పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

11, జులై 2012, బుధవారం

♥♥ ప్యార్ ... ప్రేమ ... కాదల్ ...Love Anthem For World Peace ♥♥


మానవత్వాన్ని మించిన మతం లేదు.. మానవత్వం అంటే బాధల్లో ఉన్నవారి మీద జాలి చూపించటం,ఆపదలో వున్న వారిని ఆదుకోవటం,సాటి ప్రాణిని హింసించి మనం ఆనందించకపోవటం,కులమతాలకు,దేశ భాషలకు అతీతంగా మనుషులందరినీ ప్రేమించగలగటం...ప్రేమ అన్న పదానికి చాలా పరిమితమైన పరిధి అందరికీ వుంటుంది.

ప్రేమ ఇద్దరు ప్రేమికుల మధ్య మాత్రమే కాదు తన కుటుంబాన్ని,తన చుట్టూ వున్న మనుషుల్ని,జీవరాశిని ప్రేమించే వ్యక్తిత్వాన్నే మానవత్వం అంటాము. ప్రేమ ఇద్దరు లేదా కొందరు మనుషుల మధ్య మాత్రమే వుండదు... కొందరు దేవుడిని ప్రేమిస్తారు, కొందరు చేసే పనిని ప్రేమిస్తారు,కొందరు వస్తువులను,ఆస్తులను ప్రేమిస్తారు,కొందరు ఇష్టమైన భోజనాన్ని ప్రేమిస్తారు, ఇలా ప్రేమ అనేక రకాల "భావాల నిధి" అని చెప్పొచ్చు..

సాటి మనిషికి సహాయం చేయటం,ప్రేమించటం అంటే మన ఆస్తిపాస్తులు,కుటుంబం అన్నిటినీ త్యాగం చేయాల్సిన అవసరం లేదు బాధలో వున్న మనిషికి చిన్న ఓదార్పు మాట చెప్పగలగటం, మన మాటలు,చేతల వల్ల సాటి మనిషికి ద్రోహం చేయకపోవటం కూడా మానవత్వమే. కానీ ప్రతి మనిషికీ తనకంటూ కొన్ని ఆలోచనలు వుంటాయి,తన జీవితంలో ఎవరికి ఏమి చెయ్యాలి,ఎవరికి తన ప్రేమను పంచాలి,ఎలా సమాజంలో మనుగడ సాగించాలి అనే విషయంలో ఎవరి పరిధులు వాళ్లకుంటాయి. మనుషులందరూ మదర్ థెరీసా లాగా సంఘ సేవకులు కాలేరు కానీ మానవత్వం వున్న మనుషుల్లాగా దయతో ఎదుటివారిని ఆదరించగలగాలి. ప్రేమ అనేది "మరొకరి సంతోషాన్ని చూసి ఆనందించగలగటం ".

ఒక్కోసారి నాకు అనిపిస్తుంది దేవాలయాలకు,స్వామీజీలకు లక్షలు లక్క్షలు పెట్టి బంగారు కిరీటాలు,తొడుగులు చేయించే అజ్ఞాత భక్తులు ఆ డబ్బేదో ఏదో ఒక అనాధాశ్రమానికో,పేదలకో ఇవ్వొచ్చు కదా,ఆ ఇచ్చిన విరాళాలను తీసుకున్న వారు సక్రమంగా ఖర్చు పెట్టొచ్చుకదా అని... కానీ మళ్ళీ నా మనసుకే అనిపిస్తుంది ఒకరి ఆలోచనలను నియంత్రించటానికి,నిర్ణయించటానికి మనకేమి హక్కుంది?? నా ఆలోచన నాకున్నట్లే ఎవరి రీజనింగ్ వాళ్ళకుంటుంది కదా అని.. "ఇంట గెలిచి రచ్చ గెలవమన్నట్లు" ఏదైనా మనం పాటించి ఎదుటివాళ్ళకి చెప్పటం మంచిది కదా..


"మనుషులంటే రాయిరప్పలకన్న కనిష్టం గానూ చూస్తావేల బేలా?
దేవుడెక్కడో దాగెనంటూ కొండకోనల వెతుకులాడేవేలా?
కన్ను తెరచిన కానబడడో? మనిషి మాత్రుడియందు లేడో?
యెరిగి కోరిన కరిగి యీడో ముక్తి?"
--గురజాడ

ఇప్పుడింతకీ నేను ఈ మానవత్వం, ప్రేమ అన్న విషయాల గురించి ఎందుకు చెప్తున్నానంటే మా తమ్ముడి ఫోన్ కి కాల్ చేస్తే కాలర్ టోన్ గా ఒక పాట వస్తుంది.. అది మన తెలుగు కాదు,తమిళ్ కాదు ఏదేదో వచ్చేస్తున్నాయి.. ఇదేంటా అని ఎన్నిసార్లు విన్నా పాట నాకు అర్ధం కాలేదు. అప్పుడు మా తమ్ముడిని అడిగితె చెప్పాడు అది తమిళ్ హీరో "శింభు" పాడిన "Love Anthem For World Peace" అన్న పాట ఆని చెప్పి, పాట చాలా బాగుందక్కా ,మీనింగ్ బాగుంది నువ్వు కూడా చూడు అని సాంగ్ లింక్ ఇచ్చాడు.

నాకు కూడా ఈ పాట నచ్చింది. ఈ మధ్య ధనుష్,నితిన్ ఇలా సినిమా హీరోలంతా పాటలు పాడేస్తున్నారు కదా అలాంటి ప్రయత్నమే "శింభు" కూడా చేశాడు. ప్రపంచంలోని వివిధ భాషల్లో ప్రేమ అనే పదాన్ని ఉపయోగించి, ప్రపంచవ్యాప్తమైన ప్రేమను, మానవత్వాన్ని కోరుకుంటూ,మనకు వున్న ఈ ఒక్క జీవితాన్ని ద్వేషంతో ,పగలు,ప్రతీకారాలతో వేస్ట్ చేసుకోవద్దని, "All We Need Is Love" అంటూ "శింభు" రాసి తానే స్వయంగా పాడి,27 December 2011 న రిలీజ్ చేసిన ఈ పాట బాగుంది...


♥♥ Love Anthem For World Peace ♥♥




dashuri dashuri
dashuri dashuri
salang salang
leifde leifde
las'ka las'ka

armastus armastus
rakkaus rakkaus
ag'api ag'api
lyubov lyubov

all we need is
love..aai..amour..amour
all we need is
love..aai..amour..amour

all we need is
love..aai..amour..amour
all we need is
love..aai..amour..amour..amour

love is full of energy
love is positivity
we don't need negativity
love to feel humanity

lets not cry and lets not try
hating,hurting and killing each other
we wont get another
life together
oh my brother

all we need is
pyaar..prema..kaadhal
all we need is
pyaar..prema..kaadhal..kaadhal

Music, Lyrics & Sung By
Simbu


All the following words denotes love in different languages.


♥Love - English
♥dashuri - Albanian
♥salang - Korean
♥leifde - Dutch
♥las'ka - Czech
♥armastus - Estonian
♥rakkaus - Finnish
♥ag'api - Greek
♥lyubov - Russian
♥Aai - Chinese
♥Amour - French/Spanish
♥Pyaar - Hindi
♥Prema - Telugu
♥Kaadhal - Tamil


17 కామెంట్‌లు:

భాస్కర్ కె చెప్పారు...

an eternal truth, love.
manchi paata nu parichayam chesaaru, anni, languages ivvadam bhagundi. thank you.

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

"the tree" గారూ...
పాట,పోస్ట్ నచ్చినందుకు,మీ అభిప్రాయం తెలిపినందుకు థాంక్సండీ..

Meraj Fathima చెప్పారు...

రాజి గారూ, జాతి, కులం, మతం మరియు భాషలకు అతీతమైన ప్రేమ గురించి బాగా రాశారు. పాట, సంగీతం బాగున్నాయి. We wont get another life together. very nice.

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

"meraj fathima" గారూ..
పోస్ట్ నచ్చినందుకు, మీ అభినందనలకు థాంక్సండీ..

"We wont get another life together".
నాకు కూడా ఈ లైన్ చాలా నచ్చింది.

రవిశేఖర్ హృ(మ)ది లో చెప్పారు...

ప్రపంచమంతా ప్రేమ భావం ప్రతి ఒక్కరిని కదిలిస్తుంది.మీరు ఈ పోస్ట్ ఎన్నుకోవటం ,మరియు పాట చాలా బాగున్నాయి.

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

"oddula ravisekhar" గారూ..
పోస్ట్ నచ్చినందుకు,మీ అభిప్రాయం తెలిపినందుకు థాంక్సండీ..

జలతారు వెన్నెల చెప్పారు...

పాట బాగుంది రాజి గారు. ప్రేమ గురించి చక్కగా రాసారు.

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

"జలతారువెన్నెల" గారూ..
పోస్ట్ నచ్చినందుకు,మీ అభిప్రాయం తెలిపినందుకు థాంక్సండీ..

Padmarpita చెప్పారు...

అంతా ప్రేమమయం
మీ చిన్ని ప్రపంచమంతా అదే మయం.
పాట, పోస్ట్ రెండు బాగున్నాయండి!

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

"Padmarpita" గారూ...
మీరన్నట్లు నా చిన్నిప్రపంచం ఎప్పుడూ ప్రేమమయం కావాలన్నదే నా కోరిక కూడా :)

అభిమానంతో మీరిచ్చిన ప్రశంశకు థాంక్సండీ..

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

రాజీ గారు..ఈ పోస్ట్ నాకు చాలా బాగా నచ్చింది. మీరు ప్రేమ కి చెప్పిన నిర్వచనం.. పాట సాహిత్యం..ఇతర భాషల లో ప్రేమని ఏమంటారో.. చాలా బాగా చెప్పారు.
మంచి టపా అందించినందుకు థాంక్ యు వేరి మచ్!!

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

"వనజవనమాలి" గారూ ..
మనందరి జీవితాల్లోను చాలా ముఖ్యపాత్ర వహించే భావన ప్రేమ!
ప్రేమ గురించి నేను చెప్పింది చాలా తక్కువేమో..

పాట సాహిత్యం, అన్ని భాషల్లో ప్రేమను ఏమంటారో చెప్పిన నా ప్రయత్నం, మొత్తానికి ఈ పోస్ట్ మీకు చాలా నచ్చినందుకు సంతోషమండీ..

పోస్ట్ నచ్చినందుకు, మీ అభినందనలకు థాంక్సండీ..

శ్రీ చెప్పారు...

చాలా బాగుంది రాజి గారూ!
మీరు ప్రేమ గురించి వేర్వేరు భాషల్లో చెప్పింది చూస్తె..
మల్లాది...సావిరహే గుర్తొస్తోంది...
తర్వాత i love you చెప్పడం
ఓ వంద భాషల్లో తెలుసుకొని నోట్ చేసుకున్నాను..
ఈ మధ్య నెట్లో కూడా లింక్ ఎక్కడో చూసాను....:-))..(just kidding)
పాట కూడా బాగుంది ..
అభినందనలు మీకు..
@శ్రీ

జ్యోతిర్మయి చెప్పారు...

రాజి గారూ చాన్నాళ్ళయింది మీరు కనిపించి మీరు రాకపోతే చిన్నిప్రపంచం బెంగెట్టేసుకోదూ...

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

@"శ్రీ" గారూ..
మల్లాది...సావిరహే నేను కూడా చదివానండీ సరదాగా బాగుంటుంది స్టోరీ..

ఇంక "i love you చెప్పడం
ఓ వంద భాషల్లో తెలుసుకొని నోట్ చేసుకున్నాను.."
అన్నారు కదా..

మరి దాన్ని మీ బ్లాగ్ లో పోస్ట్ చేసెయ్యండి అవసరమైన వాళ్ళకి ఉపయోగపడుతుంది కదా :)

పాట,పోస్ట్ నచ్చినందుకు,మీ అభినందనలకు థాంక్సండీ..

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

"జ్యోతిర్మయి" గారూ..
నిజమేనండీ ఈ మధ్య చాలా రోజులయ్యింది నా చిన్నిప్రపంచానికి రాక..

ఇప్పటి నుండి మళ్ళీ రెగ్యులర్ గా మిమ్మల్నందరినీ పలకరించాలనుకుంటున్నాను..
మీ అభిమానానికి థాంక్సండీ..

శ్రీ చెప్పారు...

vaddulendi raji gaaroo!
naa blog ni ila undanivvandi...
:-))...))
@sri

Related Posts Plugin for WordPress, Blogger...