పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

31, జులై 2012, మంగళవారం

మా పూలతోట ...


ఈ సంవత్సరం ఎండలు చాలా ఎక్కువగా వున్నాయి.. ఆ ప్రభావం మనుషులనే కాదు మా మొక్కల్ని కూడా చాలా బాధపెట్టింది. పోయిన సంవత్సరం మొక్కలన్నీ ఎంతో చక్కగా పూలు పూసాయి.. కానీ ఈ ఎండలకి ఒక్కోటిగా మొక్కలన్నీ ఎండిపోతుంటే చాలా బాధ అనిపించింది.. కానీ ఏమీ చేయలేని పరిస్థితి..

"ఇంటి వాకిలి వెతికి ఆకాశం చిరు జల్లులు కురియును మనకోసం" అన్నట్లుగా వర్షం కోసం ఎదురుచూసి వర్షం పడగానే వెంటనే నర్సరీకి వెళ్లి, అలాగే ఇళ్ళ దగ్గరికి వచ్చిన మొక్కలు కొనేసి మళ్ళీ మా పూలతోట ని ఆకుపచ్చగా మార్చేసాము.. చాలా రోజుల తర్వాత చల్లటి గాలికి హాయిగా నవ్వుతూ ఫోటోలకు ఫోజులు ఇచ్చిన మొక్కలను చూడటం చాలా సంతోషంగా అనిపిస్తుంది..

మొక్కలు కొనటంలో బిజీగా వున్న అమ్మ, పిన్ని..


నర్సరీలో పచ్చందనమే పచ్చదనమే


కొత్త మొక్కలు
మా మొక్కలలో ఎక్కువ గులాబీలే వుంటాయి..








ఎండలకి కూడా మొండిగా తట్టుకుని
వర్షం పడగానే చెట్టునిండా పూలు పూసిన మా చిట్టి గులాబీలు



వర్షానికి తడిచి పచ్చగా మెరిసిపోతున్న మందారం, నందివర్ధనం


ముద్దబంతి నవ్వులు

చుక్కమల్లె పూలు

పోయిన సంవత్సరం నాటిన చామంతుల్లో మిగిలిన చామంతి మొక్కలు.

మా ఇంట్లో మొక్కలే కాదు ఇప్పుడు కురుస్తున్న వర్షాలకి ప్రకృతి అంతా పచ్చగా,అందంగా ఎక్కడికి వెళ్తున్నా దారివెంట పచ్చటి చెట్లు,పొలాల్లో ఇప్పుడిప్పుడే మొలకెత్తుతున్న పంటలు చాలా చల్లగా ఆహ్లాదకరంగా ఎంత దూరం ప్రయాణమైనా విసుగు అనిపించకుండా వాతావరణం చాలా బాగుంది..

హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ దగ్గర గన్నేరు పూలు

పంట పొలాలు



కాగితం పూలు


పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే
భూలోకమే ఆనందానికి ఇల్లు




29, జులై 2012, ఆదివారం

మనసు చూడతరమా ...


గుప్పెడంత గుప్పెడంత మనసు ... దాని సవ్వడేంటో ఎవ్వరికి తెలుసు ??
మనసు గతి ఇంతే ... మనసున్న మనిషికి సుఖము లేదంతే ... ,
మౌనమే నీ భాష ఓ మూగ మనసా ... ,
మనసున మనసై ... బ్రతుకున బ్రతుకై...,
ఓ మనసా తొందర పడకే ... అంటూ
మనసు కవి ఆత్రేయ గారి దగ్గరి నుండి ప్రతి ఒక్కరూ ఈ మనసును గురించి మాట్లాడకుండా వుండలేరేమో..
"స్వర్గాన్ని
నరకంగా ... నరకాన్ని స్వర్గంగా చేయగలిగేది మన మనసే"..

ఇంత గొప్ప మనసును గురించి ఎన్నో సినిమా పాటలు,కవితలు వున్నాయి అలాంటిదే ఈ పాట కూడా ...ఈ పాట ఒకప్పుడు ఈ టీవీ లో సీరియల్ గా వచ్చిన "మనసు చూడతరమా" టైటిల్ సాంగ్ ... నాకు ఇష్టమైన పాట.

మనసు చూడతరమా ...



వూరించకే ... కవ్వించకే ... వేధించకే మనసా ఇలా
బంధాలలో
బందీలనే చేశావుగా బతికేదెలా
కరుణించినా
కాటేసినా నువ్వే కదా మనసా
నువ్వే
మబ్బుల్లో తేలుస్తావో మత్తుల్లో ముంచేస్తావో
నమ్మించి
మాయే చేస్తావో ...

అవునంటూ
కాదంటూ రేపేవు కలవరమే
ఆరాటమే
అనునిత్యమూ
సంతోషం
సల్లాపం నీ బొమ్మా బొరుసులుగా
ఆడేవులే
ఒక నాటకం
ర్పువై ఓదార్పువై ... ఓడితే నిట్టూర్పువై
కష్టాలనే
మది ఇష్టాలుగా మలిచేవుగా

మనసు చూడతరమా ... మనసు చూడతరమా


27, జులై 2012, శుక్రవారం

సౌభాగ్యలక్ష్మీ రావమ్మా...


సౌభాగ్యలక్ష్మీ రావమ్మా ... అమ్మా ... సౌభాగ్యలక్ష్మీ రావమ్మా
నుదుట కుంకుమ రవిబింబముగా ... కన్నుల కాటుక నిండుగ వెలుగ
కాంచనహారము గళమున మెరియగ ... పీతాంబరముల శోభలు నిండగ
సౌభాగ్యలక్ష్మీ రావమ్మా

నిండుగ కరముల బంగారుగాజులు ... ముద్దులొలుకు నాదమ్ముల మువ్వలు
గలగలమని సవ్వడి చేయగ ... సౌభాగ్యవతుల సేవల నందగ
సౌభాగ్యలక్ష్మీ రావమ్మా

నిత్య సుమంగళి నిత్య కల్యాణి ... భక్త జనుల మా కల్పవల్లివై
కమలాసనవై కరుణ నిండగా ... కనకవృష్టి కురిపించే తల్లీ
సౌభాగ్యలక్ష్మీ రావమ్మా ... అమ్మా ... సౌభాగ్యలక్ష్మీ రావమ్మా



శ్రావణ వరలక్ష్మి అందరినీ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో,సకల సౌభాగ్యాలతో దీవించి,
కోరిన కోరికలను వరాలుగా ప్రసాదించమని ప్రార్ధిస్తూ
"వరలక్ష్మీవ్రతం శుభాకాంక్షలు"

కనకధారా స్తోత్రం




11, జులై 2012, బుధవారం

♥♥ ప్యార్ ... ప్రేమ ... కాదల్ ...Love Anthem For World Peace ♥♥


మానవత్వాన్ని మించిన మతం లేదు.. మానవత్వం అంటే బాధల్లో ఉన్నవారి మీద జాలి చూపించటం,ఆపదలో వున్న వారిని ఆదుకోవటం,సాటి ప్రాణిని హింసించి మనం ఆనందించకపోవటం,కులమతాలకు,దేశ భాషలకు అతీతంగా మనుషులందరినీ ప్రేమించగలగటం...ప్రేమ అన్న పదానికి చాలా పరిమితమైన పరిధి అందరికీ వుంటుంది.

ప్రేమ ఇద్దరు ప్రేమికుల మధ్య మాత్రమే కాదు తన కుటుంబాన్ని,తన చుట్టూ వున్న మనుషుల్ని,జీవరాశిని ప్రేమించే వ్యక్తిత్వాన్నే మానవత్వం అంటాము. ప్రేమ ఇద్దరు లేదా కొందరు మనుషుల మధ్య మాత్రమే వుండదు... కొందరు దేవుడిని ప్రేమిస్తారు, కొందరు చేసే పనిని ప్రేమిస్తారు,కొందరు వస్తువులను,ఆస్తులను ప్రేమిస్తారు,కొందరు ఇష్టమైన భోజనాన్ని ప్రేమిస్తారు, ఇలా ప్రేమ అనేక రకాల "భావాల నిధి" అని చెప్పొచ్చు..

సాటి మనిషికి సహాయం చేయటం,ప్రేమించటం అంటే మన ఆస్తిపాస్తులు,కుటుంబం అన్నిటినీ త్యాగం చేయాల్సిన అవసరం లేదు బాధలో వున్న మనిషికి చిన్న ఓదార్పు మాట చెప్పగలగటం, మన మాటలు,చేతల వల్ల సాటి మనిషికి ద్రోహం చేయకపోవటం కూడా మానవత్వమే. కానీ ప్రతి మనిషికీ తనకంటూ కొన్ని ఆలోచనలు వుంటాయి,తన జీవితంలో ఎవరికి ఏమి చెయ్యాలి,ఎవరికి తన ప్రేమను పంచాలి,ఎలా సమాజంలో మనుగడ సాగించాలి అనే విషయంలో ఎవరి పరిధులు వాళ్లకుంటాయి. మనుషులందరూ మదర్ థెరీసా లాగా సంఘ సేవకులు కాలేరు కానీ మానవత్వం వున్న మనుషుల్లాగా దయతో ఎదుటివారిని ఆదరించగలగాలి. ప్రేమ అనేది "మరొకరి సంతోషాన్ని చూసి ఆనందించగలగటం ".

ఒక్కోసారి నాకు అనిపిస్తుంది దేవాలయాలకు,స్వామీజీలకు లక్షలు లక్క్షలు పెట్టి బంగారు కిరీటాలు,తొడుగులు చేయించే అజ్ఞాత భక్తులు ఆ డబ్బేదో ఏదో ఒక అనాధాశ్రమానికో,పేదలకో ఇవ్వొచ్చు కదా,ఆ ఇచ్చిన విరాళాలను తీసుకున్న వారు సక్రమంగా ఖర్చు పెట్టొచ్చుకదా అని... కానీ మళ్ళీ నా మనసుకే అనిపిస్తుంది ఒకరి ఆలోచనలను నియంత్రించటానికి,నిర్ణయించటానికి మనకేమి హక్కుంది?? నా ఆలోచన నాకున్నట్లే ఎవరి రీజనింగ్ వాళ్ళకుంటుంది కదా అని.. "ఇంట గెలిచి రచ్చ గెలవమన్నట్లు" ఏదైనా మనం పాటించి ఎదుటివాళ్ళకి చెప్పటం మంచిది కదా..


"మనుషులంటే రాయిరప్పలకన్న కనిష్టం గానూ చూస్తావేల బేలా?
దేవుడెక్కడో దాగెనంటూ కొండకోనల వెతుకులాడేవేలా?
కన్ను తెరచిన కానబడడో? మనిషి మాత్రుడియందు లేడో?
యెరిగి కోరిన కరిగి యీడో ముక్తి?"
--గురజాడ

ఇప్పుడింతకీ నేను ఈ మానవత్వం, ప్రేమ అన్న విషయాల గురించి ఎందుకు చెప్తున్నానంటే మా తమ్ముడి ఫోన్ కి కాల్ చేస్తే కాలర్ టోన్ గా ఒక పాట వస్తుంది.. అది మన తెలుగు కాదు,తమిళ్ కాదు ఏదేదో వచ్చేస్తున్నాయి.. ఇదేంటా అని ఎన్నిసార్లు విన్నా పాట నాకు అర్ధం కాలేదు. అప్పుడు మా తమ్ముడిని అడిగితె చెప్పాడు అది తమిళ్ హీరో "శింభు" పాడిన "Love Anthem For World Peace" అన్న పాట ఆని చెప్పి, పాట చాలా బాగుందక్కా ,మీనింగ్ బాగుంది నువ్వు కూడా చూడు అని సాంగ్ లింక్ ఇచ్చాడు.

నాకు కూడా ఈ పాట నచ్చింది. ఈ మధ్య ధనుష్,నితిన్ ఇలా సినిమా హీరోలంతా పాటలు పాడేస్తున్నారు కదా అలాంటి ప్రయత్నమే "శింభు" కూడా చేశాడు. ప్రపంచంలోని వివిధ భాషల్లో ప్రేమ అనే పదాన్ని ఉపయోగించి, ప్రపంచవ్యాప్తమైన ప్రేమను, మానవత్వాన్ని కోరుకుంటూ,మనకు వున్న ఈ ఒక్క జీవితాన్ని ద్వేషంతో ,పగలు,ప్రతీకారాలతో వేస్ట్ చేసుకోవద్దని, "All We Need Is Love" అంటూ "శింభు" రాసి తానే స్వయంగా పాడి,27 December 2011 న రిలీజ్ చేసిన ఈ పాట బాగుంది...


♥♥ Love Anthem For World Peace ♥♥




dashuri dashuri
dashuri dashuri
salang salang
leifde leifde
las'ka las'ka

armastus armastus
rakkaus rakkaus
ag'api ag'api
lyubov lyubov

all we need is
love..aai..amour..amour
all we need is
love..aai..amour..amour

all we need is
love..aai..amour..amour
all we need is
love..aai..amour..amour..amour

love is full of energy
love is positivity
we don't need negativity
love to feel humanity

lets not cry and lets not try
hating,hurting and killing each other
we wont get another
life together
oh my brother

all we need is
pyaar..prema..kaadhal
all we need is
pyaar..prema..kaadhal..kaadhal

Music, Lyrics & Sung By
Simbu


All the following words denotes love in different languages.


♥Love - English
♥dashuri - Albanian
♥salang - Korean
♥leifde - Dutch
♥las'ka - Czech
♥armastus - Estonian
♥rakkaus - Finnish
♥ag'api - Greek
♥lyubov - Russian
♥Aai - Chinese
♥Amour - French/Spanish
♥Pyaar - Hindi
♥Prema - Telugu
♥Kaadhal - Tamil


7, జులై 2012, శనివారం

ఆషాఢం --- గోరింటాకు


హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ??? సుమారు 2 నె తర్వాత ఈ రోజే నా చిన్నిప్రపంచం లోకి వచ్చాను. చాలా రోజులైనట్లుగా వుంది బ్లాగ్ లో పోస్ట్ లు పెట్టి.ఈ మధ్య కొన్ని కారణాల వలన బ్లాగ్ రాయటం కుదరలేదు. కానీ ఈ రోజు మాత్రం తప్పకుండా మీ అందరితో మాట్లాడాలనిపించింది అందుకే ఈ పోస్ట్.. కొన్ని సార్లు ఎంత బిజీగా వున్నా,ఎన్ని చికాకులు వున్నా ఇష్టమైన పని చేయటం ఎప్పుడూ కష్టంగా అనిపించదేమో అలాంటిదే ఈ "నా చిన్ని ప్రపంచం" కూడా...


ఆషాఢం.........
కొత్త
జంటల్ని విడదీసి , ఎడబాటు కలిగించి,ఒకరి తలపుల వానలో మరొకరు తడిచి పోయేలా చేసి,విరహము కూడా మధురమే కదా అనుకునేలా చేసేది ఆషాఢం.
ఆషాఢం శూన్యమాసమని శుభకార్యాలు కూడా వాయిదా వేస్తారు కానీ ఈ నెలలో వచ్చే తొలి ఏకాదశి,జగన్నాధ రధయాత్ర, గురు పౌర్ణమి,బోనాలు ఇలా అందరూ భక్తిగాఆచరించే పర్వదినాలు,ఉత్సవాలు ఈ మాసంలో వున్నాయి.
వర్షాకాలం మొదలయ్యి నల్ల మబ్బులు కమ్ముకునే మాసం
ఆషాఢం.. ఐతే ఈ నెలలో కనిపించే మేఘాలు అంతగా కురవ వట .. దట్టంగా కమ్ముకుని వర్షం పడుతున్నట్లే అనిపించి చెదిరిపోతాయట . అందుకే నమ్మించి మోసం చేసే వాళ్ళను ఆషాఢభూతులు అంటారట.

ఆషాఢం గురించి అందరూ ఇప్పటికే చెప్పేసి ఉండొచ్చు, అందుకే ఆషాఢంలో నాకు ఇష్టమైన గోరింటాకు గురించి చెప్పాలనిపించింది. ఆషాఢంలోముఖ్యమైన ఆచారం గోరింటాకు పెట్టుకోవటం అంటే చాలా ఇష్టం నాకు.
ఈ గోరింటాకు వెనకటి రోజుల్లో ఇంట్లో పెరటిలో, తోటల్లో వున్న చెట్లకి గోరింటాకు కోసుకు వచ్చి , రోటిలో వేసి మజ్జిగ,చింతపండు ,రేగి కాసు వేసి, మెత్తగా అయ్యేదాకా కష్టపడి రుబ్బి,ఇంట్లో ఆడపిల్లలందరూ పోటీ పడి గోరింటాకు పెట్టుకునే వారట మా అమ్మ చెప్తుంటారు.మళ్ళీ ఆ గోరింటాకు పండటానికి తీసుకునే జాగ్రత్తలు కూడా వుండేవట.

ఇప్పుడు అంత కష్టం ఏమీ లేకపోయినా పచ్చి గోరింటాకు దొరకటం మాత్రం చాలా కష్టం.. కోన్ మేహేంది ఎంత అందంగా పెట్టినా గోరింటాకు పెట్టుకున్నంత అందం,కళ వుండదు. అందుకే ఈ ఆషాఢంలో ప్రత్యేకమైన గోరింటాకును కొనుక్కుని
గోరింటాకు సరదా తీర్చేసుకున్నాము.ఎర్రగా పండిన ఆ గోరింటాకు అందం,సువాసన ఇష్టపడని వాళ్ళు వుండరేమో..



Related Posts Plugin for WordPress, Blogger...