోజనం చాలాబాగుంది తమిళ వంటలు ముఖ్యంగా అవియల్ ( పెరుగులో కూరగాయముక్కలతో చేసిన వంట ),
వడలు చాలా బాగున్నాయి..
ఇక్కడ మౌనం పాటించాలి ,ఎవరి తిన్న అరిటాకులను వాళ్ళే తీసేయాలి
అవియల్

సాయంత్రం ఆశ్రమం స్వామీజీ హంసానంద, మాతాజీ సౌమ్య, ట్రస్టీ రాజు గారితో మాట్లాడే అవకాశం కలిగింది..
వారు మమ్మల్ని ఆశ్రమానికి ఎంతో ఆప్యాయంగా ఆహ్వానించి ఆశ్రమం పేరుకు తగినట్లుగానే అతిధి మర్యాదలు చేశారు..
అరుణాచల క్షేత్రమును మొదటిసారిగా చూస్తున్న మాకు అభినందనలు తెలిపి ఆ క్షేత్ర మహిమను,
భగవాన్ రమణ మహర్షి ఆశ్రమం గురించి, ధ్యానం గురించి ఎన్నో విషయాలను చెప్పారు..
అరుణాచలం స్వయంగా శివుడే అని భగవంతుడు ఇక్కడ పర్వత రూపంలో కొలువై ఉన్నాడని
ఈ క్షేత్ర సందర్శన అవకాశం రావటం మా పూర్వజన్మ సుకృతం అని అన్నారు..
ఆశ్రమం పరిసర ప్రాంతాలు,ఆశ్రమంలో రమణమహర్షి కొలువై వున్న ధ్యాన మందిరం చాలా ప్రశాంతంగా వున్నాయి.
అక్కడికి వెళ్ళిన వారిని ఆదరించే తీరు చాలా బాగుంది.
ఇక్కడ పేద సాధువులకు అన్నదానం జరుగుతుంది,వైద్య సదుపాయాలను అందిస్తారు.

భగవాన్ రమణ మహర్షి ద్యానమందిరం - అతిధి ఆశ్రమం

ఆశ్రమంలో స్వేఛ్చగా విహరిస్తున్న నెమళ్ళు
ఈ ఆశ్రమం చూడటం నిజంగా ఒక మంచి అనుభవం అని చెప్పొచ్చు.ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో
ధ్యాన సాధన చేయాలనుకునే వారికి అనుకూలమైన వాతావరణంలో, మనసుకు హాయిని కలిగించేలా వున్న
అతిధి ఆశ్రమం అరుణాచలంలో తప్పకుండా చూడాల్సిన ప్రదేశం.
ఆ రాత్రి ఆశ్రమంలోనే వుండి తెల్లవారాక అరుణాచలేశ్వరుని దర్శించుకోవటానికి వెళ్ళాము..

4 కామెంట్‌లు:

ఎందుకో ? ఏమో ! చెప్పారు...

Hi

Raaji garu !!

I am very happy to see your posts.

very nice!!

Arunaachalam eppudaina velli teeralsina place anukune vaadini

tvaralo naa blog lo kuda ramana maharshi bodhala literature pettali anukuntunna !!

mee experiences tho nindina mee next tapaa kosam wait chesthu sri

sorry Enduko emo

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

థాంక్సండీ
నా టపాలు మీకు నచ్చినందుకు స్పందించినందుకు చాలా సంతోషంగా వుంది..
మేము కూడా తిరువన్నామలై ఎప్పటినుండో వెళ్ళాలని అనుకుని ఇప్పటికి అనుకోకుండా వెళ్ళటం కుదిరిందండీ..
మీరు పోస్ట్ చెసే రమణ మహర్షి బోధల లిటరేచర్ కోసం Wait చెస్తుంటాను శ్రీ గారు

మిమ్మల్ని శ్రీ అనొచ్చనుకుంటాను.
మీ పేరు తెలియకముందు మీ బ్లాగ్ పేరుతో సంబోధించాను ఏమీ అనుకోకండి.

మాలా కుమార్ చెప్పారు...

అరుణాచలం వెళ్ళాలని ఎప్పటి నుంచో ప్లాన్ . కొన్ని కొన్ని స్తలాలకు వెళుదాము అనుకుంటూనే ఏళ్ళు గడిచిపోతున్నాయి :)
మీ పోస్ట్ లు బాగున్నాయి .

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

థాంక్యూ మాలాకుమార్ గారు..
మేము కూడా జెమినిటీవీలో శివయ్య సీరియల్ వచ్చేటప్పటి నుండి అనుకునే వాళ్ళము అరుణాచలం చూడాలని.
కానీ ఇంత తొందరగా ఆ భగవంతుడు మాకు అవకాశం కల్పిస్తాడనుకోలేదు..

Related Posts Plugin for WordPress, Blogger...