పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

16, డిసెంబర్ 2011, శుక్రవారం

ధనుర్మాసం మొదలయ్యింది...!


ధనుర్మాసం వచ్చేసింది..

కొత్త సంవత్సరం ఆగమనాన్ని గుర్తు చేస్తూ.. ఇప్పటి నుండి మొదలు పెట్టి సంక్రాంతి పండుగ వరకు
ఇంటి
వాకిళ్ళను కళ కళ లాడేలా తీర్చిదిద్దే రంగవల్లులతో
హరిలోరంగా హరి అంటూ భగవన్నామస్మరణ చేస్తూ వచ్చిన హరిదాసుతో ,
ధనుర్మాసం లో విష్ణు మూర్తికి పూజ చేసే "తిరుప్పావై పాశురాలతో" మన ఇళ్ళల్లోనే కాదు ..
మన బ్లాగ్ లలో కూడా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది..

నేను కూడా ఈ సంవత్సరం నా "భక్తిప్రపంచం" బ్లాగ్ లో "తిరుప్పావై పాశురాలు" పోస్ట్ చేస్తున్నాను..

ఈ ధనుర్మాసం అంతా మీరు కూడా మంచి మంచి ముగ్గులు వేయాలని,
చక్కగా ధనుర్మాసం పూజలు చేసుకోవాలని కోరుకుంటూ..


8 వ్యాఖ్యలు:

మాలా కుమార్ చెప్పారు...

ఈ ధనుర్మాసం అహోభిలమథం లో చాలా బాగుంటుంది .
మీరూ చక్కని ముగ్గులు వేసి , ఫొటోలు తీసి మాకు చూపించండి .

రాజి చెప్పారు...

ఐతే అక్కడి విశేషాలు మాకు చెప్పండి
మాలాకుమార్ గారు..
తప్పకుండా నేను వేసిన ముగ్గులు ఫోటోలు చూపిస్తాను
థాంక్యూ ..

సుభ చెప్పారు...

రాజీ గారూ మంచి మంచి ముగ్గులు వెయ్యాలేం... అవి మేము చూసి పండగ చేస్కోవాలి మరి.

రసజ్ఞ చెప్పారు...

ధనుర్మాసం ఒక్కటే అనుకుంట నేలంతా పండగ వాతావరం నెలకొనేది. ఎవరి హడావిడి వాళ్ళది. ఈ నేలంతా ఇంట్లో ఉంటే అబ్బో ఆ గోల, హడావిడే వేరు ఇక్కడ మాత్రం కనీసం ముగ్గు పిండి కూడా దొరకదు మాకు. అయినా నేనూరుకుంటానా? బియ్యపు పిండితోనే వేసేస్తుంటాను. అలానే ఇక్కడ నా ముగ్గులకి అభిమానులు కూడా వచ్చేసారండోయ్! మీ ముగ్గులు కోసం చూస్తూ...........

రాజి చెప్పారు...

"సుభ" గారు తప్పకుండా మంచి ముగ్గులు
వేసి మీకు చూపిస్తాను..
అలాగే పండగ చేసుకుందాం..
మీ ప్రొత్సాహానికి ధన్యవాదములు...

రాజి చెప్పారు...

రసజ్ఞ గారూ మీరు చెప్పింది నిజమేనండీ..
ముగ్గుల కళ,సందడి కనపడేది ఈ ధనుర్మాసంలోనే..
ఐతే మీరు కూడా మంచి ముగ్గులు వేస్తారన్నమాట..
అందరూ అభిమానించే మీ ముగ్గుల్ని మాకు కూడా చూపించండి మరి..
నా ముగ్గుల్ని కూడా చూపిస్తాను..

Enduko Emo చెప్పారు...

భక్తి ప్రపంచం లో ఇంకా కామెంట్ చేసేందుకు వీలు పడటం లేదు సరే
ఇంకో బ్లాగ్ ఉండి కదా అని ఇక్కడ కామెంట్ చేసి తర్వాత ఈ కామెంట్ delete చేయమని చెప్దామని వచ్చాను
ధనుర్మాసం ప్రత్యేక కార్యక్రమం వీక్షించగలరు

http://endukoemo.blogspot.com/2011/12/dhanurmasam-special-programme.html

ఎందుకో ? ఏమో ! చెప్పారు...

Hi,

Please Also Catch the following link

for

మార్గశిరం అంటే? దేనికి మార్గం? ధనుర్మాసం ప్రత్యేకత ఏమిటి? ధనుర్మాసానికి తిరుప్పావైకి సంబంధం ఏమిటి?
శూన్య మాసం అంటే ఏమిటి?
బ్రాహ్మీ ముహూర్తం యొక్క విశిష్టత ఏమిటి

http://endukoemo.blogspot.com/2011/12/what-is-about-dhanurmasam.html

Thank You

?!

Related Posts Plugin for WordPress, Blogger...