పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

28, మే 2011, శనివారం

అసలైన విప్లవం జరగవలసినది హృదయంలో ....


జిడ్డు కృష్ణమూర్తి మే 12, 1895 ఆంధ్ర ప్రదేశ్ లోని మదనపల్లెలో జన్మించారు.
ప్రముఖ తత్వవేత్త. 1929 నుండి 1986లో తను మరణించే వరకు
ప్రపంచం నలుమూలల అనేక ప్రసంగాలు చేశారు..

అసలైన విప్లవం జరగవలసినది హృదయపు లోతులలో.
మనిషిలో సమూలమైన పరివర్తన కలగపోతే యుద్ధాలు, హింసాకాండ,
విధ్వంసము ఇట్లాగే కొనసాగుతూ వుంటాయి.
మనిషి తనంతట తానుగా భయం, కట్టుబాట్లు, అధికారం మరియు మూఢవిశ్వాసాల
నుండి విముక్తి చెందాలని భోధించారు..






27, మే 2011, శుక్రవారం

అంజనీపుత్రా పవనసుత నామా...



నిన్న గురువారం అని సాయిబాబా గుడికి వెళ్ళాము.అక్కడ పూజారి గారు రేపు హనుమజ్జయంతి
మీరు తప్పకుండా రండి వ్రతం చేద్దురుగాని ఈ వ్రతం చేసుకుంటే అంతా మంచి జరుగుతుంది... అని చెప్పారు.
నాకు కూడా పూజలు అంటే ఇష్టమే కాబట్టి పైగా అనుకోకుండా బాబా గుడికి వెళితే
పూజ గురించి కూడా తెల్సింది అనుకుని ఇవాళ వెళ్లి హనుమత్ వ్రతం చేసుకున్నాము.
పూజ చాలా బాగా జరిగింది...పూజలో కూర్చున్న అందరికీ ఆంజనేయస్వామి డాలర్
ఇచ్చి దానికి పూజ చేయించారు..అనుకోకుండా వ్రతం చేసుకోవటం చాలా సంతోషం అనిపించింది..
ఆ ఆంజనేయుడు అందరినీ తన చల్లని చూపులతో ఎల్లప్పుడూ కాపాడాలని కోరుకుంటున్నాను....

ఈ ఫొటోస్ మేము లాస్ట్ ఇయర్ విజయవాడ వెళ్ళినప్పుడు గుంటూరు బైపాస్ రోడ్డులో వున్న
ఆంజనేయస్వామివి...
సుమారు 74 అడుగుల ఎత్తులో ఆకాశంలోకి ఎదిగి... మేఘాలను తాకుతున్నట్లుగా వుండే ఈ ఆంజనేయుడిని
ఎంతసేపు చూసినా తనివితీరదు అన్నట్లుగా వుంటుంది..




అందరికీ హనుమజ్జయంతి శుభాకాంక్షలు..


26, మే 2011, గురువారం

Chocolate ( Sweet ) Memories ...


చిన్నప్పటి నుండి చాక్లెట్స్ అంటే నాకు చాలా ఇష్టం.స్కూల్ కి వెళ్లేముందు తమ్ముడు,నేను
ఇద్దరం ముందు షాప్ కి వెళ్లి చాక్లెట్స్ కొనుక్కుని అప్పుడు స్కూల్ కి వెళ్ళే వాళ్లము.
చాక్లెట్స్ తినే అలవాటు నాకు ఇప్పటికీ పోలేదు...
Chocolate ( Sweet ) Memories ...























24, మే 2011, మంగళవారం

Life Is A Challenge ... Meet It


జీవితం అందమైనది... ఆరాధించండి.
జీవితం ఒక సవాల్... స్వీకరించండి
జీవితం ఒక విధి... నిర్వర్తించండి.
జీవితం ఒక ఆట... ఆడండి.
జీవితం ఒక ప్రమాణం...కట్టుబడి ఉండండి.
జీవితం ఒక పాట... పాడండి.
జీవితం ఒక పోరాటం... పోరాడండి.
జీవితం ఒక సాహసం ... తెగించండి.
జీవితం
ఒక అద్రుష్టం ... గెలుచుకోండి.
జీవితం అమూల్యం... నాశనం చేసుకోకండి.



22, మే 2011, ఆదివారం

చీకటి తో వెలుగే చెప్పెను నేనున్నానని


ప్రతి మనిషికి జీవితంలో ఎన్నో ఆటుపాట్లు ఎదురవుతాయి..
కష్టాలు,సుఖాల సమ్మేళనమే జీవితం.
అలాంటి పరిస్థితుల్లో ఎవరో వస్తారని, ఏదో చేస్తారని మనల్ని ఓదారుస్తారని..
ఎదురుచూడకుండా మనంతట మనం ఓటమిని గెలుపుగా మార్చుకోవాలి.
మన అంతరాత్మ మనకి తోడుగా ముందుకు సాగిపోవాలి ...

నీకు నేనున్నాను అని చెప్పే మనిషి తోడు ప్రతి ఒక్కరి జీవితంలో తప్పకుండా ఉంటుంది..
ఒకవేళ లేకపోయినా మన ఆత్మావిశ్వాసమే మన తోడుగా సాగిపోవాలని
"నేనున్నాను" సినిమాలో "చంద్రబోస్" గారు రాసిన ఈ పాట నాకు చాలా ఇష్టం.
నాకు నచ్చిన పాటలను వీడియో మిక్సింగ్ చేయటం నా హాబీ..

నేను సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన... చీకటితో వెలుగే చెప్పెను నేనున్నానని...




చీకటి తో వెలుగే చెప్పెను నేనున్నానని

ఓటమితో గెలుపే చెప్పెను నేనున్నానని
నేనున్నానని నీకేం కాదని...నిన్నటి వ్రాతని మార్చేస్తానని

తగిలే రాళ్ళని పునాది చేసి ఎదగాలని
తరిమే వాళ్ళని హితులుగా తలచి ముందు కేళ్లాలని
కన్నుల నీటిని కలల సాగుకై వాడుకోవాలని
కాల్చే నిప్పుని ప్రమిదగా మలచి కాంతి పంచాలని

గుండెతో తో ధైర్యం చెప్పెను...చూపుతో మార్గం చెప్పెను
అడుగు తో గమ్యం చెప్పెను నేనున్నానని
నేనున్నానని నీకేం కాదని...నిన్నటి వ్రాతని మార్చేస్తానని

శ్వాసతో శ్వాసే చెప్పెను
మనసుతో మనసే చెప్పెను
ప్రశ్నతో బదులే చెప్పెను నేనున్నానని
నేనున్నానని నీకేం కాదని...నిన్నటి వ్రాతని మార్చేస్తానని

చీకటి తో వెలుగే చెప్పెను నేనున్నానని
ఓటమితో గెలుపే చెప్పెను నేనున్నానని
నేనున్నానని నీకేం కాదని...నిన్నటి వ్రాతని మార్చేస్తానని


20, మే 2011, శుక్రవారం

వంశీ --- వయ్యారి గోదారి






తెలుగు సినిమాల్లో నాకు ఎక్కువగా నచ్చే సినిమాలు...
ఇప్పటికీ, ఎప్పటికీ Ever Green అనిపించుకునే సినిమాలు దర్శకుడు వంశీ గారివి.
ఈయన సినిమాల్లో గోదావరి అందాలను చాలా చక్కగా చూపిస్తారు.
గోదావరి అందాలతో పోటీ పడేలా వుండే కధానాయిక వంశీ సినిమా ప్రత్యేకత.
కధానాయిక పాత్ర,కట్టుబొట్టు చాలా బాగుంటుంది.
కాటుకకళ్ళు ,వాలుజడ,కాటన్ చీర,పెద్ద నల్లటి బొట్టు,చూడగానే వంశీ హీరోయిన్ అని చెప్పగలిగే ప్రత్యేకత
వంశీ వయ్యారి గోదారమ్మ సొంతం ... వీళ్ళలో ప్రత్యేకస్థానం భానుప్రియకే అని నా అభిప్రాయం..

కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి
విశ్వనాధ పలుకై అది విరుల తేనె చినుకై
కూనలమ్మ కులుకై అది కూచిపూడి నడకై
పచ్చని చేల పావడగట్టి...కొండమల్లెలే కొప్పునపెట్టి
వచ్చే దొరసాని ... మా వన్నెల కిన్నెరసాని..
సితార 1984







దివిని తిరుగు మెరుపులలన సామజవరగమనా
కరుణ కరిగి భువికి దిగిన సామజవరగమనా
లాయర్ సుహాసిని





మాటరాని
మౌనమిది మౌనవీణ గానమిది.
మహర్షి 1988



వెన్నెలై పాడనా
నవ్వులే పూయనా
శ్రీకనక మహాలక్ష్మి రికార్డింగ్ డాన్సు ట్రూప్ 1988






అల్లిబిల్లి
కలల రావే అల్లుకున్న కధలా రావే
మల్లెపూల చినుకై రావే పల్లవించు పలుకై రావే
వేచే ఎదలో వెలుగై రావే...
చెట్టు కింద ప్లీడర్ 1989



ఎక్కడికీ
పరుగు ఎందుకనీ ఉరుకు
నీకోసం నేనుండగా మరి ముందుకు పోతావే అలా
w/o v వరప్రసాద్ 1997






ఎన్నెన్నోవర్ణాలు
అన్నిట్లో అందాలూ
ఒకటైతే మిగిలేది నలుపేనండి...
అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు.2002






నువ్వక్కడుంటే
నేనిక్కడుంటే ప్రాణం విలవిల
గోపి గోపిక గోదావరి 2009







19, మే 2011, గురువారం

My Favorite Buddha Quotes About Life


వైశాఖ పౌర్ణమి బుద్ధజయంతి సందర్భంగా నాకు నచ్చిన కొన్ని బుద్ధుని సందేశాలు...
Buddha Quotes given below are just few words
or a couple of sentences,

but they have a meaning that is deeper and far reaching.














16, మే 2011, సోమవారం

సిద్ధార్థ లా కాలేజ్ Silver Jubilee Celebrations




మా కాలేజ్ Silver Jubilee Year Celebrations కి ఆహ్వానిస్తూ
ఓల్డ్ స్టూడెంట్ రాజి కి (నేనే) పంపిన ఆహ్వానపత్రిక.


15, మే 2011, ఆదివారం

అంతర్జాతీయ కుటుంబ దినోత్సవ శుభాకాంక్షలు...


ఇల్లంటే నలుగురు మనుషులు ప్రేమ,ఆప్యాయతలతో బంధించబడవలసిన నిలయమే కానీ,
పదిమంది శత్రువులు తమ తమ గదుల్లో వ్యూహాలు పన్నుతూ తప్పనిసరిగా
కలిసి బ్రతకాల్సి వచ్చే ఒక వలయం కాదు..
మనషి బంధించబడాల్సింది ప్రేమానురాగాలతోనే కానీ conditions,Rules తో కాదు.
కుటుంబంలో కష్టం వచ్చినప్పుడు ఒకరి మీద ఒకరికి ప్రేమాభిమానాలు వుండటం సహజమే కానీ
ఆ ప్రేమ ఎప్పుడూ ఒకరి మీద ఒకరికి ఉన్నప్పుడే అది గొప్ప కుటుంబం అవుతుంది...

కుటుంబంలోని ప్రేమానురాగాలు,క్రమశిక్షణ ఒక మనిషిని మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిగా తయారు చేస్తాయి.
అదే కుటుంబంలోని బాధ్యతారాహిత్యం,అవసరానికి మించిన నియంతృత్వం ఇంకొక మనిషిని మానసికంగా కుంగదీస్తుంది... లేదా సంఘ వ్యతిరేకులుగా తయారు చేస్తుంది..

మంచి వివాహమే మంచి దాంపత్యం
మంచి దాంపత్యమే మంచి సంతానం
మంచి
సంతానమే మంచి సమాజం
మంచి
సమాజమే మంచి ప్రపంచం


అంతర్జాతీయ కుటుంబ దినోత్సవ శుభాకాంక్షలు...

Related Posts Plugin for WordPress, Blogger...